బాక్సాఫీస్ దగ్గర ఫలితాలెలా ఉన్నా ఓటీటీలో మాత్రం కొన్ని సినిమాలు దూసుకెళ్తున్నాయి. అందుకే థియేటర్‌లో బోల్తా కొట్టిన చిత్రాలు సైతం ఓటీటీనే నమ్ముకుంటున్నాయి. కనీసం ఇక్కడ క్లిక్ అయినా చాలని గంపెడాశలు పెట్టుకుంటున్నాయి. అందుకే థియేటర్లో రిలీజైన కొద్దిరోజులకే చాలా చిత్రాలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో దర్శనమిస్తున్నాయి. అయితే నరకాసుర అనే సినిమా మాత్రం చాలా ఆలస్యంగా ఓటీటీలోకి వస్తోంది. ఇందులో పలాస హీరో రక్షిత్ అట్లూరి శివ అనే లారీ డ్రైవర్‌గా నటించాడు. అపర్ణ జనార్ధన్, సంకీర్తన విపిన్ హీరోయిన్లుగా నటించారు. సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించాడు.
ట్రాన్స్‌జెండర్ల గురించి..
చిన్నప్పుడు డైరెక్టర్ తప్పిపోతే.. హిజ్రాలే అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించారట. ఆ సంఘటనను స్ఫూర్తిగా తీసుకుని ట్రాన్స్‌జెండర్స్‌కు సంబంధించిన ఓ సమస్యను సినిమాలో ప్రస్తావించాడు అకోస్టా. ఈ మూవీ చిత్రీకరణ సమయంలో తన చేయి కూడా విరగ్గొట్టుకున్నాడు. ఈ ప్రమాదం జరిగిన 27 రోజులకు తిరిగి సెట్స్‌లోకి వచ్చి ఆత్మవిశ్వాసంతో సినిమా పూర్తి చేశాడు.
సడన్‌గా ఓటీటీలోకి..
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లోని ఓ కాఫీ ఎస్టేట్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో నవంబర్ 3న నరకాసుర మూవీ రిలీజైంది. ఈ చిత్రం ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. కాకపోతే ఫ్రీగా కాకుండా రెంట్(అద్దె) పద్ధతిలో అందుబాటులో ఉంచారు. అంటే ఓటీటీలో నరకాసుర చూడాలంటే రూ.79 చెల్లించాల్సిందే!
#Narakasura is now available for RENT in @PrimeVideoIN#Gaami #bhimaa #VishwakSen #SaveTheTigers2 #SSMB29 #gopichand #HanuMan #TrueLover #Kalki2898AD pic.twitter.com/GaPny8maTQ
— OTT Updates (@itsott) March 10, 2024
చదవండి: చిరంజీవి కూతురికి స్పెషల్ విషెస్.. ఉపాసన, లావణ్య త్రిపాఠి పోస్ట్ వైరల్!
Comments
Please login to add a commentAdd a comment