
ప్రతీకాత్మక చిత్రం
కాణిపాకం (యాదమరి): నకిలీ వజ్రం ఇచ్చి ఓ వ్యక్తి నుంచి రూ.58 లక్షలు దోచేశారు ముగ్గురు ఘరానా మోసగాళ్లు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కాణిపాకంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రమేష్‌బాబు తెలిపిన వివరాల మేరకు.. చిత్తూరుకు చెందిన శ్రీనివాసులు, బంగారుపాళెంకు చెందిన దామోదరం, తవణంపల్లెకు చెందిన బొజ్జయ్య నాలుగు నెలల క్రితం నకిలీ వజ్రం తీసుకొచ్చి కాణిపాకంలోని భాస్కర్ నాయుడుకు రూ.58.6 లక్షలకు విక్రయించారు.
భాస్కర్ నాయుడు దీన్ని విక్రయించేందుకు నెల క్రితం ఓ వజ్రాల వ్యాపారి వద్దకు వెళ్లాడు. అక్కడ వజ్రం నకిలీదని తెలియడంతో అవాక్కయ్యాడు. వజ్రం తిరిగి ఇచ్చేస్తాను, డబ్బులు ఇవ్వండని సదరు ముగ్గురు వ్యక్తులను బతిమలాడినా ససేమిర అనడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment