Chandrayaan-3: అబుదాబిలో భారత్ మాతా కీ జై | Chandrayaan 3 Success Indians Enjoyed At UAE Capital Abu Dhabi | Sakshi
Sakshi News home page

చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ సక్సెస్‌.. అబుదాబిలో ‘భారత్ మాతా కీ జై’

Published Thu, Aug 24 2023 2:28 PM | Last Updated on Thu, Aug 24 2023 3:36 PM

Chandrayaan 3 Success Indians Enjoyed At UAE Capital Abu Dhabi - Sakshi

అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత అద్భుత ఘట్టంగా చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ నిలిచిపోయింది. ఈ అరుదైన ఘనతను చూడడానికి దేశవిదేశాల్లోనూ ప్రజలు ఆసక్తి కనబరిచారు. అలాగే.. విదేశాల్లో ఉంటున్న భారతీయుల కోసమూ ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నాయి అక్కడి ఇండియన్‌ కమ్యూనిటీస్‌. ఈ క్రమంలో.. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ రాజధాని అబుదాబిలో ఉంటున్న  ప్రవాస భారతీయులందరు ఒక్క దగ్గర ఉండి వీక్షించేందుకు ఇండియా సోషల్ అండ్ కల్చర్‌ సెంటర్ ముఖ్య ప్రాంగణంలో LED స్క్రీన్ ద్వారా ఏర్పాట్లు చేశారు.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వందలాది ప్రవాస భారతీయులు అక్కడికి చేరుకొని చంద్రయాన్ 3 చంద్రుని ఉపరితలం పై లాండ్ అవడం వీక్షించారు. ఎక్కువ మంది తెలుగు ప్రజలు.. అందునా తెలంగాణ ప్రజలు ఉండడం చెప్పుకోదగ్గ విశేషం. చంద్రయాన్ 3 లాండింగ్ చివరి క్షణాలలో ప్రాంగణం అంతా భారత్ మాతా కీ జై నినాదాలతో మారు మోగింది.

ఈ క్షణాలు భారతీయలందరి హృదయాలలో ఒక గర్వం తో కూడిన ఆనందం చేకూర్చిందని తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు రాజశ్రీనివాస రావు, గోపాల్ మరియు ఎట్టి రెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు. అలాగే ISC ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఇది ‘భారతీయలందరికి మరచిపోలేని అనుభూతి’గా పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement