ఫోన్‌ లిఫ్ట్‌ చేస్తే ఖాతాలో నగదు మాయం | phone call scam in kanipakam | Sakshi
Sakshi News home page

ఫోన్‌ లిఫ్ట్‌ చేస్తే ఖాతాలో నగదు మాయం

Published Wed, Jun 21 2017 7:23 PM | Last Updated on Tue, Sep 5 2017 2:08 PM

ఫోన్‌ లిఫ్ట్‌ చేస్తే ఖాతాలో నగదు మాయం

ఫోన్‌ లిఫ్ట్‌ చేస్తే ఖాతాలో నగదు మాయం

మోసగాళ్ల కొత్త పంథా.. అకౌంట్‌ మూసేస్తున్నారంటూ కుచ్చుటోపీ

కాణిపాకం: కాణిపాకం వాసులకు గత పది రోజులుగా కంటి మీద కునుకు లేదు! ఆలయ ఉద్యోగులే టార్గెట్‌గా అనామక వ్యక్తులు ఫోన్‌ చేస్తున్నారు. ఆ ఫోన్‌ లిఫ్ట్‌ చేయగానే వారి బ్యాంకు ఖాతాలోని నగదు మాయమైపోతోంది. ఇలా వారం రోజుల్లో దాదాపు పదిమంది నగదు కోల్పోయారు. దేవస్థానం వద్ద పోలీసు స్టేషన్‌లో పనిచేసే ఒక అధికారికి ఇటీవల ఓ నంబరు నుంచి ఫోను వచ్చింది. ‘మేం ఎస్‌బీఐ నుంచి మాట్లాడుతున్నాం.. మీ అకౌంట్‌ నంబరు నిలిపివేయబడింది. పునరుద్ధరించుకోండి’ అంటూ అవతలి వ్యక్తి చెప్పారు. అకౌంట్‌ నంబర్‌.. ఏటీఎం నంబర్‌ చెప్పాల్సిందిగా కోరాడు. వివరాలు చెప్పినా కొద్ది సేపటికే ఆయన అకౌంట్‌ నుంచి డబ్బు వేరే అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ అయినట్లు మెసేజ్‌ వచ్చింది. అదేవిధంగా దేవస్థానంలోని శివాలయంలో పనిచేసే ఓ ప్రధాన అర్చకుడికి ఫోన్‌ వచ్చింది. పై వివరాలన్నీ చెప్పడంతో కొద్ది క్షణాల్లోనే రూ.30 వేలు అకౌంట్‌ నుంచి వెళ్లిపోయినట్లు ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. దీంతో ఆయనకు గుండె ఆగినంత పనైంది. బ్యాంకు మేనేజర్‌ను సంప్రదించి విషయం తెలియజేశారు. పరిశీలిస్తామని మేనేజర్‌ సమాధానం చెప్పారు.

చదువురాని వారే టార్గెట్‌..
మోసగాళ్లు ప్రధానంగా చదువురాని వారిని టార్గెట్‌గా చేసుకున్నారు. వారి మాటల ఆధారంగా అంచనా వేస్తారు. అటు పిమ్మట పూర్తి వివరాలను రాబడతారు. అక్కడినుంచి గుట్టుచప్పుడు కాకుండా తమపని కానిచ్చేస్తున్నారు. వీరు ప్రధానంగా డ్వాక్రా మహిళలు, ఉపాధి సిబ్బంది, గ్రామీణ మహిళలు, దుకాణాలు నిర్వహిస్తున్న వారినే లక్ష్యంగా చేసుకుంటున్నారు.

ఫోన్‌ చేశారు...నగదు పోయింది
సోమవారం ఉదయం 7 గంటలకు ఎస్‌బీహెచ్‌ మేనేజర్‌ రామచంద్రారెడ్డిని అంటూ 97090 6564 నుంచి ఫోన్‌ వచ్చింది. ‘మీ ఖాతా నిలిపివేయబడింది. మీ ఖాతా నంబర్, ఏటీఎం కార్డు నంబర్, పిన్‌ నంబర్‌ చెప్పమని’ అడిగారు. తెలియజేశాను. 10 నిమిషాల్లోనే ఖాతాలోని నగదు పూర్తిగా మాయమైంది. ఖాతాలో ఉన్న రూ.30 వేలు చోరీ చేశారు.
-శేఖర్, కాణిపాకం

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అడ్రస్‌ లేని నంబర్లతో ఫోన్‌ చేసి నగదు స్వాహా చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు, ఫైనాన్స్, లక్కీ డ్రా, లాటరీ సెంటర్ల నుంచి ఫోను చేస్తున్నట్లుగా చెబితే వివరాలు చెప్పొద్దు. జాగ్రత వహించాలి.
- ఎత్తిరాజులు, కాణిపాకం ఏఎస్‌ఐ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement