Telangana State Formation Day Decennial Celebrations In Australia - Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాలో ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

Published Sat, Jun 3 2023 4:04 PM | Last Updated on Sat, Jun 3 2023 4:29 PM

telangana state formation decade celebrations in australia - Sakshi

బీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను మెల్బోర్న్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ వింగ్ కన్వీనర్  వినయ్ గౌడ్, ఉదయ్ రెడ్డి ఆధ్వర్యంలో సభ్యులందరూ గత పదేళ్లలో కేసీఆర్ అమలు చేసిన పథకాలను ,అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్లకార్డులను ప్రదర్శించారు.

బీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పిలుపు మేరకు ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్, కాన్బెర్ర, అడిలైడ్, బ్రిస్బేన్, జీలాంగ్, బల్లారాట్, పెర్త్, గోల్డ్ కోస్ట్, హోబర్ట్, డార్విన్ నగరాలలో పది రోజులు వేడుకలు జరిపి తెలంగాణ కీర్తిని, కేసీఆర్ రాష్ట్రంలో చేస్తున్న సర్వతోముఖాభివృద్ధి గురించి, దేశంలో తెలంగాణను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలుపుతున్న తీరును ఎన్ఆర్ఐలందరికీ తెలియజేసేలా ఈ వేడుకలు జరుపుతున్నామని తెలిపారు.

ఈ వేడుకలలో సాయిరాం ఉప్పు, విశ్వామిత్ర, సనిల్, సతీష్, ప్రవీణ్, అమిత్ , సురేష్, వినోద్, చైతన్య, సూర్యారావు , విక్రమ్ కందుల, సంజీవ్ రెడ్డి, శణ్ముఖ్, వేణు నాన్న, సాయి గుప్తా, రాకేష్, అరుణ్, నరేందర్, హరి పల్ల, విజయ్, డా.అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement