
రేపు ప్రవాసాంధ్రులతో జగన్ ముఖాముఖి
⇒ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొననున్న ప్రతిపక్ష నేత
⇒ ‘హోదా’ ఆవశ్యకతను వివరించనున్న వైఎస్సార్‌సీపీ అధినేత
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తక్షణ ఆవశ్యకతను నొక్కి చెప్పేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 25వ తేదీన ప్రవాసాంధ్రులతో ముఖాముఖీ చర్చా కార్యక్రమంలో పాల్గొననున్నారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉధృతంగా పోరాటం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా ఆవశ్యకతపై ప్రవాసాంధ్రులతో జగన్ నేరుగా మాట్లాడతారు.
ప్రపంచవ్యాప్తంగా ఐదుచోట్ల నుంచి ఎన్నారైలు.. వైఎస్ జగన్‌తో ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని ప్రవాసాంధ్రులు ఏర్పాటు చేశారు. సాక్షి టీవీలో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. అలాగే డిజిటల్ మాధ్యమంలో సాక్షి యూట్యూబ్ చానల్ Https://youtu.be/k4kM4PVNt8l లింక్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడవచ్చు. ఎన్నారైలు ఏర్పాటు చేసుకున్న https://www.youtube.com/channel/UC4oQR_IibE2AK_h78czulrQ లింకు ద్వారా కూడా దీన్ని వీక్షించవచ్చు.