లేడీ గెటప్లో సెన్సేషనల్ హీరో | vijay sethupathi lady getup in Super Deluxe | Sakshi
Sakshi News home page

లేడీ గెటప్లో సెన్సేషనల్ హీరో

Published Wed, Sep 13 2017 12:42 PM | Last Updated on Tue, Sep 19 2017 4:30 PM

vijay sethupathi lady getup in Super Deluxe

కోలీవుడ్ లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ సేతుపతి. చిన్న పాత్రలతో కెరీర్ మొదలు పెట్టి ప్రస్తుతం స్టార్ ఇమేజ్ సాధించిన విజయ్.. మరో ప్రయోగం చేస్తున్నాడు. రఫ్ అండ్ టఫ్ లుక్ లో ఎప్పుడూ రూడ్, మాస్ పాత్రల్లో కనిపించే ఈ యాంగ్రీ హీరో ఓ సినిమాలో ఆడవేషంలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమా ఆన్ లోకేషన్ స్టిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న సినిమా సూపర్ డీలక్స్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి శిల్ప అనే మహిళ పాత్రలో కనిపించనున్నాడు. గతంలో చాలా మంది హీరోలు లేడీ గెటప్స్ లో కనిపించినా.. విజయ్ లాంటి మాస్ హీరో లేడీ గెటప్ వేయటం హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement