Jabardasth Fame Vinod Emotional Over His Lost Rs 21 Lakhs - Sakshi
Sakshi News home page

Jabardasth Vinod: పైసాపైసా కూడబెట్టిందంతా కోల్పోయాను..

Published Sat, Dec 17 2022 8:11 PM | Last Updated on Sat, Dec 17 2022 8:49 PM

Jabardasth Fame Vinod Emotional Over His Lost Rs 21 Lakhs - Sakshi

నవ్వు వెనక దాగి ఉన్న విషాదాలెన్నో.. ఈ మాట ఎందరో కమెడియన్ల విషయంలో రుజువైంది. మోయలేనంత బరువు, చెప్పుకోలేని కష్టాలు వెంటాడుతున్నప్పటికీ అందరినీ నవ్వించడానికి పెదాలపై ప్లాస్టిక్‌ నవ్వును పులుముకుంటారు. ప్రేక్షకులు తమ కష్టాలను క్షణకాలంపాటు మర్చిపోయేలా కడుపుబ్బా నవ్విస్తాడు. అందరికీ ఆనందాన్ని పంచడంలోనే తమ సంతోషాన్ని వెతుక్కుంటారు. చివరికి తను ఊహించని కష్టం ఉప్పెనలా వచ్చేసరికి కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతుంటారు. లేడీ గెటప్‌ ద్వారా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసే జబర్దస్త్‌ వినోద్‌కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అతడికి ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ రావడంతో ఎంతో బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేని స్థితికి వచ్చాడు. మెడిసిన్స్‌ వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తున్నాయని, అయినా సరే తాను కోలుకుని తిరిగి అందరినీ ఎంటర్‌టైన్‌ చేస్తుంటున్నాడు. అయితే కొందరిని నమ్మి తాను డబ్బులు కోల్పోయినట్లు చెప్పాడు.

'కొత్త ఇల్లు కొనుక్కునే క్రమంలో పైసాపైసా కూడబెట్టిన డబ్బుతో పాటు అమ్మ సేవింగ్స్‌, నాన్న కష్టార్జితం.. అన్నీ పోగొట్టుకున్నా. ఇంటి యజమానికి అడ్వాన్స్‌ కింద పదమూడు లక్షలు ఇచ్చాం. అందులో పది లక్షలిచ్చినట్లు ప్రూఫ్‌ ఉంది, మూడు లక్షలు నోటిమాట మీద ఇచ్చాం. కానీ అతడి వ్యవహారం తేడా కొట్టడంతో మా డబ్బు ఇచ్చేయమన్నాం, అతడు తిరిగి ఇవ్వట్లేదు. దానికోసం ఎంత పోరాడుతున్నా న్యాయం దొరకట్లేదు. అలా పదమూడు లక్షలు పోగొట్టుకున్నాం. నాకు తెలిసిన వ్యక్తి ఒకరి దగ్గర అప్పు తీసుకున్నాడు. అతడు తిరిగి చెల్లిస్తాడన్న నమ్మకంతో నేను షూరిటీగా ఉన్నాను. చివరికి అతడు ఆ అప్పు తీర్చకపోయే సరికి నేను రూ.5 లక్షలు కట్టాల్సి వచ్చింది. ఆరోగ్యం బాగోలేక అటు ఆస్పత్రి ఖర్చులు, ఏదైనా చెడు ప్రభావం ఉందేమోనని ఇటు అమ్మ పూజలు చేయించడంతో మొత్తంగా మూడు లక్షల దాకా ఖర్చయింది' అని చెప్పుకొచ్చాడు వినోద్‌.

చదవండి: ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన సినిమాలివే!
భార్యను ప్రేమ కౌగిలిలో బంధించిన తారక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement