సినిమాల్లో కూడా అవకాశాలొచ్చాయి.. కానీ: అభిషేకం సీరియల్ నటి | Abhishekam Serial Actress Vandana Open About Casting Couch - Sakshi
Sakshi News home page

క్యాస్టింగ్ కౌచ్‌పై బుల్లితెర నటి వందన ఆసక్తికర కామెంట్స్!

Published Sat, Aug 26 2023 4:14 PM | Last Updated on Sat, Aug 26 2023 5:22 PM

Abhishekam Serial Actress Vandana Open About Casting Couch - Sakshi

భార్యమణి సీరియల్‌ ఎంట్రి ఇచ్చిన నటి వందన. ఆమె పూర్తి పేరు వందన గొల్లు కాగా.. హైదరాబాద్‌లోనే జన్మించింది. ఆమె తల్లిదండ్రుల స్వస్థలం ఏపీలోని కాకినాడ. భీఫార్మసీ చదివిన వందన.. ఆ తర్వాత బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. భార్యమణి సీరియల్‌తో ఎంట్రీ ఇచ్చి.. స్వాతి చినుకులు, అభిషేకం సీరియల్స్‌లో నటించింది. అయితే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ చంద్రశేఖర్‌ను పెళ్లి చేసుకున్న వందనకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆమె అభిషేకం సీరియల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన వందన తన కెరీర్, కుటుంబం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

(ఇది చదవండి: టాలీవుడ్ సీరియల్ నటి నూతన గృహప్రవేశం.. ఎలా ఉందో చూశారా!)

వందన మాట్లాడుతూ..'నా కెరీర్‌ను మొదట యాంకర్‌గా ప్రారంభించా. కానీ యాంకరింగ్ సరిగా చేయలేకపోయా. ఆ తర్వాత నన్ను సీరియల్‌లో నటిస్తావా అని అడిగారు. ఫస్ట్ భార్యమణి సీరియల్‌లో చేశా. ఆ తర్వాత అంతపురం, స్వాతి చినుకులు, ఎవరే మోహిని, సితాకోకచిలుక, అభిషేకం సీరియల్స్‌లో నటించా. ప్రస్తుతం శతమానంభవతిలో చేస్తున్నానని.' తెలిపింది.   

తన భర్త గురించి మాట్లాడుతూ.. 'మావారు నాకు చాలా సపోర్ట్‌గా ఉంటారు. నా పేరేంట్స్ కూడా నన్ను ప్రోత్సహించారు. క్యాస్టింగ్ కౌచ్ అనుభవం నాకైతే ఎదురు కాలేదు. ఏదైనా సరే మన నడవడికను బట్టే ఉంటుంది. ఇన్నేళ్లుగా నా వరకు ఎలాంటి ఫోన్స్ రాలేదు. నన్ను అర్థం చేసుకునే భర్త దొరకడం నా అదష్టం. కానీ కెరీర్ వల్ల నా పిల్లలకు, ఫ్యామిలీకి దూరంగా ఉండటం కాస్తా బాధగానే ఉంటుంది. నాపై ఏదైనా రూమర్స్ వచ్చినా నేను పట్టించుకోను. నా గురించి ఎవరో ఏదో అనుకుంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను సీరియల్స్ చేసేటప్పుడు సెకండ లీడ్ చేస్తున్నారని కొందరు అడిగేవారు. అలా సెకండ్ లీడ్స్ చేసినప్పుడు కాస్తా బాధపడేదాన్ని. ఇప్పుడైతే అలాంటి బాధ లేదు. మెయిన్‌ రోల్ పాత్రలు చేయొచ్చు కదా అనేవారు. కానీ ఎన్టీఆర్, నాని సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. కానీ ఇంట్లో వాళ్లు వద్దన్నారు.' అంటూ చెప్పుకొచ్చింది. 

(ఇది చదవండి: షాపింగ్‌ మాల్‌ ప్రారంభానికి పూజా హెగ్డే.. రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా..?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement