‘జబర్దస్త్‌’ వినోద్‌ కిడ్నాప్‌ కలకలం! | jabardasth vinod kidnaped in kurnool district | Sakshi
Sakshi News home page

‘జబర్దస్త్‌’ వినోద్‌ కిడ్నాప్‌ కలకలం!

Published Tue, May 9 2017 8:29 AM | Last Updated on Tue, Sep 5 2017 10:46 AM

‘జబర్దస్త్‌’ వినోద్‌ కిడ్నాప్‌ కలకలం!

‘జబర్దస్త్‌’ వినోద్‌ కిడ్నాప్‌ కలకలం!

సంజామల: బుల్లితెర హాస్యనటుడు, జబర్దస్త్‌ ఫేమ్‌ వినోద్‌ కిడ్నాప్‌ ఉదంతం కర్నూలు జిల్లాలో కలకలం రేపింది. మహిళా పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వినోద్‌ స్వస్థలం వైఎస్సార్‌ జిల్లా. ఇతని తల్లి శిరోమణమ్మ సోదరి లక్ష్మమ్మ కర్నూలు జిల్లా సంజామల మండలంలోని బొందలదిన్నెలో నివాసం ఉంటోంది.

లక్ష్మమ్మ కుమార్తె, అల్లుడు చనిపోవడంతో పెళ్లీడుకొచ్చిన మనవరాలు అనాథగా మిగిలింది. ఈమె ఆలనాపాలన లక్ష్మమ్మ చూసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈమెను వినోద్‌కు ఇచ్చి వివాహం చేయాలని బంధువులు భావించారు. అతనితో చర్చించగా నిర్ణయం వేరుగా ఉండటంతో బలవంతంగానైనా పెళ్లి చేయాలనుకున్నారు.

ఆదివారం రాత్రి వినోద్‌ను కిడ్నాప్‌ చేసి బొందలదిన్నెకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న పెనుగులాటలో వినోద్‌ కుడి చేయికి స్వల్ప గాయమైంది. సోమవారం ఉదయం అక్క కూతురితో పెళ్లి చేయడానికి ప్రయత్నించగా నిరాకరించాడు. ఇంతలో కిడ్నాప్‌ సమాచారం పోలీసులకు అందడంతో సంజామల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వినోద్‌తోపాటు బంధువులను పోలీసుస్టేషన్‌కు తరలించారు. కిడ్నాప్‌ విషయమై వినోద్‌ను విలేకరులు ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement