ఎన్‌ఆర్‌ఐ అయితే ఆ అకౌంట్లు క్లోజ్‌ | PPF Account To Be Closed If Account Holder Becomes NRI | Sakshi
Sakshi News home page

ఎన్‌ఆర్‌ఐ అయితే ఆ అకౌంట్లు క్లోజ్‌

Published Mon, Oct 30 2017 11:48 AM | Last Updated on Mon, Oct 30 2017 11:48 AM

PPF Account To Be Closed If Account Holder Becomes NRI

సాక్షి, న్యూఢిల్లీ : నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్లు, పబ్లిప్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ వంటి చిన్న పొదుపు పథకాల నిబంధనలను ప్రభుత్వం సవరించింది. ఒకవేళ ఓ వ్యక్తి స్టేటస్‌ ఎన్‌ఆర్‌గా మారితే చిన్న పొదుపు పథకాల అకౌంట్లు మూసి వేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈ నెల మొదట్లో జారీచేసిన అధికారిక గెజిట్‌లో ప్రభుత్వం ఈ నిబంధనలను నోటిఫై చేసింది. పీపీఎఫ్‌ స్కీమ్‌ 1968 సవరణ ప్రకారం ఒకవేళ ఈ స్కీమ్‌ కింద అకౌంట్‌ ప్రారంభించిన రెసిడెంట్‌, మెచ్యురిటీ పిరియడ్‌ సమయంలో నాన్‌-రెసిడెంట్‌ అయితే, వారు ఎన్‌ఆర్‌ఐ అయినప్పటి నుంచి అకౌంట్‌ క్లోజ్‌ చేసేస్తారు. అకౌంట్‌ మూసివేసే వరకు వడ్డీని మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది.

నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్లకు కూడా ఈ మేరకు ఓ ప్రత్యేక నోటిఫికేషన్‌ను జారీచేయనున్నారు. నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్లకు, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌, నెలవారీ ఆదాయ పథకాలు, పోస్టు ఆఫీసు ఆఫర్‌ చేసే ఇతర టైమ్‌ డిపాజిట్లకు ఎన్‌ఆర్‌ఐలను అనుమతించకుండా ప్రభుత్వం ఈ నిబంధనలను సవరించింది. ప్రస్తుతం పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ వడ్డీరేటు 7.8 శాతంగా ప్రభుత్వం నిర్ధారించింది. ఇతర చిన్న పొదుపు పథకాల రేట్ల మాదిరిగానే ఈ రేట్లు ఉన్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement