రేపు ప్రవాసాంధ్రులతో జగన్ ముఖాముఖి | Ys jagan mohan reddy to video confernce on sept 25, 2016 | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 24 2016 8:49 AM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తక్షణ ఆవశ్యకతను నొక్కి చెప్పేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 25వ తేదీన ప్రవాసాంధ్రులతో ముఖాముఖీ చర్చా కార్యక్రమంలో పాల్గొననున్నారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉధృతంగా పోరాటం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా ఆవశ్యకతపై ప్రవాసాంధ్రులతో జగన్ నేరుగా మాట్లాడతారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement