
పలాస 1978 ఫేం రక్షిత్ అట్లూరి, కోమలీ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్‌వీఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి నిర్మిస్తున్నారు. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
టీజర్ చూస్తే విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే అహ్లాదకరమైన ప్రేమకథలా ఉంది. అలాగే హీరో, హీరోయిన్ మధ్య ఉన్న ప్రేమ సన్నివేశాలు హృదయాన్ని హత్తుకుంటున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదలైన టైటిల్ సాంగ్ ‘శశివదనే’, ‘డీజే పిల్లా..’ అనే సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు విడుదలైన టీజర్ నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళుతుంది. త్వరలోనే ఈ చిత్రం ట్రైలర్, రిలీజ్ డేట్‌పై మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ చిత్రంలో శ్రీమన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ, రంగస్థలం మహేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శరవణన్ వాసుదేవన్ సంగీతం మందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment