vandana
-
సినిమాల్లో కూడా అవకాశాలొచ్చాయి.. కానీ: అభిషేకం సీరియల్ నటి
భార్యమణి సీరియల్ ఎంట్రి ఇచ్చిన నటి వందన. ఆమె పూర్తి పేరు వందన గొల్లు కాగా.. హైదరాబాద్‌లోనే జన్మించింది. ఆమె తల్లిదండ్రుల స్వస్థలం ఏపీలోని కాకినాడ. భీఫార్మసీ చదివిన వందన.. ఆ తర్వాత బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. భార్యమణి సీరియల్‌తో ఎంట్రీ ఇచ్చి.. స్వాతి చినుకులు, అభిషేకం సీరియల్స్‌లో నటించింది. అయితే సాఫ్ట్వేర్ ఇంజినీర్ చంద్రశేఖర్‌ను పెళ్లి చేసుకున్న వందనకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆమె అభిషేకం సీరియల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన వందన తన కెరీర్, కుటుంబం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. (ఇది చదవండి: టాలీవుడ్ సీరియల్ నటి నూతన గృహప్రవేశం.. ఎలా ఉందో చూశారా!) వందన మాట్లాడుతూ..'నా కెరీర్‌ను మొదట యాంకర్‌గా ప్రారంభించా. కానీ యాంకరింగ్ సరిగా చేయలేకపోయా. ఆ తర్వాత నన్ను సీరియల్లో నటిస్తావా అని అడిగారు. ఫస్ట్ భార్యమణి సీరియల్లో చేశా. ఆ తర్వాత అంతపురం, స్వాతి చినుకులు, ఎవరే మోహిని, సితాకోకచిలుక, అభిషేకం సీరియల్స్‌లో నటించా. ప్రస్తుతం శతమానంభవతిలో చేస్తున్నానని.' తెలిపింది. తన భర్త గురించి మాట్లాడుతూ.. 'మావారు నాకు చాలా సపోర్ట్‌గా ఉంటారు. నా పేరేంట్స్ కూడా నన్ను ప్రోత్సహించారు. క్యాస్టింగ్ కౌచ్ అనుభవం నాకైతే ఎదురు కాలేదు. ఏదైనా సరే మన నడవడికను బట్టే ఉంటుంది. ఇన్నేళ్లుగా నా వరకు ఎలాంటి ఫోన్స్ రాలేదు. నన్ను అర్థం చేసుకునే భర్త దొరకడం నా అదష్టం. కానీ కెరీర్ వల్ల నా పిల్లలకు, ఫ్యామిలీకి దూరంగా ఉండటం కాస్తా బాధగానే ఉంటుంది. నాపై ఏదైనా రూమర్స్ వచ్చినా నేను పట్టించుకోను. నా గురించి ఎవరో ఏదో అనుకుంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను సీరియల్స్ చేసేటప్పుడు సెకండ లీడ్ చేస్తున్నారని కొందరు అడిగేవారు. అలా సెకండ్ లీడ్స్ చేసినప్పుడు కాస్తా బాధపడేదాన్ని. ఇప్పుడైతే అలాంటి బాధ లేదు. మెయిన్ రోల్ పాత్రలు చేయొచ్చు కదా అనేవారు. కానీ ఎన్టీఆర్, నాని సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. కానీ ఇంట్లో వాళ్లు వద్దన్నారు.' అంటూ చెప్పుకొచ్చింది. (ఇది చదవండి: షాపింగ్ మాల్ ప్రారంభానికి పూజా హెగ్డే.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?) -
రిమ్జిమ్ గిరే సావన్.. ఒక జంట.. ఒక వాన.. ఒక పాట..
వానొస్తుంటే ఎవరైనా ఏం చేస్తారు? కిటికీలో నుంచి చూస్తారు. బయటకెళ్లకండి అని భార్య అంటుంది. టీ పెట్టమని భర్త అంటాడు. కాని ముంబైకి చెందిన శైలేష్, వందన అనే భార్యాభర్తలు మాత్రం ముంబై రోడ్ల మీద తడవడానికి బయలుదేరారు. ఒకప్పటి‘మంజిల్’ సినిమాలో ‘రిమ్జిమ్ గిరే సావన్’ హిట్ పాటలో ఎలాగైతే అమితాబ్, మౌసమీ చటర్జీ తడుస్తూ తిరిగారో అచ్చు అలాగే తిరిగారు. పాటను షూట్ చేసి వదిలితే వైరలే వైరలు. ఒక జంట. ఒక వాన. ఒక పాట. గతం మళ్లీ వర్తమానం అయ్యింది. నిజ పాత్రలు నటీనటులు అయ్యారు. ముంబై నగర వీధుల్లో ఒక సుందర దృశ్యం ఆవిష్కృతం అయ్యింది. చూసిన ప్రేక్షకులు మురిసిపోయారు. ఆనంద్ మహీంద్ర అంతటి వాడు ట్వీట్ చేసి మెచ్చుకున్నాడు. ఇప్పటి వరకూ లక్షల మంది వీక్షించారు. ఇంతకూ ఏమిటది? రిమ్జిమ్ గిరె సావన్ పాట. రీమేక్ పాట. మంజిల్ సినిమా నుంచి అమితాబ్, మౌసమీ చటర్జీ నటించిన ‘మంజిల్’ (1979) సినిమాకు దర్శకుడు బాసూ చటర్జీ. సినిమా ఓ మోస్తరుగా ఆడినా ‘రిమ్జిమ్ గిరె సావన్’ పాట పెద్ద హిట్. కిశోర్ కుమార్ వెర్షన్, లతా వెర్షన్ ఉంటాయి. లతా వెర్షన్‌ను బాసూ చటర్జీ నిజమైన వర్షంలో తీయాలనుకున్నాడు. ముంబైలో వాన కురుస్తున్న రోజు ఒక చిన్న యూనిట్‌ను పెట్టుకుని సూట్లో ఉన్న అమితాబ్‌ను, చీరలో ఉన్న మౌసమీ చటర్జీని రోడ్ల మీద నడిపిస్తూ పిక్చరైజ్ చేశాడు. ఈ పాట పెద్ద హిట్. సేమ్ ఇదే పాటను ఇన్నేళ్ల తర్వాత ఈ జంట మళ్లీ అభినయించింది. వారి పేర్లు శైలేష్, వందన ముంబైలోని థానేలో నివసించే శైలేష్, వందనలకు పెళ్లయ్యి 26 ఏళ్లు. ఒకరి పట్ల ఒకరికి చాలా ప్రేమ, ఇష్టం. ఈ ఇష్టం ఒక వానరోజున రికార్డు చేద్దామని, అదీ రిమ్జిమ్ గిరే సావన్ పాటలా ఉండాలని శైలేష్ కోరిక. భార్య దగ్గర ఎప్పుడు ప్రస్తావన తెచ్చినా ఆమె సిగ్గుతో ‘నేను చేయనండీ’ అనేది. శైలేష్ పట్టు వీడక ఈ సంగతి తన స్నేహితుడు అనుప్ రింగాన్గవాకర్కు చెప్పాడు. అనుప్ భార్య అంకిత ఇది విని ఉత్సాహపడింది. వాళ్లిద్దరినీ మనిద్దరం వానలో షూట్ చేద్దాం అని చెప్పింది. ఇంకేముంది శైలేష్ అచ్చు మంజిల్ సినిమాలోని సూట్ లాంటిది కుట్టించుకున్నాడు. వందన అలాంటి చీరలోనే నిరాడంబరంగా తయారైంది. మొన్న మొదలైన వానల్లో ఒకరోజు మొత్తం పాటను సేమ్ అవే లొకేషన్లలో తీశారు. పెద్ద హిట్ పాత పాట ఎంత హిట్టో ఈ పాట అంతే హిట్ అయ్యింది. ‘మేము ఇంత రెస్పాన్స్ ఊహించలేదు’ అని శైలేష్ అన్నాడు. ‘మా లొకాలిటీలో మేము సెలబ్రిటీలం అయిపోయాం’ అని చెప్పాడు. దేశవిదేశాల్లో ఈ వీడియోకు ఆదరణ లభించింది. ‘మనసుండాలి గాని ప్రతి సందర్భాన్ని ఆనందమయం చేసుకోవచ్చు’ అని చాలా మంది మెచ్చుకున్నారు. ఈ జంటను చాలామంది డిన్నర్‌కు పిలుస్తున్నారు. అన్నట్టు ‘మంజిల్’ కోసం ఈ పాటను నిజమైన వానలో తీసేప్పుడు అమితాబ్ నడకను అందుకోవడానికి మౌసమీ చటర్జీ పరుగులు తీయాల్సి వచ్చేది. అమితాబ్ కాళ్లు పొడవు కదా. ‘చాలాసార్లు ఆయన మెల్లగా నడిచి బేలెన్స్ చేసేవాడు. షూటింగ్ కోసం చాలాసేపు చీర నానడం వల్ల ఇంటికొచ్చాక దాని రంగు నా ఒంటి మీద అంటుకుపోయింది. వానలో పాట మాకు ఏమీ వినిపించేది కాదు. దూరం నుంచి డైరెక్టర్ కర్చీఫ్ ఆడిస్తే యాక్షన్ అని, మళ్లీ ఆడిస్తే కట్ అని భావించే నటించాం’ అని మౌసమీ చటర్జీ గుర్తు చేసుకుంది. వానలు మనకు అంతగా పడట్లేదు. పడినప్పుడు ఈ పాట చూడండి. -
మిస్టరీగా వందన మృతి.. సందీప్ ఇంట్లో ఏం జరిగింది..?
శ్రీకాళహస్తి: అనుమానాస్పద స్థితిలో యువతి మృతిచెందిన ఘటన శ్రీకాళహస్తిలో బుధవారం చోటుచేసుకుంది. టూ టౌన్ సీఐ భాస్కర్‌నాయక్ కథనం మేరకు.. శ్రీకాళహస్తి మండలం ముచ్చివోలుకు చెందిన వందన (20) తొట్టంబేడు మండలం పొయ్యగ్రామంలో మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్‌గా పనిచేస్తోంది. పట్టణంలోని కుమ్మరివీధికి చెందిన పులి సందీప్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వరుసకు బావమరదళ్లు కావడంతో త్వరలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో వందన బుధవారం ఉద్యోగానికి వెళ్లే ముందు సందీప్ ఇంటికి వెళ్లింది. అక్కడ ఏం జరిగిందో కానీ కాసేపటికి హాల్లో సందీప్ నిద్రిస్తుండగా బాత్రూమ్లో వందన ఉరివేసుకుని మృతి చెందింది. భయాందోళనకు గురైన సందీప్ వెంటనే పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని విషయం చెప్పాడు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ భాస్కర్‌నాయక్, ఎస్ఐ మహేష్ మృతదేహాన్ని పరిశీలించారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఎవరికీ చెప్పకుండా యువతి ఎందుకు సందీప్ ఇంటికి వెళ్లింది? వాళింట్లో ఏం జరిగిందో మిస్టరీగా మారింది. దీనిపై పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాకే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని సీఐ భాస్కర్‌నాయక్ తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం పూర్తిచేసిన అనంతరం బంధువులకు అప్పగించారు. చదవండి: (ఆరేళ్లక్రితం వివాహం.. భర్తే అత్తమామలకు ఫోన్‌చేసి) -
నాసా రోవర్.. సాఫ్ట్ వేర్ రాసింది మన మహిళే!
మొన్నటి ‘పెర్సీ’ రోవర్‌తో కలిపి నాసా ఇంతవరకు ఐదు రోవర్లను అంగారకుడి మీదకు పంపింది. వాటిల్లో స్పిరిట్, ఆపర్చునిటీ, క్యూరియాసిటీ అనే రోవర్లకు, తాజా పెర్సీ రోవర్‌కు లాండింగ్ సాఫ్ట్ వేర్ రాసింది మన భారతీయ మహిళే! పేరు వందన. పెర్సీ ప్రాజెక్టును విజయవంతం చేసిన స్వాతి టీమ్‌లోని సభ్యురాలు. 2007 నుంచి నాసాలో రోబోటిసిస్ట్గా పని చేస్తున్న వందన పంజాబీ మహిళ. నాసా ఆఫీస్‌లో అంతా వందనను ‘వండీ’ అని పిలుస్తారు. అందరితో ఆమె కలుపుగోలుగా ఉండటమే ఆ ఆప్యాయతకు కారణం. అంగారకుడి పైకి పంపే రోవర్ల నియంత్రణకు స్క్రీన్‌ప్లే వంటి సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడంలో ఆమె నిపుణురాలు. ఇప్పటి వరకు నాసా పంపిన ఐదు రోవర్లలో ఒక్క సోజర్న్ రోవర్‌కు తప్ప మిగతా వాటన్నిటికీ ఆమే సాఫ్ట్వేర్ రాశారు. వ్యోమగామి కల్పనాచావ్లా జన్మస్థలమైన హర్యానా పక్క రాష్ట్రం పంజాబ్ నుంచే వందన కూడా నాసా వరకు వెళ్లారు. పంజాబ్‌లోని హల్వారా వందన జన్మస్థలం. ఆమె తండ్రి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ లో పైలట్. ఉద్యోగ రీత్యా వందన చిన్నప్పుడే ఆయన భారతదేశంలోని ముఖ్య నగరాలన్నీ చుట్టేశారు. వాటిని చుట్టినట్లే ఆమెకు అంతరిక్షాన్నీ చుట్టి రావాలని ఉండేది. హల్వారాలోనే కేంద్రీయ విద్యాలయలో పాఠశాల చదువు పూర్తయింది. చండీగఢ్ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ అయింది. తర్వాత యూఎస్‌లోని కార్నెగీ మెలాన్ యూనివర్శిటీ (సి.ఎం.యు.) లో రోబోటిక్స్ తీసుకుని మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఆ తర్వాత పీహెచ్‌డి. చదువుకుంటూనే ఆమె చేసిన పని విమానం నడపడంలో శిక్షణ తీసుకుని పైలట్ లైసెన్స్ సంపాదించడం. చదువుతున్నప్పుడే పార్ట్ టైమ్‌గా దక్షిణమెరికా అటకామా ఎడారిలో ఆస్ట్రోబయాలజీ ప్రయోగాల్లో పాల్పంచుకున్నారు. అటాకామాలో అంగారకుడి పోలిన స్నేహపూర్వకం కాని వాతావరణం ఉంటుంది. అక్కడ పరిశోధనలు చేశారు. ఇక సి.ఎం.యు.లోనైతే నిర్దేశించిన అవసరాలకు తగినవిధంగా రోబోను తయారు చేసి దానిని నియంత్రించే ప్రోగ్రామ్‌ను రాయడంలో వందనకే ఎప్పుడూ ఫస్ట్. అలా ఆమెకు అంగారకుడి మీద, అంగారకుడిపైకి పంపే రోవర్ల మీద పట్టు లభించింది. 2006లో నాసాలో అవకాశం వచ్చింది. అక్కడ ఆమె తొలి ప్రాజెక్టే ‘ప్లెక్సిల్’కు సాఫ్ట్వేర్ రాయడం. ఫ్లెక్సిల్ అంటే ప్లాన్ ఎగ్జిక్యూషన్ ఇంటర్‌ఛేంజ్ లాంగ్వేజ్. అదొక ఆటోమేషన్ టెక్నాలజీ భాష. ఆ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఇప్పుడు పెర్సీని అంగారకుడి పైకి దింపింది కూడా నాటి ఫ్లెక్సిల్ సాఫ్ట్‌వేర్‌కు అభివృద్ధి రూపమే. వందన 2007లో నాసా వారి జెట్ ప్రొపల్షన్ లేబరీటరీలో జాయిన్ అయ్యారు. అక్కడ మరింత అధునాతనమైన, మెరుగైన రోబో టెక్నాలజీని కనిపెట్టవలసి ఉంటుంది. అక్కడ ఆమె ప్రతిభ ఆమెను ఆటానమస్ సిస్టమ్స్ ప్రాజెక్టుకు గ్రూప్ లీడర్‌ను చేసింది. ఆ ప్రతిభా నైపుణ్యాలే వందనకు నాసాలో విశిష్టమైన రోబోటిసిస్టుగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. నాసా లేబరేటరీలో రోవర్ల మధ్య వందన -
బాలిక దీనస్థితిపై కేటీఆర్ స్పందన
సాక్షి, మునుగోడు: తల్లిదండ్రులతో పాటు సోదరుడిని కోల్పోయి అనాథగా మిగిలిన పన్నెండేళ్ల బాలిక వందనను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను ఆదేశించారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం చొల్లేడు గ్రామానికి చెందిన బొడ్డు అంజయ్య రెండేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకోగా.. అతడి కుమారుడు ఏడాది క్రితం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో దుర్మరణ పాలయ్యాడు. భర్త, కుమారుడిని కోల్పోయిన పద్మ అనారోగ్యం బారినపడి ఇటీవల కన్నుమూసింది. దీంతో ఆమె కుమార్తె వందన ఒంటరిదైంది. ఆ బాలిక దీనగాథను ‘‘నాకు దిక్కెవరు దేవుడా’’ అనే శీర్షికన గత సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో వార్త ప్రచురితమైంది. చదవండి: (నాకు దిక్కెవరు దేవుడా?) ఆ వార్త క్లిప్పింగ్‌ను సంస్థాన్ నారాయణపురానికి చెందిన గంధమల్ల సతీష్ ట్విట్టర్లో పోస్టు చేశాడు. దాన్ని చూసిన మంత్రి కేటీఆర్ ఆ బాలికకు ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. దీంతో కలెక్టర్ మంగళవారం జిల్లా సంక్షేమ అధికారిణి సుభద్రని అనాథ బాలికను పరామర్శించి స్థితిగతులు తెలుసుకోవాలని ఆదేశించారు. అందుకు ఆమె వెంటనే గ్రామానికి చేరుకుని వందనని పరామర్శించి తల్లి దశదిన కరమ్మ అనంతరం చిల్డ్రన్స్ వెల్ఫేర్ సెంటర్‌కు తరలిస్తామని తెలిపారు. ఇతర వసతుల ఏర్పాట్లపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని, అప్పటి వరకు బంధువులు, గ్రామస్తులు బాలికకు అండగా ఉండాలని కోరారు. తక్షణ సాయంగా రూ.30వేల నగదును ఆ బాలికకు అందించారు. ఆమె వెంట సీడీపీఓ కవిత, ఏసీడీపీఓ వెంకటమ్మ, సూపర్వైజర్ జ్యోతి తదితరులు ఉన్నారు. -
వందన వాళ్లబ్బాయి
గ్రేడ్లు..తెలివితేటలను కొలవలేవు. మార్కులు, ర్యాంకులు.. అంటూ పిల్లలను ఊదరగొడుతున్న నేటి పోటీ ప్రపంచంలో ఒక అమ్మగా ఇది నేను నమ్మిన సత్యం. – వందన సూఫియా కటోచ్ డిసెంబర్ దాటిందంటే.. పదో తరగతి పిల్లలకు, వాళ్ల పెద్దవాళ్లకూ ఫైనల్ ఎగ్జామ్స్ మూడ్ (ఫోబియా అనాలేమో!) వచ్చేస్తుంటుంది. ‘కార్పొరేట్ విద్యాసంస్థల మాయాజాలంలో పడవద్దు. పిల్లలను ఒత్తిడికి గురి చేయవద్దు. తెలివితేటలు ర్యాంకుల్లో ఉండవు. పిల్లల్లో మేధాశక్తిని వికసించనివ్వండి. వాళ్లకు ఇష్టమైన కోర్సుల్లో చేరనివ్వండి. పదో తరగతి ఆ తరగతికే కానీ పరీక్ష జీవితానికి కాదు’ అని నెటిజన్లు ఒక పాత పోస్ట్‌ను తెరమీదకు తెచ్చారు. అదిప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది! దాని గురించి తెలుసుకోవలసిందే. తనయులు ఆమెర్ (ఎడమ), ఆయాన్లతో వందన. చదువు వ్యాపారమైపోయి దాదాపుగా మూడు దశాబ్దాలవుతోంది. మన పిల్లలు ఏం చదవాలన్నది కార్పొరేట్ స్కూళ్లు నిర్ణయించేస్తున్నాయి. పిల్లల మార్కులు తొంబైకి తగ్గితే పేరెంట్స్‌ని పిలిచి క్లాస్‌లు పీకుతున్నాయి. టెన్త్ క్లాస్, ట్వల్త్ క్లాస్ రిజల్ట్స్ వస్తున్నాయంటే పిల్లల వెన్నులో వణుకు మొదలవుతుంటుంది. తల్లిదండ్రుల్లో ఆందోళన. ఇక రిజల్డ్స్కి ముందు ఇంట్లో ఆందోళనతో కూడిన మౌనం రాజ్యమేలుతుంటుంది. మార్కులు తగ్గితే అమ్మానాన్నలు తన మీద పెట్టుకున్న ఆశలకు విఘాతం కలుగుతుందేమోనని పిల్లలు నలిగిపోతుంటారు. మార్కులు తగ్గితే మంచి కాలేజ్‌లో సీట్ రాదేమో, పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో అని అమ్మానాన్నల గుండెలు పల్పిటేషన్కు గురవుతుంటాయి. ఇలాంటి రోజుల్లో... ఢిల్లీకి చెందిన వందన ‘స్ట్రెస్ బస్టర్’ విప్లవాన్ని తెచ్చారు. తల్లిదండ్రులందరూ వందనలాగానే ఆలోచిస్తే పిల్లల్లో చదువు ఒత్తిడి కానే కాదు. రాబోతున్న పరీక్షల సీజన్లో కూడా ఆడుతూ పాడుతూ హాయిగా చదువుకుంటారు. వందన ఏం చేసిందంటే గత ఏడాది (2018–19 విద్యా సంవత్సరం) వందన కొడుకు ఆమెర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పదోతరగతి పరీక్షలు రాశాడు. మే నెలలో రిజల్ట్స్ వచ్చాయి. వందనకు తన కొడుకు తొంబైలతో పాస్ కాడని తెలుసు. మొత్తానికైతే పాస్ అయి తీరుతాడనీ తెలుసు. తన కొడుకు తెలివితక్కువ వాడేమీ కాదు. ఎన్ని తెలివితేటలుంటే మాత్రం ‘చేప చెట్టెక్కుతుందా’ అనేది ఆమె ఫిలాసఫీ. ‘తనకు ఇష్టం లేని సబ్జెక్టులన్నీ చదవమంటే ఎన్నింటినని బలవంతంగా బుర్రలో దాచుకుంటాడు’ అని కూడా కొడుకు తరఫున వాదిస్తుంది. టెన్త్ పరీక్షలకు మూడు నెలల ముందు నుంచే ఆమె కొడుకు మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. ఫెయిల్ కాకుండా ఉండడానికి మాత్రమే కొడుకు ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టిందామె. ఆ పిల్లాడు తన శక్తి కొద్దీ కష్టపడ్డాడు కూడా. అరవై శాతం మార్కులతో పాసయ్యాడు. కొడుకు ముఖం చిన్నబుచ్చుకోకూడదని రిజల్ట్స్ రోజు, రిజల్ట్స్ ప్రకటించే సమయానికి వందన కూడా స్కూల్‌కెళ్లారు. అప్పటికే తొంభైశాతం స్టూడెంట్స్ అంతా ఒకరినొకరు అభినందించుకుంటూ కనిపించారు. తల్లిని చూడగానే వందన వాళ్లబ్బాయి దీనంగా ముఖం పెట్టి ‘‘సిక్స్టీ పర్సెంట్ అమ్మా’’ అన్నాడు. వందన అమాంతం కొడుకుని దగ్గరకు తీసుకుని ‘‘యూ మేడ్ మమ్మా ప్రౌడ్’’ అని ముద్దు పెట్టుకున్నారు! అదే విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ‘‘మా అబ్బాయి సిక్స్టీ పర్సెంట్‌తో టెన్త్‌క్లాస్ పాసయ్యాడు. నాకు చాలా గర్వంగా ఉంది. మీరేమీ పొరబడడం లేదు. 90 పర్సెంట్ అని రాయబోయి ఆ అంకె పొరపాటున 60గా కంపోజ్ కాలేదు. నిజంగా 60 శాతమే. ఇష్టం లేని సబ్జెక్టు కోసం కష్టపడమని పిల్లలను వేధించడం కూడా తప్పే. మన విద్యావిధానంలో పదోతరగతి వరకు ఇష్టం ఉన్నా లేకపోయినా అన్ని సబ్జెక్టులనూ చదవాల్సిందే. టెన్త్ గట్టెక్కడం కోసం మాత్రమే మా అబ్బాయికి ఇష్టంలేని సబ్జెక్టులను కూడా దగ్గరుండి చదివించాను. ఇప్పుడా గండం గట్టెక్కేశాడు. ఇక మా వాడు ఫ్రీ. తనకు ఇష్టమైన సబ్జెక్టుల్లోనే ప్లస్ వన్ చదువుకుంటాడు’’ అని ఆమె పెట్టిన పోస్ట్‌ని దాదాపుగా తొమ్మిది వేల మంది లైక్ చేశారు. పన్నెండు వేల మంది సానుకూలమైన కామెంట్ చేశారు. మరో ఐదు వేల మందికి పైగా ఆ పోస్ట్‌ను షేర్ చేశారు. అరవై శాతం మార్కులను తక్కువగా చూసే వాళ్లకు ఇదో పాఠం అనే కామెంట్లు కూడా వచ్చాయి. – మంజీర -
బెజవాడ మహిళకు తెలంగాణ ‘కిరీటం’
సాక్షి, విజయవాడ: మిసెస్ ఇండియా తెలంగాణగా విజయవాడకు చెందిన భావన లహోటి విజయం సాధించారు. పెళ్లి అయిన మహిళలకు నిర్వహించిన ఈ పోటీల్లో గెలుపొందడం ద్వారా 27 ఏళ్ల భావన విజయవాడ నుంచి ఈ ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డు సాధించారు. అందం, ఆత్మవిశ్వాసం, తెలివితేటలు, ర్యాంప్ వాక్‌లలో బెజవాడ మహిళలు ఏమాత్రం తీసిపోరని భావన నిరూపించారు. హైదరాబాద్‌లో బుధవారం రాత్రి వరకు జరిగిన ఈ పోటీల్లో తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 111 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ పోటీల్లో భావన కిరీటాన్ని కైవసం చేసుకోవటంతో పాటు మిసెస్ ఇండియా పోటీలకు అర్హత సాధించారు. కూచిపూడి నాట్యంలో పట్టభద్రురాలైన భావన.. గౌరవ డాక్టరేట్‌తో పాటు 22 స్టేట్, నేషనల్ అవార్డులను పొందారు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన సినిమా బాహుబలిలో శాస్త్రీయ నృత్యాలకు భావన కొరియోగ్రఫీ చేశారు. గతంలో పదేళ్లపాటు టీవీ రిపోర్టర్‌గా పని చేశారు. క్లాసిక్ మిసెస్ ఇండియా తెలంగాణ కిరీటాన్ని రాధిక అగర్వాల్ దక్కించుకున్నారు. సూపర్ క్లాసిక్ మిసెస్ ఇండియా తెలంగాణ టైటిల్‌ను డాక్టర్ శోభ, పద్మజ కొడారి సంయుక్తంగా గెల్చుకున్నారు. -
పెద్దపల్లిలో తుపాకి మిస్ పైర్ కలకలం
-
పరీక్షల్లో ఫెయిల్..నలుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
-
నలుగురు విద్యార్థుల ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ముగ్గురు, మార్కులు తక్కువ వచ్చాయని ఒకరు వెరసి నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం ఇంటర్ ఫలితాలు వచ్చిన కొద్దిసేపటికే సిటీలో ఈ విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. ♦ వనస్థలిపురం సుభద్రానగర్‌కు చెందిన ఎ.ఉదయ మాణిక్య వరప్రకాశ్ కుమార్తె వందన దిల్‌సుఖ్‌నగర్‌లోని శ్రీచైతన్య కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఫలితాల్లో 440కి 325 మార్కులే వచ్చాయని మనస్తాపానికి గురైన వందన బెడ్రూమ్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ♦ కూకట్పల్లి పరిధి ఖైత్లాపూర్‌లో ఉండే కాట్రాజ్ శేఖర్ కుమారుడు సాయికుమార్ (17) ఎంఎన్ఆర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. మొదటి సంవత్సరం ఫలితాల్లో ఇతడు ఫెయిలయ్యాడు. మనోవేదనకు గురైన సాయికుమార్‌ను తల్లిదండ్రులు ఓదార్చి మళ్లీ రాసి పాస్ కావచ్చని చెప్పి విధులకు వెళ్లారు. మధ్యాహ్నం సాయికుమార్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ♦ పిర్జాదిగూడ మల్లికార్జున్ నగర్లో నివసించే దూలం మధు కుమార్తె వర్ష (16) ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు రాసి, అన్ని సబ్జెక్ట్లూ తప్పింది. దీంతో మనస్తాపం చెందిన వర్ష ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ♦ గాజులరామారం ఉషోదయ కాలనీకి చెందిన మువ్వ రామకృష్ణ కుమార్తె శ్రీవిద్య (18) చింతల్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం పరీక్షలు రాసింది. ఫలితాల్లో ఆమె నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిలైన విషయం తెలిసి, వారు నివాసముండే అపార్ట్మెంట్లోని నాలుగో అంతస్తు నుంచి కిందికి దూకేసింది. అక్కడికక్కడే మృతి చెందింది. -
విశాల్ సిక్కా భార్య వందన రాజీనామా
బెంగళూరు: ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ లో మరోకీలక పరిణామం చోటు చేసుకుంది. కంపెనీ మాజీ సీఎండీ విశాల్ సిక్కా భార్య వందన సిక్కా ఐటీ సేవల దాతృత్వ సంస్థ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ను వీడారు. కంపెనీకి అందించిన ఈమెయిల్ ద్వారా ఈ సమాచారం అందించారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ యుఎస్ఎ ఛైర్ పర్సన్‌గా తన పాత్రనుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. అలాగే తన రాజీనామా విషయాన్ని తన బ్లాగ్‌లో, ట్విట్టర్లో కూడా పేర్కొన్నారు. కంపెనీ సీఎండీగా విశాల్ సిక్కా రాజీనామాచేయడంతో ఆయన భార్యకూడా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్మన్ పదవికి గుడ్ బై చెప్పారు. రెండున్నర సంవత్సరాలు ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌కు ఆమె పనిచేశారు. కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉంది మరియు ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌లో చేరకముందు ఒక స్టార్టప్ కంపెనీని ప్రారంభించాలని యోచించారు. Proud of 2.5 amazing yrs creating & scaling purposeful work with the team @InfyFoundation! Thx all for your support.https://t.co/0etMhfTJJA — Vandana Sikka (@VTSikka) August 29, 2017 -
ప్రేమించిన అమ్మాయిని చంపి.. తాను కూడా
కాన్పూర్: ఎంతోకాలంగా వారిద్దరు ప్రేమించుకున్నారు. చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. కానీ కుటుంబం ఒత్తిడి నేపథ్యంలో ఆ అమ్మాయి మరో యువకుడితో పెళ్లికి సిద్ధమైంది. త్వరలో ఆమె వివాహం. ఈ విషయం తెలిసిన ప్రేమికుడు...ప్రియురాలిపై ఆగ్రహతో నేరుగా వచ్చి కాల్పులు జరిపి ఆమెను హత్య చేశాడు. అనంతరం తనను తాను కాల్చుకుని చనిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం సత్యకేశ్ పాశ్వాన్ అనే 26 ఏళ్ల యువకుడు గత కొంత కాలంగా ఓ టెంపో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడు.. వందన అనే 22 ఏళ్ల యువతి గత కొంత కాలంగా ప్రేమించుకున్నారు. అయితే, ఇటీవలే ఆ అమ్మాయికి ఇంట్లో వారు సంబంధం చూసి పెళ్లికి సిద్ధం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పాశ్వాన్ తన ప్రేయసి అని కూడా చూడకుండా కర్కశుడై ఆమెను దారుణంగా కాల్చిచంపి అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
సేవ్ లవ్..!
ప్రేమించుకుని పెళ్లి చేసుకునేవాళ్లు ఒక తరహా అయితే, పెద్దలు ఒప్పుకోలేదని విడిపోయే ప్రేమికులు మరో తరహా. ఈ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘వందనం’. దీపక్, మాళవికా మీనన్ జంటగా కందిమల్ల మూవీమేకర్స్ పతాకంపై కందిమల్ల చంద్రశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోటపాటి శ్రీను దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తిచేసుకుంది. దర్శకనిర్మాతలు మాట్లాడుతూ -‘‘వైజాగ్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. ‘సేవ్ లవ్’ అనే నినాదం చుట్టూ ఈ కథాంశం తిరుగుతుంది. ఈ నెలాఖరులో పాటలను, జూన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: స్వర్ణ సుధాకర్, సమర్పణ: కందిమల్ల పద్మావతి. -
ఏం చేస్తే తను మారుతుంది?
వేదిక స్నేహమనేది ఎప్పుడూ నిన్ను ఒక వ్యక్తిగా నిలబెట్టాలి తప్ప, తప్పు దోవలో నడిపించకూడదు. అలా నడిపిస్తే అది నిజమైన స్నేహమే కాదని నా స్థిరమైన అభిప్రాయం. ఆ అభిప్రాయమే నన్ను, రమ్యను దూరం చేసిందనుకుంటా. నేను, రమ్య ఎంత మంచి స్నేహితులమంటే... ఎక్కడికైనా ఇద్దరం కలిసే వెళ్లేవాళ్లం. ఒకే స్కూలు, ఒకే ట్యూషను, ఒకే కాలేజీ... మా స్నేహాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. కొందరు అసూయ కూడా పడేవారు. అలాంటి మా మధ్య దూరం పెరుగుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. చదువులు పూర్తయ్యాక ఇద్దరం ఒకేసంస్థలో ఉద్యోగాలు సంపాదించాం. కొన్నాళ్లపాటు బాగానే గడిచింది. కానీ రోజులు గడిచేకొద్దీ రమ్యలో ఏదో మార్పు. తనకి కొత్త ఫ్రెండ్స్ వచ్చారు. దానివల్ల నాకు ఇబ్బంది లేదు. కానీ తన స్నేహాలు సరిగ్గా లేకపోవడమే నన్ను బాధించింది. ఎటువంటి కమిట్మెంట్స్, సిన్సియారిటీ లేని మనుషులతో తిరుగుతూ తను కూడా వాళ్లలా తయారవడం మొదలుపెట్టింది రమ్య. అది నాకు నచ్చలేదు. చాలాసార్లు వారించాను. పనిని నిర్లక్ష్యం చేయవద్దని చెప్పాను. కానీ తను వినలేదు. పైగా నా పోరు పడలేక నన్ను దూరం పెట్టడం మొదలుపెట్టింది. దీనికితోడు తనను నిస్వార్థంగా, నిష్కల్మషంగా అభిమానించిన నాకు అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టింది రమ్య. తనని ఏమీ అనలేకపోయేదాన్ని. అలాగని తనను సపోర్ట్ చేయలేను. ఎందుకంటే, తను వెళ్తోన్న దారి తప్పని నాకు తెలుసు కాబట్టి. తన ప్రవర్తన కారణంగా తను కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పుడు నేను తనని వెనకేసుకుని రాలేకపోయాను. నువ్వలా చేసివుండకపోతే ఈ పరిస్థితి వచ్చి వుండేది కాదు కదా అన్నాను. ఆ మాటని తను తప్పుగా అర్థం చేసుకుంది. నేను తనని దూరం పెడుతున్నానని అనుకుంది. తనే నాకు దూరంగా వెళ్లిపోయింది. నిజానికి ఆ దూరం తను కోరుకుంది. కానీ అది నన్ను మాత్రం చాలా బాధించింది. ఆ విషయం ఎలా చెబితే రమ్యకి అర్థమవుతుంది! ఏం చేస్తే తను మారుతుంది! కనీసం మీరైనా చెప్పరూ! - వందన, రాయచూర్ -
నీకు ఓకేనా...
శ్రీ సుమంత్, వందన, మధుమిత్ర హీరో హీరోయిన్లుగా రత్నగిరి .డి దర్శకత్వంలో రత్నంహరి కుప్పాల నిర్మిస్తున్న ‘నాకు ఓకే... నీకు ఓకేనా’ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నిర్మాత మాట్లాడుతూ -‘‘పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. సగం సిటీలోనూ, మిగతా సగం పల్లెటూరి నేపథ్యంలోనూ ఉంటుంది. రాజమండ్రిలో 5 వేల మందితో కొన్ని సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరిస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రాఘవ నూలేటి, సంగీతం: సురేష్.