70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ విదేశాల్లో సంబరాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
న్యూఢిల్లీ: ఈ ఏడాది 70వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా దేశ విదేశాల్లో భారీ ఎత్తున సంబరాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గోపికా కృష్ణుల నృత్యాలు, ప్రాంతీయ భాషలలో పాటలు, ప్రత్యేక రైలు ప్రదర్శనలు, ఎన్‌ఆర్‌ఐల చేత ఊరేగింపులు తదితరాలను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
మొత్తం ఏడు రోజులపాటు ఉత్సవాలు జరపనున్నారు. సంబరాలకు ప్రణాళికలు రచిస్తూ అన్ని శాఖల అధికారులు బిజీబిజీగా గడుపుతున్నారు.