ఆస్ట్రేలియాలో ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు | ys Jagan birthday celebrations in australia | Sakshi

ఆస్ట్రేలియాలో ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు

Dec 23 2017 5:59 PM | Updated on Jul 25 2018 4:58 PM

ys Jagan birthday celebrations in australia - Sakshi

ఆస్ట్రేలియా:  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జన్మదిన వేడుకలు ఆస్ట్రేలియాలో ఘనంగా నిర్వహించారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎన్ఆర్ఐ శాఖ విక్టోరియా స్టేట్ ప్రెసిడెంట్ సతీష్ పాటి, కన్వినర్ కౌశిక్ మామిడి ఆధ్వర్యంలో మెల్బోర్న్ లోని ప్లంప్టన్ ప్రాంతంలో జరిగిన వేడుకలలో పెద్ద ఎత్తున వైఎస్‌ఆర్‌సీపీ అభిమానులు పాల్గొని, పార్టీ జెండాలు చేతపట్టి భారీ కారు ర్యాలీ నిర్వహించారు. జై జగన్ నినాదాలతో హోరెత్తిస్తూ తమ అభిమానాన్ని చాటారు. ఎన్ఆర్ఐ, వైఎస్‌ఆర్‌సీపీ కన్వీనర్ కేవీ రమణారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించి మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనకై కృషి చేయాలనీ పిలుపునిచ్చారు. యువనేత జగన్ పోరాట పటిమను కొనియాడారు. 

ఈ సందర్భంగా సతీష్ పాటి మాట్లాడుతూ రైతుల కోసం, బడుగు బలహీన వర్గాల హితం కోసం నాడు వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన వివిధ పథకాలను, వాటి వలన జరిగిన లబ్దిని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు రైతులను మరిచి, అధికార గర్వంతో అభివృద్ధిని తుంగలో తొక్కి పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతున్న అధికార టీడీపీకి వచ్చే ఎలక్షన్లలో తగిన బుద్ది చెప్పి, ప్రజా సంక్షేమం మరచిన ఆ పార్టీని భూస్థాపితం చేయాలన్నారు. అందుకు తమ సభ్యులంతా నడుం బిగించి తమ వంతు పాత్రను పోషించాలని పిలుపునిచ్చారు. తమ పూర్తి భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని, దివంగత నేత వైఎస్ఆర్ బాటలో నడుస్తూ ప్రజాహితం కోసం సర్వదా పాటుపడతామని పేర్కొన్నారు. 

కన్వీనర్ కౌశిక్ మామిడి మాట్లాడుతూ అధికార టీడీపీ అసమర్థతను సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు ఎండగడతామని హెచ్చరించారు. కేక్ కట్ చేసి సభ్యులంతా ఒకరికొరకు శుభాకాంక్షలు తెలుపుకొంటూ జై జగన్, వైఎస్ఆర్ అమర్ రహే నినాదాలతో హోరెత్తించారు.ఈ కార్యక్రమంలో విక్టోరియా స్టేట్ యూత్ వింగ్ కన్వినర్ లోకేష్ కాసు, సోషల్ మీడియా ఇంచార్జి రమ్య యార్లగడ్డ, నాయకులు సుబ్బారెడ్డి, పవన్ గోగుల, ఆస్ట్రేలియాలోని వివిధ సంఘాల నాయకులు వెంకట్ నూకల, ఆదిరెడ్డి యారా, ప్రవీణ్ దేశం, కిరణ్ పాల్వాయి, అమరేందర్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement