దుబాయ్ లో మోదీ మెగా షో | narendra modi speech in dubai, 50 thousand nri to be attended | Sakshi
Sakshi News home page

దుబాయ్ లో మోదీ మెగా షో

Published Mon, Aug 17 2015 8:26 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

దుబాయ్ లో మోదీ మెగా షో - Sakshi

దుబాయ్ లో మోదీ మెగా షో

దుబాయ్: రెండు రోజుల పర్యటనలో భాగంగా యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ )లో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రవాస భారతీయులు అపూర్వ స్వాగతం పలకబోతున్నారు. కాసేపట్లో దుబాయ్ క్రికెట్ స్టేడియంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు.

మోదీ ప్రసంగాన్ని వినేందుకు యాభై వేల మంది భారతీయులు హాజరయ్యారు. దీంతో దుబాయ్ లోని క్రికెట్ స్టేడియం జనంతో కిక్కిరిసిపోయింది. ఆ స్టేడియం కెపాసిటీ దాదాపు నలభై వేలు మాత్రమే ఉండగా.. అధిక సంఖ్యలో భారతీయులు హాజరు కావడం విశేషం. గత నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల్లో కూడా ఆయన ప్రసంగాలకు అధిక సంఖ్యలో భారతీయులు హాజరైన సంగతి తెలిసిందే.  ప్రత్యేకంగా అమెరికా, ఆస్ట్రేలియా పర్యటనల్లో మోదీ ప్రసంగాలను వినేందుకు వేల సంఖ్యలో ప్రవాస భారతీయులు హాజరై అమితాసక్తి చూపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement