శనీశ్వరాభిషేకం టిక్కెట్‌కు రెక్కలు | saneeswaraabhishekam ticket rate hike | Sakshi
Sakshi News home page

శనీశ్వరాభిషేకం టిక్కెట్‌కు రెక్కలు

Published Tue, Dec 19 2017 8:23 AM | Last Updated on Mon, Aug 13 2018 3:11 PM

saneeswaraabhishekam ticket rate hike

సాక్షి, శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రతిరోజూ నిర్వహించే శనీశ్వరాభిషేకం పూజలను  రూ.150 నుంచి రూ.300కు పెంచారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పూజలు నిర్వహిస్తారు. శనివారం ఈ పూజను ఎక్కువ మంది భక్తులు చేయించుకుంటారు. ఇటీవల రూ.300 టిక్కెట్‌ ద్వారా నిర్వహించే రాహుకేతు సర్పదోష నివారణ పూజలు రూ.500కు పెంపుదల చేశారు. ఇక ఆరు నెలల క్రితం రూ.600 టిక్కెట్‌ ద్వారా నిర్వహించే రుద్రాభిషేకం టిక్కెట్‌ను రూ.1000కి పెంచిన విషయం తెలిసిందే. అదే క్రమంలో సోమవారం శనీశ్వరస్వామి అభిషేకం టిక్కెట్లు రెట్టింపు చేశారు. ఇదే తరహాలో మరికొన్ని పూజా టిక్కెట్లు పెంపుదల చేస్తారని చర్చ సాగుతుంది. ఇలా పూజా టిక్కెట్లు పెంపుదల చేయడంతో సామాన్య భక్తులు పూజలు చేయించుకోవడం భారంగా మారుతుందని పలువురు విమర్శలు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement