ప్రేమించిన అమ్మాయిని చంపి.. తాను కూడా | Jilted man murders lover, kills self | Sakshi
Sakshi News home page

ప్రేమించిన అమ్మాయిని చంపి.. తాను కూడా

Published Mon, Sep 21 2015 3:17 PM | Last Updated on Thu, Sep 19 2019 8:40 PM

ప్రేమించిన అమ్మాయిని చంపి.. తాను కూడా - Sakshi

ప్రేమించిన అమ్మాయిని చంపి.. తాను కూడా

కాన్పూర్: ఎంతోకాలంగా వారిద్దరు ప్రేమించుకున్నారు. చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. కానీ కుటుంబం ఒత్తిడి నేపథ్యంలో ఆ అమ్మాయి మరో యువకుడితో పెళ్లికి సిద్ధమైంది. త్వరలో ఆమె వివాహం. ఈ విషయం తెలిసిన ప్రేమికుడు...ప్రియురాలిపై ఆగ్రహతో  నేరుగా వచ్చి కాల్పులు జరిపి ఆమెను హత్య చేశాడు. అనంతరం తనను తాను కాల్చుకుని చనిపోయాడు.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం సత్యకేశ్ పాశ్వాన్ అనే 26 ఏళ్ల యువకుడు గత కొంత కాలంగా ఓ టెంపో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతడు.. వందన అనే 22 ఏళ్ల యువతి గత కొంత కాలంగా ప్రేమించుకున్నారు. అయితే, ఇటీవలే ఆ అమ్మాయికి ఇంట్లో వారు సంబంధం చూసి పెళ్లికి సిద్ధం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పాశ్వాన్ తన ప్రేయసి అని కూడా చూడకుండా కర్కశుడై ఆమెను దారుణంగా కాల్చిచంపి అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement