హీరోయిన్‌తో స్టార్‌ హీరో పెళ్లి? | Unni Mukundan Responds On Wedding Rumours with Anusree | Sakshi
Sakshi News home page

Unni Mukundan: హీరోయిన్‌తో పెళ్లి? మలయాళ హీరో ఏమన్నాడంటే?

Published Tue, Feb 13 2024 4:36 PM | Last Updated on Tue, Feb 13 2024 4:43 PM

Unni Mukundan Responds On Wedding Rumours with Anusree - Sakshi

మలయాళంలోని హ్యాండ్సమ్‌ హీరోల్లో ఉన్ని ముకుందన్‌ ఒకరు. జనతా గ్యారేజ్‌, భాగమతి, ఖిలాడి, యశోద సినిమాలతో తెలుగువారికీ ఈయన సుపరిచితుడయ్యాడు. 36 ఏళ్ల వయసున్న ఈ హీరో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఒకప్పుడు హీరోయిన్‌గా నటించి ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తున్న అనుశ్రీతో కొత్త జీవితం ఆరంభించబోతున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరు ఓ ఈవెంట్‌లోనూ కలిసి కనిపించడంతో ఇది నిజమేనని నెటిజన్లు సైతం అభిప్రాయపడ్డారు.

తాజాగా ఈ వార్తలపై ఉన్నిముకుందన్‌ స్పందించాడు. తన పెళ్లి గురించి తప్పుడు సమాచారం పోస్ట్‌ చేసిన వ్యక్తిని ఉద్దేశిస్తూ.. 'ఇలాంటి ఫేక్‌ న్యూస్‌ ప్రచారం చేయకుండా ఆపడానికి నీకెంత డబ్బివ్వాలో చెప్పు..' అని మండిపడ్డాడు. దీంతో హీరోహీరోయిన్ల పెళ్లంటూ వస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది.

చదవండి: మొదటి భార్యకు అందుకే విడాకులు.. ఆమె రెండో భర్త నా కొడుకును..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement