అమెరికాలోని తెలుగు ప్రవాస భారతీయులు పార్టీలకతీతంగా ముక్త కంఠంతో వాషింగ్టన్ డి సి లింకన్ మెమోరియల్ వద్ద ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేశారు.
► అమెరికాలోని వాషింగ్టన్ డి సి లింకన్ మెమోరియల్ వద్ద నిశ్శబ్ద ధర్నా!
►ఏపీ ప్రత్యేక హోదా వైఎస్ జగన్ దీక్షకు... పార్టీలకతీతంగా సంఘీభావము తెలిపిన అమెరికాలోని తెలుగు ప్రవాస భారతీయులు
వాషింగ్టన్ డి సి: అమెరికాలోని తెలుగు ప్రవాస భారతీయులు పార్టీలకతీతంగా ముక్త కంఠంతో వాషింగ్టన్ డి సి లింకన్ మెమోరియల్ వద్ద ఆదివారం ఏపీ ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు నల్లపాడు దీక్షాస్థలిలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వారు తమ పూర్తి సంఘీభావం తెలిపారు.
సురేంద్ర రెడ్డి బతినపట్ల, వైఎస్సార్సీపీ సెంట్రల్ రీజినల్ కోఆర్డినేటర్ మరియు రమేష్ రెడ్డి వల్లూరు, వైఎస్సార్సీపీ అద్విసేర్ & మిడ్ అట్లాంటిక్ రీజినల్ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో, వాషింగ్టన్ డి సి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటి సభ్యుల చేయూతతో ఈ ధర్నాను విజయవంతం చేశారు.