
జబర్దస్ధ్ షో ద్వారా కమెడియన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వాళ్లలో వినోద్ ఒకరు. ముఖ్యంగా లేడీ గెటప్స్‌తో పాపులర్ అయిన వినోద్ ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆరోగ్యం బాలేక బక్కచిక్కి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. తాజాగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనారోగ్యం వెనకున్న కారణాన్ని బయటపెట్టాడు.
'నాకు లంగ్స్(ఊపిరితిత్తులు)లో ఇన్‌ఫెక్షన్ వచ్చింది. దీనివల్లే ఇలా వీక్ అయ్యాను. ఎక్కువగా ప్రయాణాలు చేయడం, ఏసీలో ఎక్కువసేపు ఉండటం, చల్లటీ నీళ్లు తాగడం, ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం వల్ల ఇలా అయ్యింది. ఈ సమస్య వచ్చిన కొత్తలో నడవడం కూడా కష్టమైపోయింది. ఆ సమయంలో నాకు ఫ్యామిలీ అండగా నిలబడింది. మెడిసిన్స్ వల్ల హెయిర్ లాస్ కూడా అయ్యిందని, అయితే ప్రస్తుతం తాను కోలుకుంటున్నాను' అని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment