‘చెరుకులపాడు’కు ప్రవాసాంధ్రుల నివాళి
వెల్దుర్తి రూరల్ : గత ఆదివారం హత్యకు గురైన వైఎస్‌ఆర్‌సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డికి అమెరికాలోని డల్లాస్‌లో ఉంటున్న ప్రవాసాంధ్రులు శనివారం నివాళులర్పించారు. నివాళుర్పించిన వారిలో వైఎస్‌ఆర్ పార్టీ ప్రవాసాంధ్ర నాయకులు శ్రీనివాసరెడ్డి, అమిత్‌రెడ్డి, మధురెడ్డి, సురేంద్రరెడ్డి, శివశంకర్‌రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నారాయణరెడ్డి మృతి పార్టీకి తీరని లోటన్నారు.
వైఎస్‌ఆర్‌సీపీపై ప్రజలకు పెరుగుతున్న అభిమానాన్ని ఓర్వలేక టీడీపీ కుట్ర పూరిత రాజకీయాలు చేస్తోందన్నారు. నారాయణరెడ్డి ఎదుగుదలను చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు రాజకీయంగా అంతమొందించారన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రవాసాంధ్రుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.