Lovers Kidnapped In Kurnool, ప్రేమికుల కిడ్నాప్‌.. సినిమాను తలపించేలా - Sakshi
Sakshi News home page

ప్రేమికుల కిడ్నాప్‌.. సినిమాను తలపించేలా

Published Sat, Jan 30 2021 1:04 PM | Last Updated on Sat, Jan 30 2021 3:20 PM

Lovers Kidnapped By Uncle In Kurnool District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కర్నూలు (టౌన్‌): పెళ్లి చేసుకోవాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్న ప్రేమికులను కర్నూలు సమీపంలో శుక్ర వారం కిడ్నాప్‌ చేశారు. పోలీసులకు సమాచారం అందడంతో కిడ్నాపర్ల చెర నుంచి వారిని విడిపించి..పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఆస్పరి వాసి అనిల్‌ కుమార్, నందికొట్కూరు చెందిన జయదాంబ వరుసకు బంధువులు. కొంత కాలంగా వీరు ప్రేమించుకుంటున్నారు. ఇటీవలే వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని.. తల్లిదండ్రులకు చెప్పారు. వారు ససేమిరా అనడంతో శుక్రవారం ఇంట్లో చెప్పకుండా ఇరువురూ పారిపోయారు. పెళ్లి చేసుకోవాలని 

నందికొట్కూరు పట్టణం పగిడ్యాల రోడ్డులో ఉన్న బ్రహ్మం గారి గుడిలో ఏర్పాట్లు చేసుకున్నారు. కర్నూలు నుంచి వాహనంలో అక్కడకు వెళుతున్న సమయంలోనే అమ్మాయి తరఫున మేనమాన మునుస్వామి, తొమ్మిది మంది అనుచరులతో తుపాన్‌ వాహనంలో వెంబడించారు. కర్నూలు సమీపంలోని నంద్యాల చెక్‌పోస్టు వద్ద ప్రేమికులివురినీ కిడ్నాప్‌ చేశారు. ప్రాణ భయంతో ప్రేమికులు 100 డయల్‌ చేయడంతో ట్రాఫిక్‌ డీఎస్పీ వెంటనే స్పందించారు. నంద్యాల చెక్‌పోస్టు దాటిన తరువాత వాహనాన్ని గుర్తించి పట్టుకున్నారు. కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. వారితోపాటు ప్రేమికులను నందికొట్కూరు పోలీసులకు అప్పగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement