ఎన్నారైలకు తాకిన నోట్లరద్దు సెగ
న్యూఢిల్లీ: పాత పెద్ద నోట్లు మార్చుకునేందుకు ప్రవాస భారతీయులు, భారత సంతతి వ్యక్తులు భారీ సంఖ్యలో రిజర్వుబ్యాంకు కౌంటర్ల ముందు క్యూ కడుతున్నారు. ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, నాగపూర్‌లలోని రిజర్వ్‌బ్యాంక్ బ్రాంచ్‌లలో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద చాంతాడంత క్యూల్లో నిల్చోలేక అనేకమంది వెనుదిరుగుతున్నారు. మరికొందరిని సరైన డాక్యుమెంట్లు తేలేదనే కారణంతో సెక్యూరిటీ సిబ్బంది లోనికి అనుమతించడంలేదు.
తరచూ భారత్ సందర్శించే కొందరు ప్రవాసులు కమిషన్ చెల్లించే అవసరం లేకుండా రూ. లక్ష వరకు భారత కరెన్సీని తమవద్ద ఉంచుకుంటారని, దీన్ని నల్లధనం అని ప్రభుత్వం నిరూపిస్తే దాన్ని వదులుకుంటామని ధర్మవీర్ అనే ఎన్నారై సవాల్ చేశారు.