
‘‘నరకాసుర’ చిత్రం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లోని ఓ కాఫీ ఎస్టేట్ నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాలో శివ అనే లారీ డ్రైవర్ పాత్ర చేశాను. నా గత సినిమా ‘పలాస 1978’లో దళితుల సమస్యలు చూపించినట్లే ‘నరకాసుర’లో హిజ్రాలకు సంబంధించిన పాయింట్ ఒకటి తీసుకున్నాం. కథలో ఇదొక అంశం మాత్రమే. మా సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం’’ అని హీరో రక్షిత్ అట్లూరి అన్నారు. సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వంలో రక్షిత్ అట్లూరి హీరోగా, అపర్ణా జనార్ధన్, సంకీర్తనా విపిన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘నరకాసుర’.
డా. అజ్జా శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ– ‘‘2020లో ‘నరకాసుర’ ్రపారంభించి, ఏడాదిలో పూర్తి చేయాలనుకున్నాం. అయితే రెండు సార్లు కరోనా లాక్‌డౌన్ రావడం, కథపరంగా ఛత్తీస్‌గడ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో షూటింగ్ చేయడం, ఆర్టిస్టుల డేట్స్, మా డైరెక్టర్ ప్రమాదంలో చేయి కోల్పోవడం... ఇలా పలు కారణాలతో షూటింగ్‌కే రెండున్నరేళ్లు పట్టింది. అయితే కథపై నమ్మకంతో నిర్మాతలు స΄ోర్ట్ చేశారు. ఇక నేను నటించిన ‘శశివదనే’, ‘ఆపరేషన్ రావణ్’ సినిమాలు ΄ోస్ట్ ్ర΄÷డక్షన్ దశలో ఉన్నాయి. మరికొన్ని కథలు వింటున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment