బిల్లులు రాక ఇల్లు తాకట్టుకు సిద్ధమయ్యా: స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి   | Telangana Decade Celebrations: Speaker Pocharam Srinivas Reddy Attend Welfare Celebrations School Kamareddy | Sakshi
Sakshi News home page

బిల్లులు రాక ఇల్లు తాకట్టుకు సిద్ధమయ్యా: స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి  

Published Sat, Jun 10 2023 8:12 AM | Last Updated on Sat, Jun 10 2023 2:40 PM

Telangana Decade Celebrations: Speaker Pocharam Srinivas Reddy Attend Welfare Celebrations School Kamareddy - Sakshi

సాక్షి, కామారెడ్డి (బాన్సువాడ/నస్రూల్లాబాద్‌): డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు రావడం కొంత ఆలస్యం కావడంతో.. ఒకానొక సందర్భంలో సొంతింటిని తాకట్టు పెట్టి బిల్లులు చెల్లించాలనుకున్నానని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కానీ కొందరు తనపై విశ్వాసంతో వారించడంతో ఆ నిర్ణయం ఉపసంహరించుకున్నట్టు తెలిపారు.

శుక్రవారం కామారెడ్డి జిల్లా నస్రూల్లాబాద్‌ మండలంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సంక్షేమ సంబరాలను నిర్వహించారు. పోచారం మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గంలో సొంత స్థలాలున్న వారికి 7 వేల ఇళ్లు, ప్రభుత్వపరంగా 4 వేల డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిర్మించి ఇచ్చామన్నారు. కాగా, ఓ లబ్ధిదారుడు కలలో కూడా ఇంతమంచి ఇంట్లో ఉంటానని ఊహించలేదని.. స్పీకర్‌ సార్‌ తనకు దేవుడితో సమానమని కన్నీరు పెట్టుకున్నాడు. దీంతో స్పీకర్‌ కూడా కంటతడి పెట్టారు.

చదవండి: బీజేపీ మాస్టర్‌ ప్లాన్‌.. ప్రచార ‘సారథి’ ఈటెల!.. ప్రకటన ఎప్పుడంటే?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement