కాణిపాకం ప్రసాదాల్లో నాణ్యత ఏదీ
ఐరాల :కాణిపాకంలోని సత్యప్రమాణాలస్వామి సన్నిధిలో విక్రయించే లడ్డూ ప్రసాదం నాణ్యత తగ్గుతోంది. వడలు కూడా అందరికీ అందడం లేదు. నాణ ్యమైన సరుకులు వాడకపోవడం, తయారీలో సూచనలు పాటించని కారణంగా ఈ పరిస్థితి ఏర ్పడింది. 70 గ్రాముల లడ్డూ ప్రసాదాన్ని గతంలో రూ.5 విక్రయిం చేవారు. ఆ తరువాత 100 గ్రాములు రూ. 10 విక్రయించేవారు. ఒక్కొక్క లడ్డూపై రోజుకు రూ.2.70 దేవస్థానానికి నష్టం వస్తుందనే నెపంతో 100 గ్రాముల లడ్డూ 80 గ్రాములు చేసి భక్తులకు అందిస్తున్నా రు. ఇలా రోజురోజుకూ లడ్డూ సైజు తగ్గిపోతుండడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సగటున ఒక్క రోజుకు 10 వేల నుంచి 12 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే ఆశించిన మేరకు లడ్డూ ప్రసాదంలో నాణ్యత లేదనే వ్యాఖ్యలు భక్తుల నుంచి వినిపిస్తున్నాయి. రుచి కూడా తగ్గినట్లు చెబుతున్నారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం, ఎండుద్రాక్ష, జీడీపప్పు, యాలకులు కనిపించకపోవడం, కలకండ ఎక్కువగా వాడటం తదితర కారణాలతో నాణ్యత కొరవడినట్లు భావిస్తున్నారు.
అధికారుల సూచనలుగాలికి
గతంలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ పోటు సిబ్బందికి ఇచ్చిన సూచనలు, సలహాలను గాలికి వదిలేశారు. బూందీ ముద్దగా తయారుచేసే సమయంలో నీళ్లతో చేతులు తడుపుకుంటారు. నెయ్యితోనే చేతులు తడుపుకుని లడ్డుముద్దను తయారు చేస్తే నాణ్యత రెట్టింపుగా ఉం టుందని సూచించారు. పోటులో పని చేసే సిబ్బంది తలకు టోపీలు, ముఖానికి మాస్క్‌లు చేతులకు గ్లౌజులు ధరించాలన్న సూచనలు పాటించడం లేదు.
వడల తయారీలోనూ అంతే..
లడ్డూతో పాటు వడలకూ విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే అవి ఎప్పుడూ అందుబాటులో ఉండడం లేదు. రోజుకు 500 నుంచి 600 వడలను మాత్రమే తయారు చేసి విక్రయిస్తారు. ఇవి కొందరికి మాత్రమే దక్కుతున్నాయి. దీనికి తోడు వడలు తయారైన వెంటనే పైరవీలతో పోటు వద్దనే సగానికి పైగా అదృశ్యమవుతాయి. మిగిలినవి కనీసం గంట సమయం కూడా కౌంటర్‌లో లభించవు.
చర్యలు తీసుకుంటున్నాం
లడ్డూ, వడలు నాణ్యతగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అధికారులు సూచించిన విధంగా ప్రసాదాల తయారీకి శ్రద్ధ తీసుకుంటాం. వడలు తక్కువ సంఖ్యలో తయారవుతున్న మాట వాస్తవమే. స్టోరులో అందిస్తున్న నెయ్యి, పిండి, ఇతర వస్తువుల్లోని నాణ్యతతో మాకు సంబంధం లేదు.
- చిట్టెమ్మ, పోటు ఇన్‌చార్జ్, జేఈవో, కాణిపాకం