లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా ‘శశివదనే’ | Sasivadane Team completed Shooting | Sakshi
Sakshi News home page

లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా ‘శశివదనే’

Published Tue, Oct 18 2022 2:59 PM | Last Updated on Tue, Oct 18 2022 6:08 PM

Sasivadane Team completed Shooting - Sakshi

రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజాగా చిత్రం ‘శశివదనే’. మోహన్ ఉబ్బన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గౌరీ నాయుడు సమర్పణలో ఎస్‌విఎస్‌ కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి. మరియు ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు.  గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మూడు రోజుల ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ.. శశివదనే' చిత్రాన్ని కోనసీమ, అమలాపురంలోని సుందరమైన లొకేషన్లలో 50 రోజుల పాటు చిత్రీకరించాం. సినిమాలో ప్రేమ సన్నివేశాలు రిఫ్రెష్‌గా ఉండబోతున్నాయి. గోదావరి ల్యాండ్‌స్కేప్ నేపథ్యంలో గ్రాండియర్ మరియు హై స్టాండర్డ్స్‌తో సన్నివేశాలు వస్తాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తాం’అన్నారు. ఈ చిత్రంలో సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె , ప్రవీణ్ యండమూరి, కన్నడ నటుడు దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement