కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భారత స్థాతంత్ర్య ప్రముఖ ఉద్యమకారులను ఎన్నారైలు అని సంబోధించారు. అలాగే, స్వాతంత్ర్య ఉద్యమాన్ని కూడా ఎన్నారై ఉద్యమం అని అభివర్ణించారు. ఎన్నారై ఉద్యమంలో భాగంగానే తమ కాంగ్రెస్ పార్టీ పుట్టిందని చెప్పారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ విదేశాల్లోని కాంగ్రెస్ మద్దతుదారులతో భేటీ అవుతూ సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.