ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన చిత్రం ‘మార్కో’. హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యుక్తి తరేజా, కబీర్ దుహన్ సింగ్ ప్రధాన పాత్రధారులు. షరీఫ్ ముహమ్మద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న మలయాళంలో విడుదలైంది. ఈ చిత్రాన్ని ఎన్వీఆర్ సినిమా తెలుగులో జనవరి 1న రిలీజ్ చేస్తోంది.
‘‘వయొలెంట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘మార్కో’. టైటిల్ రోల్‌లో ఉన్ని ముకుందన్ అద్భుతంగా నటించారు. ఈ సినిమా మలయాళంలో సంచలన విజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం, నేపథ్య సంగీతం: రవి బస్రూర్, ఎగ్జిక్యూటివ్‌ప్రొడ్యూసర్: జుమానా షరీఫ్, కెమెరా: చంద్రు సెల్వరాజ్.
Comments
Please login to add a commentAdd a comment