jabardasth vinod
-
రూ.21 లక్షలు పోగొట్టుకున్నా: జబర్దస్త్ వినోద్ ఎమోషనల్
నవ్వు వెనక దాగి ఉన్న విషాదాలెన్నో.. ఈ మాట ఎందరో కమెడియన్ల విషయంలో రుజువైంది. మోయలేనంత బరువు, చెప్పుకోలేని కష్టాలు వెంటాడుతున్నప్పటికీ అందరినీ నవ్వించడానికి పెదాలపై ప్లాస్టిక్ నవ్వును పులుముకుంటారు. ప్రేక్షకులు తమ కష్టాలను క్షణకాలంపాటు మర్చిపోయేలా కడుపుబ్బా నవ్విస్తాడు. అందరికీ ఆనందాన్ని పంచడంలోనే తమ సంతోషాన్ని వెతుక్కుంటారు. చివరికి తను ఊహించని కష్టం ఉప్పెనలా వచ్చేసరికి కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతుంటారు. లేడీ గెటప్ ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే జబర్దస్త్ వినోద్‌కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అతడికి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో ఎంతో బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేని స్థితికి వచ్చాడు. మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని, అయినా సరే తాను కోలుకుని తిరిగి అందరినీ ఎంటర్టైన్ చేస్తుంటున్నాడు. అయితే కొందరిని నమ్మి తాను డబ్బులు కోల్పోయినట్లు చెప్పాడు. 'కొత్త ఇల్లు కొనుక్కునే క్రమంలో పైసాపైసా కూడబెట్టిన డబ్బుతో పాటు అమ్మ సేవింగ్స్, నాన్న కష్టార్జితం.. అన్నీ పోగొట్టుకున్నా. ఇంటి యజమానికి అడ్వాన్స్ కింద పదమూడు లక్షలు ఇచ్చాం. అందులో పది లక్షలిచ్చినట్లు ప్రూఫ్ ఉంది, మూడు లక్షలు నోటిమాట మీద ఇచ్చాం. కానీ అతడి వ్యవహారం తేడా కొట్టడంతో మా డబ్బు ఇచ్చేయమన్నాం, అతడు తిరిగి ఇవ్వట్లేదు. దానికోసం ఎంత పోరాడుతున్నా న్యాయం దొరకట్లేదు. అలా పదమూడు లక్షలు పోగొట్టుకున్నాం. నాకు తెలిసిన వ్యక్తి ఒకరి దగ్గర అప్పు తీసుకున్నాడు. అతడు తిరిగి చెల్లిస్తాడన్న నమ్మకంతో నేను షూరిటీగా ఉన్నాను. చివరికి అతడు ఆ అప్పు తీర్చకపోయే సరికి నేను రూ.5 లక్షలు కట్టాల్సి వచ్చింది. ఆరోగ్యం బాగోలేక అటు ఆస్పత్రి ఖర్చులు, ఏదైనా చెడు ప్రభావం ఉందేమోనని ఇటు అమ్మ పూజలు చేయించడంతో మొత్తంగా మూడు లక్షల దాకా ఖర్చయింది' అని చెప్పుకొచ్చాడు వినోద్. చదవండి: ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన సినిమాలివే! భార్యను ప్రేమ కౌగిలిలో బంధించిన తారక్ -
జబర్దస్త్ వినోద్‌కి ఏమైంది? ఇలా మారిపోయాడేంటి?
జబర్దస్ధ్ షో ద్వారా కమెడియన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వాళ్లలో వినోద్ ఒకరు. ముఖ్యంగా లేడీ గెటప్స్‌తో పాపులర్ అయిన వినోద్ ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆరోగ్యం బాలేక బక్కచిక్కి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. తాజాగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనారోగ్యం వెనకున్న కారణాన్ని బయటపెట్టాడు. 'నాకు లంగ్స్(ఊపిరితిత్తులు)లో ఇన్ఫెక్షన్ వచ్చింది. దీనివల్లే ఇలా వీక్ అయ్యాను. ఎక్కువగా ప్రయాణాలు చేయడం, ఏసీలో ఎక్కువసేపు ఉండటం, చల్లటీ నీళ్లు తాగడం, ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం వల్ల ఇలా అయ్యింది. ఈ సమస్య వచ్చిన కొత్తలో నడవడం కూడా కష్టమైపోయింది. ఆ సమయంలో నాకు ఫ్యామిలీ అండగా నిలబడింది. మెడిసిన్స్ వల్ల హెయిర్ లాస్ కూడా అయ్యిందని, అయితే ప్రస్తుతం తాను కోలుకుంటున్నాను' అని పేర్కొన్నాడు. -
‘జబర్దస్త్’ వినోద్ కిడ్నాప్ కలకలం!
-
‘జబర్దస్త్’ వినోద్ కిడ్నాప్ కలకలం!
సంజామల: బుల్లితెర హాస్యనటుడు, జబర్దస్త్ ఫేమ్ వినోద్ కిడ్నాప్ ఉదంతం కర్నూలు జిల్లాలో కలకలం రేపింది. మహిళా పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వినోద్ స్వస్థలం వైఎస్సార్ జిల్లా. ఇతని తల్లి శిరోమణమ్మ సోదరి లక్ష్మమ్మ కర్నూలు జిల్లా సంజామల మండలంలోని బొందలదిన్నెలో నివాసం ఉంటోంది. లక్ష్మమ్మ కుమార్తె, అల్లుడు చనిపోవడంతో పెళ్లీడుకొచ్చిన మనవరాలు అనాథగా మిగిలింది. ఈమె ఆలనాపాలన లక్ష్మమ్మ చూసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈమెను వినోద్‌కు ఇచ్చి వివాహం చేయాలని బంధువులు భావించారు. అతనితో చర్చించగా నిర్ణయం వేరుగా ఉండటంతో బలవంతంగానైనా పెళ్లి చేయాలనుకున్నారు. ఆదివారం రాత్రి వినోద్‌ను కిడ్నాప్ చేసి బొందలదిన్నెకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న పెనుగులాటలో వినోద్ కుడి చేయికి స్వల్ప గాయమైంది. సోమవారం ఉదయం అక్క కూతురితో పెళ్లి చేయడానికి ప్రయత్నించగా నిరాకరించాడు. ఇంతలో కిడ్నాప్ సమాచారం పోలీసులకు అందడంతో సంజామల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వినోద్‌తోపాటు బంధువులను పోలీసుస్టేషన్‌కు తరలించారు. కిడ్నాప్ విషయమై వినోద్‌ను విలేకరులు ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని వివరించారు.