మనోళ్లు.. మనింటికే... | NRIs will be back to india soon.. because of economy surges | Sakshi
Sakshi News home page

మనోళ్లు.. మనింటికే...

Published Fri, Mar 27 2015 11:38 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 PM

మనోళ్లు.. మనింటికే...

మనోళ్లు.. మనింటికే...

ముంబై: భారీ మొత్తంలో ఆదాయాలను, జీత భత్యాలను ఆశించి విదేశాలకు ఎగిరిపోయిన భారతీయులంతా మెల్లమెల్లగా తిరుగుముఖం పడుతున్నారని భారత్లోని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆర్థిక మాంద్య కోరల్లో చిక్కి పలు పాశ్చాత్య దేశాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్న విషయం తెలిసిందే. పైకి కనిపించకున్నా.. అందులోనుంచి బయటపడేందుకు ఆ దేశాలు నానా అవస్థలు పడుతున్నాయి. కానీ, భారత్లో మాత్రం ఆ ప్రభావం కనిపించకుండా అభివృద్ధిలో ప్రతి ఏడాది అన్ని రంగాల్లో దూసుకెళుతుంది.

ప్రతి పనికి ఒక ప్రణాళిక బద్ధంగా నాణ్యతతో కూడిన విలువలు పాటిస్తోంది. దీంతో ప్రపంచ దేశాల దృష్టి కూడా భారత్పై పడింది. ఈనేపథ్యంలోనే ప్రపంచ దేశాలే తమ దేశంవైపు చూస్తుంటే తాముమాత్రం ఎందుకు ఇలా ఉండిపోవాలనే ఆలోచన విదేశాల్లో స్థిరపడిన భారతీయుల్లో బలంగా మొదలైందని నిపుణులు చెప్తున్నారు. అదీకాకుండా, ఆర్థికమాంధ్యం కారణంగా ప్రస్తుతం తమకు అరకొర జీతభత్యాలే తమకంపెనీలు చెల్లించడంతోపాటు బతుకు భరోసా కరువైందని, రాబడులు తక్కువై వ్యయాలు పెరిగిపోయాయని భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా, కుటుంబ వ్యవస్థ బలంగా రూపొందించుకోవాలని, పరిమిత వనరులతో చక్కటి విద్యను తమ పిల్లలకు అందించాలంటే మాతృదేశం(ఇండియా) సరైనదని వారు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా, ఇటీవల కాలంలో భారత వృద్ధి రేటు పెరుగుతుండటం, ఎన్నారైలకు కూడా మంచి ఉద్యోగావకాశాలు అందించే డైనమిక్ కంట్రీగా దూసుకెళుతుండటంతో విదేశాలకు ఎగిరిపోయిన భారత పావురాలు తిరిగి సొంతగూటికి వచ్చేద్దామన్న ఆలోచనతో ఉన్నట్లు ఆర్థికరంగ నిపుణులు పేర్కొంటున్నారు. తేకాకుండా భారత్లోనే కాకుండా త్వరలో ప్రపంచ వ్యాప్తంగా భారీ స్ధాయిలో విస్తారించాలనుకుంటున్న బ్యాంకింగ్, ఫైనాన్స్, ఫార్మా, ఆటో, ఫుడ్ ప్రాసెసింగ్వంటి భారత కంపెనీల్లో నిపుణులైన ఎన్నారైలాంటివారే ఎక్కువగా అవసరం అవుతారని రాండ్ స్టాడ్ ఇండియా అనే ఓ నియామక సంస్థ చెప్పడం కూడా ఎన్నారైల రాక ఆవశ్యం అని విషయాన్ని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement