PPF account
-
పీపీఎఫ్ ఖాతాలు క్లోజ్ చేయాల్సిందేనా..?
చిన్నపిల్లల చదువు, వివాహాలు ఇతర భవిష్యత్తు అవసరాల కోసం డబ్బు కూడబెట్టాలనుకునే వారికి ప్రభుత్వం నిరాశ మిగిల్చింది. ప్రభుత్వ అధీనంలో ఉండి స్థిరంగా వడ్డీ సమకూర్చే పీపీఎఫ్ ఖాతాలకు సంబంధించి కొత్తగా మార్గదర్శకాలు విడుదల చేసింది. అధిక వడ్డీ వస్తుందని ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు నిర్వహించే వారికిసైతం నష్టం కలిగేలా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంది. కొత్త మార్గదర్శకాలు అక్టోబర్ 1, 2024 నుంచి అమలులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.పీపీఎఫ్‌లో ఎక్కువ వడ్డీ వస్తుందని ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు తెరిచిన వారికి ఈ నిబంధనల వల్ల నష్టం కలుగుతుంది. మైనర్ల కోసం తెరిచే పీపీఎఫ్ ఖాతాదారులపై ఈ ప్రభావం పడుతుంది. కొంతమంది ప్రవాస భారతీయులు(ఎన్ఆర్ఐలు) దేశం విడిచి వెళ్లిపోయి, రెన్యూవల్ చేయకపోయినా తమ ఖాతా యాక్టివ్‌లోనే ఉంటుంది. అలాంటి వారి ఖాతాలను ఉపసంహరించుకునేలా విధానాల్లో మార్పులు చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు ఈ కింది విధంగా ఉన్నాయి.మైనర్ పేరు మీద పీపీఎఫ్ ఖాతా తెరిస్తే గతంలో దాదాపు 7.1 శాతం వడ్డీ చెల్లించేవారు. అయితే ఇకపై పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాకు అనుగుణంగా వడ్డీ చెల్లిస్తారు. అంటే మైనర్‌కు 18 ఏళ్లు వచ్చేవరకు 4 శాతం వడ్డీ ఇస్తారు. తర్వాత పీపీఎఫ్ నిబంధనల ప్రకారం వడ్డీ పెంచుతారు.పిల్లల చదువులు, వివాహాల కోసం చాలా మంది తల్లిదండ్రులు వారి పేరుమీద పీపీఎఫ్ ఖాతా తెరుస్తున్నారు. అందులో స్థిరంగా వడ్డీ వస్తుందనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు. అయితే ఇకపై ఈ అవకాశం లేకుండా పోయింది.ఇప్పటికే ఒక పీపీఎఫ్ ఖాతా నిర్వహిస్తున్నవారు సైతం రెండు కంటే ఎక్కువ ఖాతాలను ఓపెన్ చేస్తున్నారు. పీపీఎఫ్ డిపాజిట్ల వార్షిక పరిమితి రూ.1.5 లక్షలు ఉండడం దీనికి ప్రధాన కారణం. దాంతో ఎక్కువ ఖాతాలు తెరిచి అధిక వడ్డీ సమకూరేలా ప్రణాళికలు వేసుకుంటున్నారు. అయితే ఇకపై ఈ వ్యవహారం కొనసాగదు.ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు నిర్వహిస్తున్న ఖాతాదారులు ప్రాథమిక ఖాతా వివరాలు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. మిగతా ఖాతాల్లోని నగదును రూ.1.5 లక్షల పరిమితికి సర్దుబాటు చేస్తారు. అనంతరం ఇతర ఖాతాల్లో మిగిలిన నగదుపై ఎలాంటి వడ్డీ చెల్లించరు.ఇదీ చదవండి: రూ.932కే విమాన టికెట్ప్రస్తుత పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1 శాతం(పన్ను ఉండదు)గా ఉంది. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మార్గదర్శకాల వల్ల ఒకటి కంటే ఎక్కువ పీపీఎఫ్ ఖాతాలున్నవారు ఈక్విటీ మార్కెట్లను ఎంచుకునే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కనీసం పదేళ్లు స్థిరంగా పెట్టుబడి పెట్టేవారు మ్యూచువల్ ఫండ్లు ఎంచుకుంటే పీపీఎఫ్ కంటే అధిక వడ్డీ సమకూరే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. వచ్చే రాబడులపై ట్యాక్స్ మిగుల్చుకోవాలంటే ‘ట్యాక్స్ సేవింగ్స్ మ్యూచువల్ ఫండ్స్’లో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. పదిహేనేళ్ల కాలపరిమితితో గరిష్ఠంగా ఏటా రూ.1.5 లక్షల వరకు పొదుపు చేసుకునేలా ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఏదైనా అత్యవసర సమయాల్లో డబ్బు అవసరమైతే ఖాతా తెరిచిన ఐదేళ్ల తర్వాత ఒకసారి నగదు ఉపసంహరణకు అవకాశం ఉంది. -
కేవలం 1 శాతం వడ్డీకే రుణం.. వారికి మాత్రమే
దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మరి వల్ల ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే చాలా మంది ఆర్దికంగా పడుతున్న భాదల నుంచి బయటపడటానికి ఇతరులు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. అయితే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే పథకంలో చేరిన వారికి కొంచెం ఊరట అని చెప్పుకోవాలి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకంలో చేరిన వారికి అతి తక్కువ వడ్డీకే లోన్ పొందే ఆప్షన్ అందుబాటులో ఉంది. ఇది కేవలం పీపీఎఫ్ పథకంలో చేరిన వారికి మాత్రమే వర్తిస్తుంది. బెస్ట్ రిటైర్మెంట్ స్కీమ్స్‌లో పీపీఎఫ్ ఒకటని చెప్పుకోవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. ఈ పథకంలో చేరిన వారికి సులభంగానే లోన్ తీసుకునే సదుపాయం ఉంది. మీరు ఖాతా తెరిచిన తర్వాత 3వ ఏడాది నుంచి 6వ ఏడాది వరకు మధ్యలో ఎప్పుడైనా లోన్ తీసుకోవచ్చు. ఏడవ సంవత్సరం నుంచి పాక్షికంగా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. మీరు పెట్టుబడి పెట్టిన డబ్బుల్లో గరిష్టంగా 50 శాతం వరకు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. అయితే మీరు లోన్ తీసుకోవాలని భావిస్తే.. పీపీఎఫ్ అకౌంట్లో జమ చేసిన నగదులో 25 శాతం వరకు డబ్బులు పొందొచ్చు. ఇంతకు మించి తీసుకోవడానికి వీలు లేదు. అయితే ఈ రుణం మీద మీకు 1 శాతం వడ్డీకే లోన్ లభిస్తుంది. లోన్ తీసుకున్న తర్వాత నుంచి పూర్తిగా చెల్లించే వరకు మీరు జమ చేసిన నగదుపై ఎలాంటి వడ్డీ రాదు. అంటే మీకు లోన్‌పై వడ్డీ రేటు 8.1 శాతంగా ఉందని చెప్పుకోవచ్చు. బ్యాంకులు అందించే వ్యక్తిగత రుణాలతో పోలిస్తే పీపీఎఫ్ ఖాతాపై రుణం తీసుకుంటే తక్కువ వడ్డీ పడుతుందని చెప్పుకోవచ్చు. అయితే పీపీఎఫ్‌పై లోన్ తీసుకుంటే దీర్ఘకాలంలో కాంపౌండింగ్ బెనిఫిట్ పొందలేం. అందువల్ల మీరు పీపీఎఫ్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. చదవండి: ప్రతి నెల పది వేల పెన్షన్ పొందాలంటే.. -
ఎన్ఆర్ఐ అయితే ఆ అకౌంట్లు క్లోజ్
సాక్షి, న్యూఢిల్లీ : నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్లు, పబ్లిప్ ప్రావిడెంట్ ఫండ్ వంటి చిన్న పొదుపు పథకాల నిబంధనలను ప్రభుత్వం సవరించింది. ఒకవేళ ఓ వ్యక్తి స్టేటస్ ఎన్ఆర్గా మారితే చిన్న పొదుపు పథకాల అకౌంట్లు మూసి వేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈ నెల మొదట్లో జారీచేసిన అధికారిక గెజిట్‌లో ప్రభుత్వం ఈ నిబంధనలను నోటిఫై చేసింది. పీపీఎఫ్ స్కీమ్ 1968 సవరణ ప్రకారం ఒకవేళ ఈ స్కీమ్ కింద అకౌంట్ ప్రారంభించిన రెసిడెంట్, మెచ్యురిటీ పిరియడ్ సమయంలో నాన్-రెసిడెంట్ అయితే, వారు ఎన్ఆర్ఐ అయినప్పటి నుంచి అకౌంట్ క్లోజ్ చేసేస్తారు. అకౌంట్ మూసివేసే వరకు వడ్డీని మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్లకు కూడా ఈ మేరకు ఓ ప్రత్యేక నోటిఫికేషన్‌ను జారీచేయనున్నారు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్లకు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నెలవారీ ఆదాయ పథకాలు, పోస్టు ఆఫీసు ఆఫర్ చేసే ఇతర టైమ్ డిపాజిట్లకు ఎన్ఆర్ఐలను అనుమతించకుండా ప్రభుత్వం ఈ నిబంధనలను సవరించింది. ప్రస్తుతం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీరేటు 7.8 శాతంగా ప్రభుత్వం నిర్ధారించింది. ఇతర చిన్న పొదుపు పథకాల రేట్ల మాదిరిగానే ఈ రేట్లు ఉన్నాయి. -
టర్మ్ ఇన్సూరెన్స్ ఎక్కడ తీసుకుంటే బెటర్..?
నా ప్రజా భవిష్యనిధి ఖాతా(పీపీఎఫ్-పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్)ను రెండు సార్లు పొడిగించాను. ఇప్పుడు ఈ పీపీఎఫ్ ఖాతా నుంచి సొమ్ములు విత్‌డ్రా చేసుకుంటే నేను ఏమైనా పన్నులు చెల్లించాలా ? - సీతారామ్, వైజాగ్ పొడిగించిన తర్వాత కూడా పీపీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకుంటే ఎలాంటి పన్నులు చెల్లించక్కర లేదు. పన్నుల పరంగా చూస్తే పీపీఎఫ్ ఖాతాను ‘మూడు మినహాయింపులు’(ఎగ్జెంప్ట్-ఎగ్జెంప్ట్-ఎగ్జెంప్ట్-ఈఈఈ)గా పరిగణిస్తారు. అంటే పీపీఎఫ్ ఖాతాకు మూడు దశల్లో మినహాయింపు లభిస్తుందని అర్థం. పెట్టుబడులు పెట్టేటప్పుడు. వడ్డీ విలువలపై, పెట్టుబడులను ఉపసంహరించుకునేటప్పుడు.. ఇలా ఈ మూడు దశల్లో పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో పీపీఎఫ్ ఖాతాలో పెట్టుబడులకు రూ. లక్షన్నర వరకూ పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఈ పెట్టుబడుల వడ్డీపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పనిలేదు. ఇక పీపీఎఫ్ సొమ్ములను ఉపసంహరించుకున్నప్పుడు కూడా ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. ఈ ఖాతాను పొడిగించినా కూడా విత్‌డ్రాయల్ అప్పుడు ఎలాంటి పన్ను పోటు ఉండదు. డెట్ ఫండ్ అంటే ఏమిటి ? - ప్రసన్న, విజయవాడ బాండ్లు, ట్రెజరీ బిల్లులు వంటి ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్‌ను డెట్ ఫండ్స్‌గా వ్యవహరిస్తారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌తో పోల్చితే డెట్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు రిస్క్ తక్కువ. రాబడులు కూడా తక్కువగానే ఉంటాయి. పెట్టుబడి వ్యూహాలు, ఇన్వెస్ట్ చేసే బాండ్ల రకాలను బట్టి డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో రకాలు ఉన్నాయి. మీడియమ్, లాంగ్ టర్మ్ ఫండ్స్, షార్ట్ టర్మ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్, గిల్ట్ ఫండ్స్, ఫిక్స్డ్ మెచ్యురిటీ ఫ్లాన్లు.. ఇలా రకరకాల డెట్ ఫండ్లు ఉన్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నుంచి 3, 4 ఏళ్ల క్రితం కొన్ని బీమా పాలసీలు తీసుకున్నాను. అవి సంతృప్తికరమైన రాబడులివ్వడం లేదు. వీటిలో కొనసాగమంటారా? వైదొలగమంటారా? - కమలాకర్, గుంటూరు పెట్టుబడులు లక్ష్యంగా జీవిత బీమా పాలసీలు ఎప్పుడూ తీసుకోకూడదు. బీమాకు, మదుపునకు వేర్వేరుగా పెట్టుబడులు పెట్టాలి. రెండింటిని కలగలపకూడదు. మీకేదైనా జరిగితే ఆర్థిక భరోసా కల్పించడమే బీమా పాలసీల లక్ష్యంగా ఉండాలి. జీవిత బీమాపాలసీల విషయానికొస్తే, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడమే సరైనది. రాబడులనిచ్చే యులిప్‌లు, మనీ-బ్యాక్, ఎండోమెంట్ వంటి బీమాపాలసీలు ఇన్వెస్ట్మెంట్ పరంగా, బీమాపరంగా మంచి ప్రయోజనాలనిస్తాయని ఏజెంట్లు ఊరిస్తారు. కానీ అవి మీకు తగిన జీవిత బీమాను, అలాగే తగినంత రాబడులను ఇవ్వలేవు. పైగా అధిక ప్రీమియమ్‌లు చెల్లించాల్సి ఉంటుంది. అందుకని ఇలాంటి హైబ్రిడ్ ఇన్సూరెన్స్-కమ్-ఇన్వెస్ట్మెంట్ పాలసీల నుంచి వైదొలగడం మంచిది. తగినంత బీమా ఉన్న టర్మ్ ప్లాన్‌ను తీసుకోండి. మీ మదుపు అవసరాల కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఎలా తీసుకోవాలి? పాలసీబజార్, కోవర్ఫాక్స్ వంటి అగ్రిగేటర్ల ద్వారా తీసుకోవాలా లేక కంపెనీ వెబ్సైట్ నుంచి నేరుగా తీసుకోవాలా? - నందిని, హైదరాబాద్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడానికి పలు మార్గాలు ఉన్నాయి. బీమా సంస్థ వెబ్సైట్ నుంచే నేరుగా పాలసీ తీసుకోవచ్చు. లేదా ఆ బీమా సంస్థ ఏజెంట్ ద్వారా కూడా పాలసీ తీసుకోవచ్చు. లేదంటే పాలసీబజార్డాట్కామ్, కోవర్ ఫాక్స్ వంటి అగ్రిగేటర్ల ద్వారా కూడా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా ఈ పాలసీలు తీసుకోవడం ఇప్పుడు అత్యంత సులభం, పైగా రెండు కీలకమైన ప్రయోజనాలు కూడా లభిస్తాయి. మొదటిది వివిధ కంపెనీలు ఆఫర్ చేసే వివిధ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలను పోల్చి చూసే వెసులుబాటు ఉంటుంది. ఇలా పోల్చి చూసి, ఏది మంచి ప్లాన్ అది ఎంచుకోవచ్చు. ఆన్లైన్ పాలసీలు చౌకగా లభిస్తాయి. ఈ ఆన్లైన్ పాలసీలు పూర్తిగా పారదర్శకంగా ఉంటాయి. అగ్రిగేటర్ వెబ్సైట్లో పాలసీలను పోల్చిచూసుకుని, మీ అవసరాలకు సరిపడే పాలసీని ఎంచుకోండి. తర్వాత ఆ బీమా కంపెనీ వెబ్సైట్లోకి వెళ్లి ఆ పాలసీని తీసుకోండి. చెల్లించాల్సిన ప్రీమియమ్, క్లెయిమ్స్ రేషియో వంటి అంశాల ఆధారంగా పాలసీని ఎంచుకోవాలి. పాలసీ తీసుకునేముందు పాలసీ ఫీచర్లను, షరతులను,తప్పనిసరిగా చదవాలి. పన్ను ఆదా కోసం యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టాను. గత కొన్నేళ్లుగా ఈ ఫండ్ మంచి రాబడులను ఇచ్చింది. పన్ను ఆదా కోసం కాకుండా మంచి రాబడుల కోసం 3-5 ఏళ్ల కాలానికి ఈ ఫండ్‌లో మరింతగా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను. నా నిర్ణయం సరైనదేనా? - క్రాంతి, కరీంనగర్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)లు పన్ను ప్రయోజనాలనే కాకుండా దీర్ఘకాలంలో మంచి రాబడులను కూడా ఇస్తాయి. డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ మాదిరిగా వీటి పనితీరు ఉంటుంది. ఈఎల్ఎస్ఎస్లకు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఫలితంగా వీటిల్లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయగలిగే క్రమశిక్షణ ఇన్వెస్టర్లకు అలవడుతుంది. ఈ ఫండ్‌లోనే మరింతగా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ కోసం మరో ఈఎల్ఎస్ఎస్ ఫండ్‌ను పరిశీలించండి. మీ పోర్ట్‌ఫోలియోలో ఒకటికి మించి ఫండ్స్ ఉండడం ఎప్పుడూ మంచిదే. - ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
పొడిగించిన పీపీఎఫ్ ఖాతా నుంచి విత్‌డ్రాయల్స్ ఎలా?
నేను 2000 సంవత్సరంలో ప్రజా భవిష్య నిధి(పీపీఎఫ్) ఖాతా ప్రారంభించాను. అప్పటి నుంచి ప్రతి నెలా కొంత మొత్తాన్ని జమ చేస్తూ వచ్చాను. ఇటీవలే మెచ్యూరిటీ కావడంతో ఈ ఖాతాను మరో ఐదేళ్ల పాటు పొడిగించాను. ఇప్పుడు నాకు డబ్బులు అవసరమయ్యాయి. పొడిగించిన పీపీఎఫ్ ఖాతా నుంచి విత్‌డ్రాయల్స్‌కు సంబంధించిన నిబంధనలు ఏవిధంగా ఉన్నాయి? తెలియజేయండి. - హరినాధ్, వరంగల్ ప్రజా భవిష్య నిధి(పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్-పీపీఎఫ్) ఖాతా మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు. ఈ మెచ్యూరిటీ కాలం పూర్తయిన తర్వాత ఐదేళ్లపాటు పొడిగించుకునే అవకాశం ఉంది. ఈ ఐదేళ్ల కాలంలో ఈ ఖాతాలో డబ్బులు ఇన్వెస్ట్ చేయకపోయినా ఈ ఖాతాను కొనసాగించవచ్చు. పొడిగించిన తర్వాత కూడా మీరు ఈ ఖాతాలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే ఖాతా బ్యాలెన్స్‌లో 60 శాతం మొత్తాన్ని మీరు విత్‌డ్రా చేసుకోవచ్చు. పీపీఎఫ్ ఖాతాను పొడిగించిన మొదటి ఏడాది నుంచి ఈ సొమ్ములను ఒకటి లేదా ఒకటికి మించిన ఇన్స్టాల్మెంట్స్లో విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఏడాదికి ఒక్క ఇన్‌స్టాల్‌మెంట్‌ను మాత్రమే అనుమతిస్తారు. ఇక ఇన్వెస్ట్చేయకుండానే ఈ ఖాతాను పొడిగించిన పక్షంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా మీ ఖాతాలో ఉన్న మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఈ సందర్భంలో కూడా ఏడాదికి ఒక్క విత్డ్రాయల్నే అనుమతిస్తారు. మీ ఖాతా నుంచి పూర్తిగా మీ సొమ్ములను ఉపసంహరించుకునేదాకా మిగిలిన బ్యాలెన్స్‌పై మీకు వడ్డీ వస్తుంది. నేను మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వారి ఫరెవర్ యంగ్ పెన్షన్ పాలసీ తీసుకున్నాను. ఈ పాలసీ తీసుకొని రెండున్నరేళ్లయింది. ఇప్పటిదాకా రూ.1,25,000 ఈ పాలసీలో ఇన్వెస్ట్ చేశాను. కానీ ఈ పాలసీ పనితీరు సరిగ్గా లేదు. దీనిని సరెండర్ చేయమంటారా? కొనసాగించమంటారా? - శోభన్, హైదరాబాద్ మ్యాక్స్ లైఫ్ ఫరెవర్ యంగ్ పెన్షన్ ప్లాన్ అనేది బీమా కవర్‌తో కూడిన రిటైర్మెంట్ ప్లాన్. మీరు తీసుకున్నది సరైన ఇన్వెస్ట్మెంట్ పథకం కానప్పుడు. మీకు నష్టాలు వచ్చినా సరే, ఆ పథకం నుంచి వైదొలగడం సరైన నిర్ణయమే. బీమా కవర్‌తో కూడిన ఎలాంటి రిటైర్మెంట్ ప్లాన్ అయినా అది సరైన పథకం కాదు. అలాంటి పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయమూ కాదు. ఇలాంటి పాలసీల్లో వ్యయాలు అధికంగా ఉంటాయి. పారదర్శకత ఉండదు. ఈ తరహా పాలసీలు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనే రాబడులను ఇవ్వలేవు. ఈ పాలసీతో పోల్చుకుంటే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ గ్యారంటీడ్ మొత్తాలను ఇస్తుందని చెప్పవచ్చు. ఇక ఈ పాలసీ సరెండర్‌కు సంబంధించిన విషయాలను చూస్తే, ఫండ్ విలువలో మూడో వంతును ఏకమొత్తంగా మీరు విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన మొత్తంతో యాన్యుటీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. లేదా మొత్తం ఫండ్ విలువతో యాన్యుటీని కొనుగోలు చేయవచ్చు. ఈ ప్లాన్‌కు లాక్-ఇన్ పీరియడ్ 5 సంవత్సరాలుగా ఉంది. మీరు ఐదేళ్లకు ముందే ఈ పాలసీని సరెండర్ చేసినప్పటికీ, మీరు పాలసీ తీసుకున్న ఐదేళ్ల వరకూ ఈ పాలసీ లాక్ అయి ఉంటుంది. మీ రిటైర్మెంట్ జీవితంలో కావలసిన ఆదాయం కోసం దీర్ఘకాల పెట్టుబడి వ్యూహం అవసరం. మీకు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం కొత్త అయితే, మీరు భరించగలిగే రిస్క్‌ను బట్టి బ్యాలెన్స్డ్ ఫండ్‌ను ఎంచుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. ట్రాక్ రికార్డ్‌ను బట్టి మంచి రేటింగ్ ఉన్న బ్యాలెన్స్డ్ ఫండ్‌ను ఎంచుకొని, ప్రతి నెలా కొంత మొత్తం సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)లో ఇన్వెస్ట్ చేయండి. మీకు ఇప్పటికే స్టాక్ మార్కెట్‌తో పరిచయం ఉండి ఉన్నట్లయితే ఏదైనా డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకొని సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయండి. బ్యాలెన్స్డ్ ఫండ్ అయినా, ఈక్విటీ ఫండ్ అయినా సరే, సిప్ విధానాన్ని ఎంచుకోండి. ఇలా చేస్తే, మీ కొనుగోళ్లు యావరేజ్ అయి. మీకు మంచి రాబడులు వస్తాయి. మీరు మరో మూడేళ్లలో రిటైరవుతారనగా, ఈ ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని ఉపసంహరించుకొని పెన్షన్ కోసం క్రమం తప్పకుండా ఆదాయాన్నిచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేయండి. నా వయస్సు 56 సంవత్సరాలు. మరో నాలుగేళ్లలో రిటైరవుతున్నాను. 20 శాతం ఆదాయపు పన్ను ట్యాక్స్ స్లాబ్‌లో ఉన్నాను. ఏడాదికి రూ.50,000 చొప్పున మూడేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయగలను. మరో ఆరేళ్ల పాటు నాకు ఈ డబ్బులు అవసరం లేదు. నాకు పన్ను ప్రయోజనాలతో పాటు మంచి రాబడులు కూడా కావాలి. ఏ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలో సూచించండి? - గంగాధర్, విజయవాడ మీరు ఆరేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. పన్ను ప్రయోజనాలు కూడా కావాలనుకుంటున్నారు. కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్స్ కోసం మంచి రేటింగ్ ఉన్న ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్) ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. పన్ను ప్రయోజనాలతో పాటు మంచి రాబడులు కూడా వస్తాయి. ఈ ఫండ్స్ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. దీర్ఘకాలం పాటు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందే అవకాశాలు అధికంగా ఉంటాయి. పన్ను ఆదా చేసే ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో తక్కువ లాక్-ఇన్ పీరియడ్ (3 సంవత్సరాలు) ఇన్వెస్ట్మెంట్ సాధనం ఇదే. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
మధ్యలో పీపీఎఫ్ ఖాతా ఆపేయవచ్చా..?
నేనొక సంస్థ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఏడాది గడవక ముందే వేరే సంస్థ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లోకి మారిస్తే ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా? ఎలాంటి పన్నుపోటు లేకుండా ఉండాలంటే ఎంత కాలం తర్వాత ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేయాలి? - రామాచారి, విశాఖపట్టణం పన్ను అంశాల పరంగా చూస్తే, ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి మరో మ్యూచువల్ ఫండ్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేయడం అంటే...ఒక మ్యూచువల్ ఫండ్ యూనిట్లను విక్రయించి, కొత్తగా మరో మ్యూచువల్ ఫండ్ స్కీమ్ యూనిట్లను కొనుగోలు చేయడంగా పరిగణిస్తారు. ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి, దాని నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఏడాదిలోపు మరో మ్యూచువల్ ఫండ్‌లోకి బదిలీ చేస్తే మీరు 15 శాతం చొప్పున స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది దాటిన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చే రాబడులను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా వ్యవహరిస్తారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై ఎలాంటి దీర్ఘకాల మూలధన లాభాల పన్ను ఉండదు. పన్ను పోటు లేకుండా ఉండాలంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఏడాది తర్వాత బదిలీ చేయాలి. ఇక లిక్విడ్ ఫండ్స్ విషయానికొస్తే, లిక్విడ్ ఫండ్ నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మూడేళ్లలోపు వేరే ఫండ్‌లోకి మళ్లిస్తే, మీరు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ బదిలీపై వచ్చిన లాభాలను మీ ఆదాయానికి కలిపి మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి మరో మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్మెంట్స్ బదిలీ విషయంలో ఎగ్జిట్ లోడ్ విషయాన్ని కూడా మీరు పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. జీవన్ సరళ్ పాలసీ సరెండర్ చేద్దామనుకుంటున్నాను. ఈ పాలసీ సరెండర్‌పై నేనేమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా? - రమణ, నెల్లూరు మీరు పాలసీ తీసుకొని ఎన్ని సంవత్సరాలయింది, మీరు తీసుకున్న బీమా కవర్, మీరు చెల్లించిన ప్రీమియమ్ తదితర అంశాలను బట్టి పన్నుల విధింపు ఉంటుంది. కొన్ని సందర్భాల్లోనే జీవన్ సరళ్ బీమా పాలసీ సరెండర్‌పై పన్ను మినహాయింపులు పొందవచ్చు. 2012 మార్చి 31కి ముందు తీసుకున్న పాలసీలైతే, మీరు తీసుకున్న బీమా మొత్తం ,మీరు చెల్లించే వార్షిక ప్రీమియమ్‌నకు ఐదు రెట్ల కంటే అధికంగా ఉన్నప్పుడు. మీరు 2012 ఏప్రిల్ తర్వాత పాలసీలు తీసుకుంటే, మీరు తీసుకున్న బీమా మొత్తం మీరు చెల్లించే వార్షిక ప్రీమియమ్‌నకు పదిరెట్లు కంటే అధికంగా ఉన్నప్పుడు. ఈ రెండు సందర్భాల్లో మాత్రం మీకు పన్ను మినహాయింపులు లభిస్తాయి, ఇలా కాని పక్షంలో ఎల్ఐసీ జీవన్ సరళ్ లాంటి ఎండోమెంట్ పాలసీలను సరెండర్ చేసినప్పుడు వచ్చిన సరెండర్ విలువను మీ ఆదాయానికి కలిపి, మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. నా కొడుకు ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. అతని నెల జీతం రూ.11,000. తన వైద్య బీమా ప్రీమియాన్ని నేనే చెల్లిస్తున్నాను. ఈ చెల్లించే ప్రీమియమ్‌పై పన్ను మినహాయింపు పొందవచ్చా? - క్రాంతి, గుంటూరు 18 సంవత్సరాలు దాటిన పిల్లలు, ఉద్యోగస్తులైతే, వారికి చెల్లించే ప్రీమియమ్లకు మీరు పన్ను మినహాయింపు పొందలేరు. మీకు, మీ జీవిత భాగస్వామికి, మీపై ఆధారపడిన పిల్లలకు చెల్లించే వైద్య బీమా ప్రీమియమ్లకు మాత్రమే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80డి ప్రకారం రూ.25 వేల వరకూ పన్ను మినహాయింపులు పొందవచ్చు. నేను 2012, జూలై నుంచి పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్(పీపీఎఫ్)లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఖాతాలో ఇప్పటిదాకా జమ అయిన మొత్తం రూ. లక్షకు పైగా ఉంది. దీని కంటే పన్ను ఆదా చేసే స్కీమ్‌లు ఉండటంతో ఈ ఖాతాలో ఇన్వెస్ట్ చేయడం ఆపేద్దామనుకుంటున్నాను. ఈ ఖాతాను ఆపేయడం ఎలా? ఈ ఖాతాలో ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని నేను ఎప్పుడు తీసుకోవచ్చు? - జ్యోతి, కాకినాడ పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్(పీపీఎఫ్) ఖాతాను మధ్యలో ఆపేయడానికి లేదు. ఈ ఖాతాను ప్రారంభించి పదిహేను ఆర్థిక సంవత్సరాలు పూర్తయిన తర్వాతనే ఈ ఖాతా మెచ్యూర్ అవుతుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 ఈ ఖాతాలో ఇన్వెస్ట్ చేయాలి. ఇలా ఇన్వెస్ట్ చేయని పక్షంలో ప్రతీ ఏడాది రూ.50 చొప్పున ఈ ఖాతా మెచ్యుర్ అయ్యేంత వరకూ జరిమానా విధిస్తారు. పీపీఎఫ్ ఖాతా ప్రారంభించి ఆరేళ్లు దాటితే పాక్షికంగా కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. - ధీరేంద్ర కుమార్, సీఈవో,వ్యాల్యూ రీసెర్చ్