phone call scam
-
తస్మాత్ జాగ్రత్త.. కాల్ చేసి ]401]తో కలిపి డయల్ చేయాలని చెబుతున్నారా..
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు. బాధితులకు తెలియకుండా వారితోనే కాల్ డైవర్షన్ యాక్టివేట్ చేయిస్తున్నారు. ఆపై వారి వాట్సాప్‌ను తమ అధీనంలోకి తీసుకుని డబ్బు కోరుతూ పలువురికి సందేశాలు పంపుతున్నారు. నగరానికి చెందిన ఓలా గ్రాడ్యుయేట్ బుధవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఏసీపీ కేవీఎం ప్రసాద్ కథనం ప్రకారం వివరాలు.. నగరానికి చెందిన బాధితురాలికి మంగళవారం 96––––––44 నుంచి ఫోన్ వచ్చింది. జియో సర్వీస్ సెక్షన్ నుంచి మాట్లాడుతున్నామంటూ పరిచయం చేసుకున్న అవతలి వ్యక్తి సర్వీస్‌లో ఇబ్బందిపై కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేశారా? అని అడిగాడు. తాను అలాంటి ఫిర్యాదులేమీ చేయలేదని బాధితురాలు చెప్పింది. తమ రికార్డుల్లో ఫిర్యాదు నమోదై ఉందని చెప్పిన కేటుగాడు అది క్లోజ్ కావాలంటే తాను చెప్పినట్లు చేయాలన్నాడు. ]401] తర్వాత 709–––––57 నంబర్ జోడించి రింగ్ చేయాలని చెప్పాడు. అతడి మాటలు నిజమే అని నమ్మిన ఆమె అలానే చేశారు. దీంతో నేరుగా ప్రమేయం లేకుండా తెలియకుండానే ఆమె ఫోన్లో కాల్ డైవర్షన్ యాక్టివేట్ అయింది. ఆమెకు రావాల్సిన కాల్స్ అన్నీ కేటుగాడు సూచించిన 709–––––57 నంబర్‌కు వెళ్తున్నాయి. అంతటితో ఆగని అతగాడు ఆమె వాట్సాప్‌ను తన అధీనంలోకి తీసుకోవాలని భావించాడు. దీనికోసం తన ఫోన్లో వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకున్నాడు. ఈ యాప్ యాక్టివేట్ కావాలంటే అందులో వినియోగదారుడి ఫోన్ నంబర్ పొందుపరచాలి. ఆపై దానికి ఎస్సెమ్మెస్ లేదా కాల్ రూపంలో వచ్చే ఆరు అంకెల యాక్టివేషన్ కోడ్ పొందుపరచాలి. చదవండి: రి‘కార్డ్’ స్థాయిలో క్రెడిట్!.. జాగ్రత్తగా ఉండకపోతే జేబుకు చిల్లే కేటుగాడు తన ఫోన్లోని వాట్సాప్‌లో బాధితురాలి నంబర్ పొందుపరిచి, కాల్ రూపంలో యాక్టివేషన్ కోడ్ వచ్చే ఆప్షన్ ఎంచుకున్నాడు. దీంతో బాధితురాలి ఫోన్‌కు రావాల్సిన ఈ కాల్ డైవర్షన్ కారణంగా కేటుగాడు పొందుపరిచిన 709–––––57 నంబర్‌కు వచ్చింది. దీని ద్వారా ఆ యాప్ యాక్టివేట్ చేసుకోవడంతో బాధితురాలి వాట్సాప్ అతడి అధీనంలోకి వెళ్లిపోయింది. ఆపై అసలు కథ మొదలెట్టిన సైబర్ నేరగాడు ఆమె వాట్సాప్ కాంటాక్ట్స్ లిస్ట్‌లో ఉన్న అందరికీ సందేశాలు పంపాడు. అత్యవసరంగా రూ.10 వేలు ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా బదిలీ చేయాలని వాటిలో సూచించాడు. ఆ మొత్తాన్ని 709–––––57 నంబర్‌కు పంపాలని కోరాడు. వారి ద్వారా విషయం తెలుసుకున్న బాధితురాలు బుధవారం సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నేరగాళ్లు వాడిన ఫోన్ నెంబర్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఫోన్ కాల్స్ నమ్మవద్దు అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ నమ్మవద్దు. సరిచూసుకోకుండా ఆ ఫోన్లు చేసిన వాళ్లు చెప్పినట్లు చేస్తే ఆర్థికంగా నష్టపోవడంతో పాటు వ్యక్తిగత డేటాను కోల్పోవాల్సి వస్తుంది. ]401]తో ఏ నంబర్ కలిపి డయల్ చేస్తామో ఆ నంబర్‌కు కాల్ డైవర్షన్ యాక్టివేట్ అయిపోతుంది. దీన్ని గమనించిన వాళ్లు డీ యాక్టివేట్ చేసుకోవాలంటే ఫోన్లోని కాల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. ఈ–బైక్స్ తయారీ సంస్థ అథర్ ఎనర్జీ లిమిటెడ్ పేరుతో నగరవాసికి కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు డీలర్షిప్ అంటూ ఎర వేశారు. అతడు సరి చూసుకోకుండా నమ్మేయడంతో రూ.12 లక్షలు కాజేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అపరిచితులు చేసే ఫోన్ కాల్స్ వలలో పడకుండా ఉండాలి. – కేవీఎం ప్రసాద్, సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ -
జర భద్రం! మీ ఫోన్ హ్యాక్ అయ్యిందేమో.. ఇలా చెక్ చేయండి
కరోనా కారణంగా ప్రపంచ దేశాల్లో సైబర్ క్రైమ్స్ విపరీతంగా పెరిగిపోతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపిన గణాంకాల ప్రకారం..కోవిడ్-19 వల్ల 600 శాతం సైబర్ క్రైమ్ పెరిగినట్లు తెలిపింది. ముఖ్యంగా కంప్యూటర్ వైరస్, ట్రోజన్స్, స్పైవేర్, రాన్సమ్ వేర్, యాడ్వేర్, వార్మ్స్, ఫైల్ లెస్ మాల్వేర్ల సాయంతో సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా హైబ్రిడ్ దాడులకు పాల్పడేందుకు ప్రత్యేకంగా మెషిన్ లెర్నింగ్‌ను ఉపయోగిస్తున్నట్లు చెప్పింది. అందులోనూ మనం తరుచూ వినియోగించే స్మార్ట్ ఫోన్లపై వైరస్ దాడులు పెరిగిపోతున్నట్లు హెచ్చరించింది. వైరస్ దాడుల నుంచి ఎలా సురక్షితంగా ఉండాలి? సైబర్ నేరస్తులు స్మార్ట్ ఫోన్లు, లేదంటే ఐఫోన్లపై ప్రత్యేకంగా తయారు చేసిన వైరస్‌లను మెయిల్స్ సాయంతో లేదంటే ఆఫర్లు ఇస్తామంటూ పాప్ ఆప్ యాడ్స్‌ను ఫోన్‌కి సెండ్ చేస్తుంటారు. ఆ సమయంలో ఫోన్ వినియోగదారులు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఏదైనా యాప్స్ డౌన్ లోడ్ చేసుకునే ముందే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మంచిదా? లేదంటే దాడులకు పాల్పడే అవకాశం ఉందా అని తెలుసుకోవాలి. అందుకోసం మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్ లోడ్ చేసుకునే సమయంలో సంబంధిత యాప్ వివరాలు, రివ్యూలు చెక్ చేయాలి. వైరస్ దాడి చేసినట్లు ఎలా గుర్తించాలి? ♦మీ స్మార్ట్‌ఫోన్‌లో వైరస్‌లను గుర్తించే సులభమైన మార్గం ఇదే. మీరు ఒకవేళ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటే..వెంటనే కట్ అవ్వడం, మీ స్మార్ట్‌ఫోన్‌కు గుర్తు తెలియని టెక్స్ట్ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ రావడం, మీ అనుమతి లేకుండా యాప్స్‌ను కొనుగోలు చేయడం. ♦ కంటిన్యూగా మీ ఫోన్ కు యాడ్స్ వస్తున్నా యాడ్ వేర్ మీ ఫోన్‌ను అటాక్ చేసినట్లు గుర్తించాలి. ♦ మాల్వేర్, ట్రోజన్ మీ స్మార్ట్ ఫోన్‌ని ఉపయోగించి స్పామ్ టెక్స్ట్ మెసేజ్‌లను మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారికి సెండ్ చేస్తుంటాయి. దీని అర్ధం మీ కాంటాక్ట్ ఫోల్డర్లోకి గుర్తు తెలియని వైరస్ దాడి చేసినట్లు గుర్తించాలి. ♦ మీ స్మార్ట్‌ఫోన్ పనితీరు బాగా తగ్గిపోతుంది. ♦వైరస్లు, మాల్వేర్లు మీ స్మార్ట్‌ఫోన్‌లో కొత్త యాప్‌లను కూడా డౌన్లోడ్ చేస్తుంటాయి. ♦ ఈ యాప్‌లు, మెసేజ్‌ల వల్ల మీ డేటా అంతా అయిపోయింది. ♦ బ్యాటరీ లైఫ్ టైమ్ తగ్గిపోతుంటాయి. పై తరహా ఇబ్బందులు ఎదురవుతుంటే మీ ఫోన్లో వైరస్ దాడి చేసినట్లేనని గుర్తించాలి. ఒకవేళ అదే జరిగితే మీ ఫోన్లో ఉన్న పర్సనల్ డేటా కాపీ చేసుకొని..వైరస్ తొలగించే ప్రయత్నం చేయండి. ప్రమాదాల నుంచి సురక్షితంగా ఉండండి. చదవండి: మార్కెట్లో మరో బడ్జెట్ ఫోన్, ఫీచర్లు మాత్రం అదుర్స్ -
ఫోన్ లిఫ్ట్ చేస్తే ఖాతాలో నగదు మాయం
మోసగాళ్ల కొత్త పంథా.. అకౌంట్ మూసేస్తున్నారంటూ కుచ్చుటోపీ కాణిపాకం: కాణిపాకం వాసులకు గత పది రోజులుగా కంటి మీద కునుకు లేదు! ఆలయ ఉద్యోగులే టార్గెట్‌గా అనామక వ్యక్తులు ఫోన్ చేస్తున్నారు. ఆ ఫోన్ లిఫ్ట్ చేయగానే వారి బ్యాంకు ఖాతాలోని నగదు మాయమైపోతోంది. ఇలా వారం రోజుల్లో దాదాపు పదిమంది నగదు కోల్పోయారు. దేవస్థానం వద్ద పోలీసు స్టేషన్లో పనిచేసే ఒక అధికారికి ఇటీవల ఓ నంబరు నుంచి ఫోను వచ్చింది. ‘మేం ఎస్బీఐ నుంచి మాట్లాడుతున్నాం.. మీ అకౌంట్ నంబరు నిలిపివేయబడింది. పునరుద్ధరించుకోండి’ అంటూ అవతలి వ్యక్తి చెప్పారు. అకౌంట్ నంబర్.. ఏటీఎం నంబర్ చెప్పాల్సిందిగా కోరాడు. వివరాలు చెప్పినా కొద్ది సేపటికే ఆయన అకౌంట్ నుంచి డబ్బు వేరే అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ అయినట్లు మెసేజ్ వచ్చింది. అదేవిధంగా దేవస్థానంలోని శివాలయంలో పనిచేసే ఓ ప్రధాన అర్చకుడికి ఫోన్ వచ్చింది. పై వివరాలన్నీ చెప్పడంతో కొద్ది క్షణాల్లోనే రూ.30 వేలు అకౌంట్ నుంచి వెళ్లిపోయినట్లు ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో ఆయనకు గుండె ఆగినంత పనైంది. బ్యాంకు మేనేజర్‌ను సంప్రదించి విషయం తెలియజేశారు. పరిశీలిస్తామని మేనేజర్ సమాధానం చెప్పారు. చదువురాని వారే టార్గెట్.. మోసగాళ్లు ప్రధానంగా చదువురాని వారిని టార్గెట్‌గా చేసుకున్నారు. వారి మాటల ఆధారంగా అంచనా వేస్తారు. అటు పిమ్మట పూర్తి వివరాలను రాబడతారు. అక్కడినుంచి గుట్టుచప్పుడు కాకుండా తమపని కానిచ్చేస్తున్నారు. వీరు ప్రధానంగా డ్వాక్రా మహిళలు, ఉపాధి సిబ్బంది, గ్రామీణ మహిళలు, దుకాణాలు నిర్వహిస్తున్న వారినే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఫోన్ చేశారు...నగదు పోయింది సోమవారం ఉదయం 7 గంటలకు ఎస్బీహెచ్ మేనేజర్ రామచంద్రారెడ్డిని అంటూ 97090 6564 నుంచి ఫోన్ వచ్చింది. ‘మీ ఖాతా నిలిపివేయబడింది. మీ ఖాతా నంబర్, ఏటీఎం కార్డు నంబర్, పిన్ నంబర్ చెప్పమని’ అడిగారు. తెలియజేశాను. 10 నిమిషాల్లోనే ఖాతాలోని నగదు పూర్తిగా మాయమైంది. ఖాతాలో ఉన్న రూ.30 వేలు చోరీ చేశారు. -శేఖర్, కాణిపాకం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అడ్రస్ లేని నంబర్లతో ఫోన్ చేసి నగదు స్వాహా చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు, ఫైనాన్స్, లక్కీ డ్రా, లాటరీ సెంటర్ల నుంచి ఫోను చేస్తున్నట్లుగా చెబితే వివరాలు చెప్పొద్దు. జాగ్రత వహించాలి. - ఎత్తిరాజులు, కాణిపాకం ఏఎస్ఐ