హిజ్రాగా భాగమతి హీరో | UnniMukundan turns Karishma | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 20 2018 11:41 AM | Last Updated on Tue, Feb 20 2018 12:40 PM

Unni Mukundan as Karishma - Sakshi

‘చాణక్య తంత్రం’ సినిమాలో ఉన్ని ముకుందన్‌

జనతా గ్యారేజ్‌ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన మళయాల నటుడు ఉన్ని ముకుందన్‌. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు ప్రతినాయకుడిగా నటించిన ఈ యువ నటుడు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఉన్ని ముకుందన్ లీడ్‌రోల్‌లో తెరకెక్కుతున్న మళయాల సినిమా చాణక్య తంత్రం మాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో ఉన‍్ని ముకుందన్‌ హిజ్రా కరిష్మా పాత్రలో కనిపించనున్నాడు. తాజా కరిష్మా క్యారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్‌తో పాటు మేకింగ్ వీడియోను రిలీజ్‌ చేశారు చిత్రయూనిట్‌.

లేడీ గెటప్‌ లో కనిపించేందుకు ఉన్ని ముకుందన్‌ ఎంత కష్టపడ్డాడో ఈ వీడియోలో చూపించారు. మిరాకిల్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు కన్నన్‌ తామరకుల్లం దర్శకుడు. శివదా, శృతి రామచంద్రన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అనూప్‌ మీనన్‌ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement