![Unni Mukundan's female get up in 'Chanakyathanthram' - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/7/unni-mukundan.jpg.webp?itok=kqrcbIjm)
ఉన్ని ముకుందన్
అనుష్క టిప్స్ ఉపయోగపడ్డాయి ... అంటున్నారు మలయాళ నటుడు ఉన్ని ముకుందన్. ‘భాగమతి’లో అనుష్క పక్కన ఉన్ని ముకుందన్ యాక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఉన్ని నటించబోయే తదుపరి సినిమా ‘చాణక్య తంత్రం’లో ఐదు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. అందులో లేడీ గెటప్ కూడా ఒకటి. ‘‘ఆడవాళ్లు ఎలా నడుస్తారు.
వాళ్ల డ్రెస్సింగ్ స్టైల్, మేకప్ ఎలా వేసుకుంటారు? అనే చాలా విషయాల్లో అనుష్క టిప్స్ ఇచ్చారు. ‘భాగమతి’ టైమ్‌లో ఈ క్యారెక్టర్ గురించి అనుష్కతో డిస్కస్ చేశాను. తను చాలా ఇన్‌పుట్స్ ఇచ్చింది. ఈ లేడీ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు అనుష్క ఇచ్చిన టిప్స్ చాలా ఉపయోగపడ్డాయి’’ అన్నారు ఉన్ని ముకుందన్.
Comments
Please login to add a commentAdd a comment