lady getup
-
Jabardasth Mohan: జబర్దస్త్ లేడీ గెటప్ కమెడియన్ పెళ్లి (ఫోటోలు)
-
జబర్దస్త్ వినోద్‌కి ఏమైంది? ఇలా మారిపోయాడేంటి?
జబర్దస్ధ్ షో ద్వారా కమెడియన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వాళ్లలో వినోద్ ఒకరు. ముఖ్యంగా లేడీ గెటప్స్‌తో పాపులర్ అయిన వినోద్ ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆరోగ్యం బాలేక బక్కచిక్కి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. తాజాగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనారోగ్యం వెనకున్న కారణాన్ని బయటపెట్టాడు. 'నాకు లంగ్స్(ఊపిరితిత్తులు)లో ఇన్ఫెక్షన్ వచ్చింది. దీనివల్లే ఇలా వీక్ అయ్యాను. ఎక్కువగా ప్రయాణాలు చేయడం, ఏసీలో ఎక్కువసేపు ఉండటం, చల్లటీ నీళ్లు తాగడం, ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం వల్ల ఇలా అయ్యింది. ఈ సమస్య వచ్చిన కొత్తలో నడవడం కూడా కష్టమైపోయింది. ఆ సమయంలో నాకు ఫ్యామిలీ అండగా నిలబడింది. మెడిసిన్స్ వల్ల హెయిర్ లాస్ కూడా అయ్యిందని, అయితే ప్రస్తుతం తాను కోలుకుంటున్నాను' అని పేర్కొన్నాడు. -
‘మగాడు ఇలా చేయాలంటే కత్తిమీద సామే’
సాక్షి, యడ్లపాడు/గుంటూరు: చిన్ననాటి నుంచే అతనికి సినిమాలంటే ఎంతో ఇష్టం.. ఆ ఇష్టమే అతని ఆశయసాధన దిశగా అడుగులు వేయించింది. ఎందరో కళాకారులను అక్కున చేర్చుకునే కళామతల్లి ఒడిలో ఒదిగేలా చేసింది. బుల్లితెర, వెండితెర నటుడిగా మారేలా చేసింది. అతడే హాస్యనటుడు హర్షిత. ఇది ఇండస్ట్రీలో పిలుచుకునే అతని ముద్దుపేరు. అసలు పేరు గౌస్‌బాష. చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామానికి చెందిన గోనె సంచుల వ్యాపారి మాబుసుభాని, మహబ్బీ దంపతుల పెద్ద కుమారుడు. స్త్రీ, పురుష పాత్రల్లో వేషం ఏదైనా నటన అదరహో అనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఉద్యోగం కోసమంటూ హైదరాబాద్‌కు.. మొదటినుంచి గౌస్‌బాష సినిమాలను ఎక్కువగా చూసేవాడు. కళపై మక్కువో.. నటుడు కావాలన్న కోరిక తెలియదు కాని ఇంటర్‌తోనే విద్యకు ఫుల్స్టాప్ పడింది. తల్లిదండ్రులు చూపిన విద్యమార్గం కంటే తాను ఎంచుకున్న రంగంపైనే అభిలాష ఎక్కువగా పెంచుకున్నాడు. ఇంటర్, ఏసీ మెకానికల్ ఐటీఐను అతికష్టం మీద పూర్తి చేశాడు. ఆరో తరగతి నుంచే కళారంగం అంటే ఇష్టత ఏర్పడిందని తాను కళాకారుడిగానే జీవితంలో గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలు కన్నానని కుటుంబసభ్యులకు చెప్పాడు. పగటి కలలు కనకు అంటూ కుటుంబసభ్యులు తోసిపుచ్చారు. ఊళ్లో ఇది విన్నవారు కామెడీ చేస్తున్నావా అంటూ ఎద్దేవా చేశారు. ఆ మాటలు విన్న అతనిలో తన ఆశయం సాధించాలన్న కసి మరింతగా పెరిగింది. జాబ్ నిమిత్తమంటూ ఊరు విడిచి హైదరాబాద్ చేరుకున్నాడు. నిరాశ ఎదురైనా పట్టు వీడలేదు తనకు ఎంతటి పట్టుదల ఉన్నా, తనలో ఎంతటి ప్రతిభ ఉన్నా గుర్తించే వ్యక్తి అవకాశం కోసం విశ్వప్రయత్నాలు చేశాడు. మూడేళ్లు గడిచాయి. ఒక్క అవకాశమూ తలుపు తట్టలేదు. జరిగిందేదో జరిగింది. ఇంటికి వచ్చేయమంటూ కుటుంబసభ్యులు, మిత్రులు సలహా ఇచ్చారు. అయినా లక్ష్యం సాధించే వరకు ఊరికి తన ముఖం చూపించకూడదనుకున్నాడు. 2018లో చివరిలో ఇండిపెండెంట్ పేరుతో రూపొందించే ఓ షార్ట్‌ఫిల్మ్‌లో అవకాశం లభించింది. అందులో తన నటనా కౌసల్యాన్ని అద్భుతంగా ప్రదర్శించాడు. అది బాగా వైరల్ కావడంతో ఆ ఫొటోలు చూసి బుల్లితెరలో నటించే అవకాశం లభించింది. ఇప్పుడు ఎన్నో అవకాశాలు... జెమినీలో జూలకటక, స్టూడియోవన్లో లాఫింగ్ అడ్డా, ఈటీవీ జబర్దస్త్, 108 తెలంగాణ చానల్లో గబ్బర్‌సింగ్ టెలీ కామెడీ షోలలో నటిస్తున్నాడు. దర్శకుడు మూర్తి.. బాషాను పిలిచి ముత్యాలముగ్గులో నటించే అవకాశం ఇచ్చి సీరియల్‌కు పరిచయం చేశారు. ఆ తర్వాత కాలేజీ పోరగాళ్లు, మళ్లీమళ్లీ చూశా, పుణ్యదంపతులు సినిమాల్లోనూ నటించాడు. వీటితోపాటు తనకు నటుడిగా గుర్తింపు తెచ్చిన షార్ట్ఫిల్మ్స్లో 20కు పైగా నటించాడు. వీటితో పాటు ప్రైవేట్ ఆల్బమ్ కవర్సాంగ్స్లోనూ నటిస్తున్నాడు. యూట్యూబ్ చానెల్స్ వారం వారం ప్రసారం చేసే యాదయ్య, యాదమ్మ ముచ్చట్లు, వారం వారం నీ కవితతో వంటి ప్రత్యేక ప్రోగ్రామ్స్‌లోనూ రాణిస్తున్నారు. స్త్రీ వేషధారణకు మంచి గుర్తింపు స్త్రీ వేషధారణలో హర్షిత పేరుతో చేస్తున్న కామెడీ పోగ్రామ్స్ గౌస్‌బాషాకు మంచి గుర్తింపును తీసుకువచ్చాయి. ఆడవారి హావభావాలు ప్రదర్శించడం ఆషామాషీ విషయం కాదు. అందుకు ఆహార్యం ఒక్కటే సరిపోదు. అందుకు తగ్గ అభినయం ఉండాలి. మాటాల్లో మృధుత్వం పలకాలి. సిగ్గు, బిడియం తొణికిసలాడాలి. అన్నింటికి మించి నడకలో వయ్యారాలు పోవాలి. వీటన్నింటి ఓ మగాడు చేయాలంటే కత్తిమీద సామువంటిదే. అదికూడా టెలీషోలో చేయడమంటే చాలా కష్టం. కళల పట్ల ఆసక్తి..కళాకారుడిగా నిరూపించుకోవాలన్న కసి ఉన్నప్పుడే అవి సాధ్యపడతాయని గౌస్‌బాషా నిరూపించాడు. పలు చానల్లో కామెడీ షోలలో హర్షిత పేరుతో స్త్రీ పాత్రలు పోషిస్తున్నాడు. -
అనుష్క టిప్స్ ఉపయోగపడ్డాయి
అనుష్క టిప్స్ ఉపయోగపడ్డాయి ... అంటున్నారు మలయాళ నటుడు ఉన్ని ముకుందన్. ‘భాగమతి’లో అనుష్క పక్కన ఉన్ని ముకుందన్ యాక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఉన్ని నటించబోయే తదుపరి సినిమా ‘చాణక్య తంత్రం’లో ఐదు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. అందులో లేడీ గెటప్ కూడా ఒకటి. ‘‘ఆడవాళ్లు ఎలా నడుస్తారు. వాళ్ల డ్రెస్సింగ్ స్టైల్, మేకప్ ఎలా వేసుకుంటారు? అనే చాలా విషయాల్లో అనుష్క టిప్స్ ఇచ్చారు. ‘భాగమతి’ టైమ్‌లో ఈ క్యారెక్టర్ గురించి అనుష్కతో డిస్కస్ చేశాను. తను చాలా ఇన్పుట్స్ ఇచ్చింది. ఈ లేడీ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు అనుష్క ఇచ్చిన టిప్స్ చాలా ఉపయోగపడ్డాయి’’ అన్నారు ఉన్ని ముకుందన్. -
గుర్తుపట్టారా?
ఈ ముసుగు వెనకాల దాక్కున్న ఆ ముఖం ఎవరిది? ఏ హీరోయిన్ అయ్యుంటుందా? అని ఆలోచనలో పడ్డారా? జస్ట్ ఎ మినిట్. ఆ బ్యూటిఫుల్ ఫేస్ హీరోయిన్‌ది కాదు.. హీరోది. నమ్మలేకపోతున్నారా? ఒట్టండి బాబూ. ఇంతకీ ఈ హీరోగారు ఎవరంటే.. చెబుతున్నాం.. చెబుతున్నాం.. చెప్పేస్తున్నాం. ఆయనెవరో కాదు.. విలక్షణ నటుడు ‘ఉపేంద్ర’. లేడీ గెటప్‌లో భలే అందంగా ఉన్నారు కదూ. కన్నడంలో ‘హోమ్ మినిస్టర్’ అనే చిత్రంలో నటిస్తున్నారాయన. అంటే.. పొలిటికల్ మినిస్టర్ కాదు... ఇంటి మినిస్టర్ అన్నమాట. రాజకీయాలతో సంబంధం లేదు. సినిమాలో ఓ కామెడీ సీన్ కోసం ఉపేంద్ర ఈ వేషం వేశారు. సార్.. ఇరగదీసి ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
లేడీ గెటప్‌లో సెన్సేషనల్ హీరో
కోలీవుడ్ లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ సేతుపతి. చిన్న పాత్రలతో కెరీర్ మొదలు పెట్టి ప్రస్తుతం స్టార్ ఇమేజ్ సాధించిన విజయ్.. మరో ప్రయోగం చేస్తున్నాడు. రఫ్ అండ్ టఫ్ లుక్ లో ఎప్పుడూ రూడ్, మాస్ పాత్రల్లో కనిపించే ఈ యాంగ్రీ హీరో ఓ సినిమాలో ఆడవేషంలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమా ఆన్ లోకేషన్ స్టిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న సినిమా సూపర్ డీలక్స్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి శిల్ప అనే మహిళ పాత్రలో కనిపించనున్నాడు. గతంలో చాలా మంది హీరోలు లేడీ గెటప్స్ లో కనిపించినా.. విజయ్ లాంటి మాస్ హీరో లేడీ గెటప్ వేయటం హాట్ టాపిక్ గా మారింది. -
వరుడే.. వధువాయె..!
ఖమ్మం: వివాహం పూర్తయ్యాక.. పెళ్లి కుమారుడు చీర కట్టి స్త్రీ వేషధారణతో రావడంతో పెళ్లికి వచ్చినవారంతా అవాక్కయ్యారు. ఊరేగింపుగా ముత్యాలమ్మ గుడి వరకు నడిచి మొక్కులు చెల్లించి, ఇది తమ కుటుంబ ఆచారమని తెలపడంతో అంతా వింతగా చూశారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం చొప్పకట్లపాలెంకు చెందిన కాటేపల్లి చంద్రశేఖర్‌కు కృష్ణాజిల్లా అనిగండ్లపాడుకు చెందిన కృష్ణవేణితో ఆదివారం వివాహమైంది. పెళ్లికుమారుడు కుటుంబ ఆచారం ప్రకారం పెళ్లి జరిగాక చీరకట్టి, స్త్రీ వేషధారణలో నడిచి వస్తుంటే.. పాదం నేలపై తాకకుండా గుడివరకు చీరలు పరుస్తూ.. వారి కుటుంబ సభ్యులు ఊరేగింపుగా తీసుకెళ్లారు. దీంతో స్థానికులు, పెళ్లికి వచ్చిన బంధువులంతా ఆశ్చర్యంగా చూశారు. -
వసంతోత్సవం...తన్నుల సేవ
- చిన్నహోతూరులో ఆకట్టుకున్న వేడుక ఆస్పరి : చిన్నహోతూరు గ్రామంలో గురువారం పార్వతీ, పరమేశ్వరుల కల్యాణం.. కుడుములు ఆట, తన్నుల సేవ, వసంతోత్సవం వైభవంగా జరిగాయి. సిద్ధరామేశ్వర స్వామి ఉత్సవాలలో భాగంగా గ్రామంలో ఇరు వర్గాలకు చెందిన పెద్దలు ఆడవేషంలో ఉన్న వ్యక్తిని శాంతింప జేస్తూ , ఆటు ఇటు తిప్పుతూ బుక్కు పిండిని ఒకరిపై ఒకరు వేసుకున్నారు. ఆతరువాత ఇరువర్గాల వారు కుడుములతో ఆడుకున్నారు. ఇరువర్గాల పెద్దలు పెళ్లి ఒప్పందం చేసుకున్నారు. అనంతరం పార్వతీ, పరమేశ్వరుల ఉత్సవ విగ్రహలను మేళతాళాలతో ఊరేగించారు. పెళ్లి సమయంలో అలిగిన పార్వతీ దేవిని శాంతింప జేయడానికి పరమేశ్వరునిపై కుడుములు వేసి అవమానించారని గ్రామ పెద్దలు చెబుతున్నారు. ఆ తరువాత దేవాలయం దగ్గర వీరభద్ర స్వామి అవతారంలో వున్న పూజారి తలపై తట్ట పెట్టుకుని, త్రిశూలం చేత పట్టుకుని కేకలు వేసుకుంటు భక్తులను తన్నుతూ తిరగడం ఆకట్టుకుంది. ఆయన తన్ను కోసం భక్తులు ఎగబడ్డారు. అనంతరం ఉగ్రుడైన వీరభద్ర స్వామి అవతారిని గ్రామస్తులు మిరప కాయల పొగబెట్టి శాంతింపజేశారు. పార్వతీ, పరమేశ్వరుల పెళ్లి చేసే విషయంలో విఫలమయ్యారని వీరభద్ర స్వామి ఉగ్రుడై గ్రామ పెద్దలను ఇలా తన్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇదే ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తున్నామన్నారు. గ్రామస్తులు ఆనందోత్సవాల మధ్య వసంతోత్సవాన్ని జరుపుకున్నారు. గ్రామంలో అన్ని వర్గాల వారికి సంబంధించి ఐదు పెద్ద రంగుల గుంతలు ఉన్నాయి. వీటిలో గులాబీ రంగును కలిపి.. ఒక కడవతో దేవాలయానికి తీసుకెళ్లి సిద్ధరామేశ్వర స్వామికి పూజలు చేశారు. ఇక రంగుల వేసుకోవడం దేవాలయం నుంచి మొదలు పెట్టారు. ఆలయ నిర్వాహకులు మంజునాథ్‌గౌడ్, వీరభద్రగౌడ్, సర్పంచ్ మల్లికార్జున, ఎంపీటీసీ సభ్యుడు మారెప్ప, గ్రామ పెద్దలు వరదరాజులు, నారాయణ, బసవరాజు, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
లేడీ గెటప్.. నాకు అన్నం పెట్టింది
► బుల్లితెర కమెడియన్ శాంతికుమార్ హైదరాబాద్: సినిమాలపై మోజుతో ఓ యువకుడు ఇంట్లో చెప్పకుండా కృష్ణానగర్ వచ్చి అనేక కష్టాలకు ఓర్చి ఓ సినిమా కార్యాలయంలో ఆఫీస్ బాయ్‌గా చేరి తన లక్ష్యానికి చేరువయ్యాడు. ఈ ప్రస్థానంలో ఆ యువకుడు లేడీ గెటప్‌తో ఆకట్టుకుంటూ బుల్లితెరపై వెలుగుతున్నాడు. నటనపై మక్కువతో 15 ఏళ్లుగా సినీ పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తనకు అచ్చొచ్చిన ఆడపాత్రలో బుల్లితెరపై నవ్వులు పూయిస్తున్నాడు. అతడే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొత్తూరు గ్రామానికి చెందిన కె.శాంతికుమార్. వాస్తవంగా శాంతికుమార్ అంటే ఎవరికీ తెలియదు. లేడీ గెటప్‌లో ‘శాంతి స్వరూప్’గా మాత్రమే సుపరిచితుడు. తనదైన మేనరిజంతో సందడి చేస్తూ అలరిస్తున్న ఈ బక్కపల్చటి యువకుడు తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నాడు. ఆ వివరాలు అతడి మాటల్లోనే.. అర్ధాకలితో అలమటించా.. సినిమా మోజుతో కృష్ణానగర్‌లో మకాం పెట్టి చాలా కష్టాలు ఎదుర్కొన్నా. కొన్ని రోజులు నీళ్లతోతోనే కడుపు నింపుకోవాల్సి వచ్చింది. తర్వాత ఓ సినిమా కార్యాలయంలో రూ.1000 జీతంతో ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తూ స్టూడియోల చుట్టూ ఒక్కచాన్స్ అంటూ తిరిగాను. అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తచ్చాడుతున్న నన్ను జబర్దస్త్ కమెడియన్స్ రాఘవ, రచ్చ రవి చూశారు. నటనపై నాకున్న మక్కువను వారి దృష్టికి తీసుకెళితే.. తమ జట్టులో ఓ అవకాశం ఇచ్చారు. శాంతిగా కామెడీ టైమింగ్‌తో మంచి మార్కులు పడ్డాయి. దాంతో అవకాశాలు వచ్చాయి. ఇప్పటి వరకూ 80 స్కిట్స్.. వచ్చేవన్నీ లేడీ గెటప్‌లే. అయినా సరే.. ఈ శాంతి ఎప్పుడూ నిరుత్సాహపడలేదు. దాదాపు అన్ని చానళ్లలోనూ ఆ గెటప్‌లోనే కనిపిస్తున్నా. మొన్నటి దసరా మహోత్సవం స్కిట్లో యాంకర్ శ్రీముఖిని అనుసరిస్తూ చేసిన డ్రామా ప్రేక్షకులకు ఆకట్టుకుంది. నా శరీరతత్వం.. లేడీ గెటప్‌లో నా వేషధారణతో అన్ని టీంలవారు ప్రోత్సహిస్తూ వారి స్కిట్లో అవకాశం ఇస్తున్నారు. ఒక్కసారి మొహానికి రంగు వేసుకున్నాక.. ఏ నటుడన్నా ఏ పాత్ర వేయడానికైనా సిద్ధంగా ఉంటాడు.. నేనూ అంతే. నా చీరలు బాగుంటాయట.. ఇటీవల ప్రైవేట్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి వెళుతున్నా. అక్కడ నన్ను చూసిన చాలామంది మగవాళ్లే మీ చీరలు బాగుంటాయని కితాబిస్తున్నారు. నా భార్యకు కూడా చీరల సెలక్షన్లో ఇంత ప్రావీణ్యం లేదంటూ వాళ్ల ముందే నన్ను పొగుడుతుంటారు. అది నాకు చాలా సంతోసంగా ఉంటుంది. ఆడీ లేదు.. ఆనందం ఉంది నాకు ఆడీ కారుందని, పెద్ద ఇల్లు ఉందని ఇటీవల సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. అవన్నీ నిజం కాదు.. ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్నప్పుడు పైసాపైసా దాచుకుని ఓ స్కూటీ కొనుకున్నా. నాకున్నది అదొక్కటే. ఆడి కారు లేదు కానీ నా కష్టాలు మరిచిపోయేలా రెండు పూటలా తిండికి, ఇంటి అద్దె చెల్లించే స్తోమత మాత్రం జబర్దస్త్ ఇచ్చింది. -
ఆడవేషంలో విమానయానం!
మారువేషాల్లో రాయ్‌పూర్-శంషాబాద్ మధ్య తిరిగిన నయీమ్ సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ లీలలు సినిమాను తలపిస్తున్నాయి! శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ వెళ్లేందుకు నయీమ్ తరచూ లేడీ గెటప్ ధరించేవాడట. రాయ్‌పూర్ విమానాశ్రయానికి చేరుకోగానే అక్కడ పార్క్ చేసిన తన వెహికల్లోకి ఎక్కగానే చీర విప్పేసి టీషర్ట్, ప్యాంట్ వేసుకొని మగాడిలా ఇంటికి వెళ్లేవాడని తేలింది. ఇలా మారువేషాల్లో ఆయా ఎయిర్‌పోర్టుల నుంచి నిమిషాల వ్యవధిలో ఇంటికి చేరేందుకు మహీంద్రా ఎక్స్‌యూవీ వెహికల్స్‌ను నయీమ్ అక్కడే పార్క్ చేసేవాడన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. నయీమ్ అల్లుడు అబ్దుల్ ఫహీమ్, ఆయన భార్య షాజీదా షాహీన్‌ల విచారణలో ఈ అంశాలు వెలుగుచూశాయి. నయీమ్ ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్, శంషాబాద్ మధ్య ఎక్కువగా విమానాల్లో ప్రయాణాలు చేసేవాడని సమాచారం. బాధితులను అక్కడికి రప్పించుకుని, బెదిరించి భూ డాక్యుమెంట్లపై సంతకాలు చేయించేవాడని తెలిసింది. నయీమ్‌తో కలిసే నేరాలు ... నయీమ్‌తో కలసి నేరాలు చేశామని ఫహీమ్, ఆయన భార్య షాజీదా షాహీన్‌లు పోలీసు విచారణలో అంగీకరించారు. నదీమ్, నస్రీమ్ హత్య కేసుల్లో తాము సహకరించామని, వారి మృతదేహాలను నగర శివారులో దహనం చేసినట్టు తెలిపారు. తన పేరిట రాజమండ్రి, విజయవాడ, బాపట్ల, నెల్లూరు, ఒంగోలు ఇతర ప్రాంతాల్లో నయీమ్ ఇళ్లను కొనుగోలు చేశాడని షాహీన్ ఒప్పుకుంది. కాగా, వీరిద్దరిని పది రోజుల పాటు కస్టడీకివ్వాలన్న పిటిషన్ విచారణను న్యాయస్థానం బుధవారానికి వాయిదా వేసింది. ఇదే కేసులో ఏ1, ఏ2లుగా ఉన్న ఫర్హానా, ఆఫ్షాలను ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని నార్సింగ్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ విచారణ కూడా బుధవారానికి వాయిదా పడింది. -
లేడీ గెటప్‌లో తాతా-మనవళ్లు
హైదరాబాద్ : తాతా తొలి రోజుల్లోనే స్త్రీ పాత్రలు పోషించి అలరిస్తే.... ఆయన మనవడు కూడా అదే బాటలో నడిచాడు. వాళ్లిద్దరే అక్కినేని నాగేశ్వరరావు, సుమంత్. తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ అక్కినేని నాగేశ్వరరావు తొలి దశలో మహిళ పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చారు. మొదట్లో ఆయన ఎక్కువ మహిళ పాత్రల్లోనే కనిపించేవారు. ఆయన గొంతు కూడా అందు చక్కగా అతికినట్టు సరిపోయేది. తెలుగు సినీ పరిశ్రమకు తొలి రొమాంటిక్ హీరోగా రికార్డు సృష్టించిన ఘనత ఎఎన్ఆర్ది. నవరాత్రి సినిమాలో 9 పాత్రలు చేసిన ఏకైక తెలుగు నటుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో డబుల్ రోల్ పోషించిన మొట్టమొదటి నటుడు. అక్కినేని ఆరేళ్ల వయసులోనే కళామతల్లి సేవకు సిద్ధమయ్యారు. అక్కినేని విద్యాభ్యాసం ప్రాథమిక దశలోనే ఆగిపోయింది. ఆర్థిక స్థోమత లేకపోవడమే ఇందుకు కారణం. అయితే అప్పట్లో దాన్ని ఒక కొరతగా ఆయన భావించలేదు. పాఠశాల విద్యకు బదులు నటనకు బాటలు వేసుకున్నారు. ఆరేళ్ల వయసులోనే రంగస్థల నటుడయ్యారు. ఈ పయనంలో ఆయన తల్లి ప్రోత్సాహం మరువలేనిది. అక్కినేని మొదట ప్రాచుర్యం పొందింది స్త్రీ పాత్రల ద్వారానే. ఆ రోజుల్లో స్త్రీలు నటించడానికి ముందుకొచ్చేవారు కాదు. అందువలన వారి పాత్రలనూ పురుషులే పోషించేవారు. అలా అక్కినేని స్త్రీ పాత్రల నటుడిగా పేరు తెచ్చుకున్నారు. అందుకే అక్కినేని స్త్రీ పాత్ర వేస్తే సింగారమే అనేవారు. కాగా తాతను స్పూర్తిగా తీసుకున్న ఆయన మనవడు సుమంత్ కూడా లేడీ గెటప్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అతని తాజా చిత్రం ‘ఏమో.. గుర్రం ఎగరావచ్చు’లో స్త్రీ పాత్రలో అలరిస్తున్నాడు. మరి లేడీ గెటప్‌లో సుమంత్...తాతలా ఏమేరకు అలరిస్తాడో చూడాలి.