
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో అమెరికాలో ఉన్న తెలుగువారంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. అమెరికా ప్రభుత్వ సూచనలను పాటిస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని, అధైర్యపడొద్దని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ప్రఖ్యాత ‘న్యూయార్క్ టైమ్ స్క్వేర్‌లో’ ప్రత్యేక స్క్రీన్ ఏర్పాట్ల ద్వారా సీఎం సందేశాన్ని వినిపించారు.
► ఏపీలో ఉన్న మీ కుటుంబసభ్యుల గురించి కలత చెందవద్దు. మా ప్రభుత్వం వారి ఆరోగ్య పరిరక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. కోవిడ్– 19 నివారణకు ప్రభుత్వ యంత్రాంగం అంతా నిరంతరం శ్రమిస్తోంది.
► ఎక్కడ ఏ చిన్న ఘటన వెలుగులోకి వచ్చినా ప్రభుత్వం వెంటనే స్పందించి ఉత్తమ వైద్యం అందిస్తోంది. తమ వారి కోసం ప్రవాసాంధ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
► ప్రవాసాంధ్రులకు భరోసా కల్పిస్తూ టైమ్ స్క్వేర్‌లో ముఖ్యమంత్రి జగన్ సందేశం ఇవ్వడంపై హర్షం వ్యక్తమవుతోందని నార్త్ అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్ పండుగాయల తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment