state formation
-
ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి,అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభ సందర్భంగా ప్రజలకు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణార్పణ చేసిన మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు. ఆయన అంకితభావం రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది’ అని పొట్టి శ్రీరాములు త్యాగాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. On Andhra Pradesh Formation Day, my warm greetings to the resilient and talented people of this remarkable state. Remembering the immense sacrifice of ‘Amarajeevi’ Potti Sriramulu Garu, whose dedication paved the way for the state’s formation. May Andhra Pradesh continue to…— Vijayasai Reddy V (@VSReddy_MP) November 1, 2024 -
ఆస్ట్రేలియాలో ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు
బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను మెల్బోర్న్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ వింగ్ కన్వీనర్ వినయ్ గౌడ్, ఉదయ్ రెడ్డి ఆధ్వర్యంలో సభ్యులందరూ గత పదేళ్లలో కేసీఆర్ అమలు చేసిన పథకాలను ,అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్లకార్డులను ప్రదర్శించారు. బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పిలుపు మేరకు ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్, కాన్బెర్ర, అడిలైడ్, బ్రిస్బేన్, జీలాంగ్, బల్లారాట్, పెర్త్, గోల్డ్ కోస్ట్, హోబర్ట్, డార్విన్ నగరాలలో పది రోజులు వేడుకలు జరిపి తెలంగాణ కీర్తిని, కేసీఆర్ రాష్ట్రంలో చేస్తున్న సర్వతోముఖాభివృద్ధి గురించి, దేశంలో తెలంగాణను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలుపుతున్న తీరును ఎన్ఆర్ఐలందరికీ తెలియజేసేలా ఈ వేడుకలు జరుపుతున్నామని తెలిపారు. ఈ వేడుకలలో సాయిరాం ఉప్పు, విశ్వామిత్ర, సనిల్, సతీష్, ప్రవీణ్, అమిత్ , సురేష్, వినోద్, చైతన్య, సూర్యారావు , విక్రమ్ కందుల, సంజీవ్ రెడ్డి, శణ్ముఖ్, వేణు నాన్న, సాయి గుప్తా, రాకేష్, అరుణ్, నరేందర్, హరి పల్ల, విజయ్, డా.అర్జున్ తదితరులు పాల్గొన్నారు. -
మూడేళ్ల పండగకు ఏర్పాట్లు పూర్తి
-
ముగ్గురికి సీఎం సర్వోన్నత పతకాలు
రాష్ట్ర పోలీసు పతకాలు ప్రకటించిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖతో పాటు అగ్నిమాపక శాఖ, విజిలెన్స్, ఎస్పీఎఫ్ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన అధికారులు, సిబ్బందికి రాష్ట్ర అవతరణ దినం సందర్భంగా ప్రభుత్వం పతకాలు ప్రకటించింది. అత్యున్నతమైన ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీసు పతకంతో పాటు మరో ఐదు విభాగాల్లో పతకాలను హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేదీ ప్రకటిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. శౌర్య పతకం పొందిన వారు... పోలీస్ శాఖలోని గ్రేహౌండ్స్‌లో పనిచేస్తున్న డిప్యూటీ అసాల్డ్ కమాండర్ విద్యాసాగర్, జూనియర్ కమాండర్ బి.వెంకన్న, వై.సత్యనారాయణ, సీనియర్ కమాండర్ ఎస్.నర్సింహారావు, ఇంటెలిజెన్స్‌లోని కౌంటర్ సెల్ ఇన్స్పెక్టర్ బి.బాలరాజు, ఎస్సైలు వెంకటేశ్వర్‌గౌడ్, సీహెచ్.సుదర్శన్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ కె.మధుసూదన్‌రావు, యూసుఫ్, మారుతీరావు, సాబుద్దీన్, భుజంగరావు, కానిస్టేబుళ్లు సయీద్ బిన్ ముఫ్తా, రామచంద్రారెడ్డి, లక్ష్మణ్‌రావు, జంగయ్య, సాదిక్ అహ్మద్, కేసీ విజయ్‌కుమార్. కాగా, ముగ్గురికి రాష్ట్ర మహోన్నత సేవా పతకం, 38 మంది సిబ్బందికి పోలీసు ఉత్తమ సేవా పతకం, 31 మందికి కఠిన సేవా పతకం, 163 మంది పోలీసు సిబ్బందికి పోలీసు సేవా పతకాలను ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఎస్పీఎఫ్లో ఎస్కే మహబూబ్‌బాషాకు మహోన్నత సేవా పతకం, 15 మంది సిబ్బందికి పోలీసు సేవా పతకాలు ప్రకటించారు. అగ్నిమాపక శాఖలో లీడింగ్ ఫైర్‌మన్ నాగేశ్వర్రావుకు శౌర్య పతకం ప్రకటించగా, ఇద్దరికి ఉత్తమ సేవా పతకం, 14 మందికి సేవాపతకాలను ప్రకటించింది. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్లో ముగ్గురికి ఉత్తమ సేవాపతకాలు, ఏడుగురికి సేవా పతకాలు ప్రకటించారు. ఏసీబీలో డీఎస్పీ సుదర్శన్‌కు మహోన్నత సేవా పతకం, మరో ఇద్దరికి ఉత్తమ సేవా పతకం ప్రకటించారు. అలాగే 12 మంది సిబ్బందికి పోలీసు సేవా పతకాలు ప్రకటించారు. ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీసు పతకం ఎన్.మల్లారెడ్డి, ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ పి.రాధాకిషన్‌రావు, అదనపు ఎస్పీ, ఇంటెలిజెన్స్ పి.జగదీశ్వర్, ఇన్స్పెక్టర్, మైలార్ దేవులపల్లి -
ఆవిర్భావం.. అదరాలె
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను ధూంధామ్‌గా నిర్వహించేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ఉత్సవాలు.. ఆటపాటలు ఎలా ఉండాలో మంత్రి హరీశ్‌రావు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆవిర్భావ వేడుకలు గ్రామం, మండలం, డివిజన్ కేంద్రాల్లో నిర్వహించనున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్‌దీపాలతో అలంకరిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర రెండో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లపై ఇప్పటికే కలెక్టర్ రోనాల్డ్‌రోస్ అధికారులతో సమీక్షించారు. ప్రతి గ్రామ పంచాయతీలో జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్స్టేషన్లు, పబ్లిక్‌రంగ సంస్థలు, థియేటర్లను విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. అలాగే కార్యాలయ ఆవరణాలన్నీ పరిశుభ్రంగా ఉంచుతున్నారు. ఆస్పత్రులు, అనాథ, వృద్ధాశ్రమాల్లో పండ్లు పంపిణీ చేస్తారు. రక్తదాన శిబిరాలు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. అలాగే గురువారం నూతన పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. గ్రామ పంచాయతీ భవనాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు, డబుల్బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన, భూమి కొనుగోలు పథకం లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఉదయం 8గంటల నుంచి.. జిల్లా వ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభమవుతాయి. ఉదయం సంగారెడ్డి పట్టణంలోని కలెక్టరేట్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద, అమరవీరుల స్థూపం వద్ద భారీ నీటిపారదల శాఖ మంత్రి హరీశ్‌రావు నివాళులర్పిస్తారు. అనంతరం పోలీస్ పెరేడ్‌గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. పోలీసుల గౌరవవందనం స్వీకరిస్తారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అమరులైన వారి కుటుంబ సభ్యులను సన్మానిస్తారు. వివిధ రంగా ల్లో ప్రతిభావంతులు, నిష్ణాతులకు నగదు పారితోషికంతోపా టు ప్రశంసాపత్రం అందజేస్తారు. సాంస్కృతిక కార్యక్రమా లు నిర్వహిస్తారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఆయా శాఖలకు సంబంధించిన ప్రదర్శనశాలలను ఏర్పాటు చేస్తారు. జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు.. జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో వారం రోజుల ముందే పారిశుద్ధ్య కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. మురికికాల్వల్లో పూడిక తీయడం, వీధులు శుభ్రం చేయడం వంటివి చేస్తున్నారు. ప్రజా భవనాల పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. గ్రామపంచాయతీ భవనాలకు, వాటి అనుబంధ సంస్థల భవనాలకు అవసరమైనచోట కలర్స్ వేస్తున్నారు. గ్రామ పంచాయతీలలో ఎన్నికైన ప్రజాప్రతినిధులకు, కార్యాచరణ కమిటీలకు ఆటల పోటీలు నిర్వహిస్తారు. గ్రామ పంచాయతీల్లో 25 కేజీల మిఠాయిలు పంపిణీ చేస్తారు. -
‘విక్టోరియా’లో అవతరణ వేడుకలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర అవతరణ వేడుకలను సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ హోంలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రఘునందన్‌రావు తెలిపారు. ఈ ఉత్సవాలకు సంబంధించి అధికారులకు అప్పజెప్పిన పనులను సకాలంలో పూర్తిచేయాలన్నారు. గురువారం కలెక్టరేట్లో అవతరణ వేడుకలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జూన్ 2న ఉదయం 8.30గంటలకు అమరవీరుల స్తూపం ఆవిష్కరణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలన్నారు. అనంతరం జేసీ రజత్‌కుమార్ సైనీ మాట్లాడుతూ జిల్లాస్థాయిలో 30, మండల స్థాయిలో 10, మున్సిపల్ స్థాయిలో 15 అవార్డులు అందజేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో జేసీ ఆమ్రపాలి, సబ్‌కలెక్టర్ అలగు వర్షిణి తదితరులు పాల్గొన్నారు. -
కోటి రతనాల వీణ.. కొత్త రాష్ట్రమైన వేళ..
-
దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ
కోటి రతనాల వీణ.. కొత్త రాష్ట్రమైన వేళ.. ఫలించిన అరవయ్యేళ్ల అస్తిత్వ ఆకాంక్ష.. తెలంగాణ అంతటా ఆనంద హేల కొలిక్కి వచ్చిన పంపకాలు నేటి నుంచే విడిగా పాలనకు శ్రీకారం ఇప్పటికి ఉమ్మడిగానే హైకోర్టు తదితరాలు టీడీపీ తప్ప అన్ని పార్టీలకూ విడిగా శాఖలు కొత్త పొద్దు పొడిచింది. కోటి ఆశలతో నిరీక్షిస్తున్న తెలంగాణ నేలను కొత్త వేకువ పలకరించింది. కొత్త రాష్ట్రం సాధించిన సంబరంతో కోట్ల ప్రజానీకం పులకరించింది. తెలంగాణ సమాజపు అరవ య్యేళ్ల సుదీర్ఘ అస్తిత్వ పోరాటం ఫలించింది. స్వాభిమానం, స్వపరిపాలన కోసం దశాబ్దాలుగా సాగిన సబ్బండవర్గాల ఉద్యమం లక్ష్యాన్ని చేరింది. అసంఖ్యాకమైన ఆత్మబలిదానాలు, అనేకానేక ఉద్యమ గాయాల సాక్షిగా సువిశాల భారతావనిలో తెలంగాణ అవతరించింది... 29వ రాష్ట్రంగా సగర్వంగా ఉనికిలోకి వచ్చింది. దశాబ్దాలుగా ఊరిస్తున్న బంగరు స్వప్నం నేటితో సాకారమైంది. ఊరూవాడా, పల్లేపట్నం, చిన్నాపెద్దా తేడా లేకుండా అర్ధరాత్రి నుంచే తెలంగాణ సమాజం సంబురాలు జరుపుకుంటూ కొత్త రాష్ట్రానికి, తమ సొంత రాష్ట్రానికి ఘనంగా స్వాగతం పలికింది. ఆనందం అర్ణవమైంది. తెలంగాణ ప్రజల సంబరం అంబరాన్నంటింది! సాక్షి ప్రధాన ప్రతినిధి: తెలంగాణ ఏర్పడింది! ఆంధ్రప్రదేశ్ నుంచి అధికారికంగా విడిపోరుు కొత్త రాష్ట్రంగా అవతరించింది. భౌగోళికంగా తూర్పు, దక్షిణ దిక్కుల్లో సీవూంధ్ర, పశ్చివూన కర్ణాటక, వుహారాష్ట్ర, ఈశాన్యాన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు సరిహద్దులుగా దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటైంది. ఫైళ్లు, ప్రభుత్వ ఖాతాలు, నిధులు, ఆస్తులు, అప్పులు, ఉద్యోగ గణం, భవనాలు, వాహనాలు, బడ్జెట్ సహా అన్నింటినీ రెండు రాష్ట్రాలూ పంచేసుకున్నారుు. అసెంబ్లీ, శాసనవుండలి, ఏపీ భవన్, సచివాలయుం, వుంత్రుల క్వార్టర్లను సైతం విభజించారు. కాకతీయుుల కళాతోరణం, చార్మినార్ బొవ్ములున్న తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని ఖరారు చేశారు. ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్ ఏర్పడింది. సోవువారం నుంచే తెలంగాణ పాలన విడిగా కొనసాగనుంది. ఉదయుమే గవర్నర్‌గా నరసింహన్, వుుఖ్యవుంత్రిగా కె.చంద్రశేఖరరావు ప్రమాణ స్వీకారం చేస్తారు. కేసీఆర్‌తో పాటు ఆయున వుంత్రివర్గమూ ప్రమాణం చేసి కొలువుదీరుతుంది. తద్వారా తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న రాష్ట్రపతి పాలనను అధికారికంగా తొలగించినట్టవుతుంది. ప్రవూణస్వీకారం జరిగిన వెంటనే కేసీఆర్ వుుఖ్యవుంత్రిగా సచివాలయుంలో బాధ్యతలు స్వీకరిస్తారు. కొత్త రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా రాజీవ్ శర్మ, డీజీపీగా అనురాగ్ శర్మ నియుమితులయ్యూరు. వీరు కూడా సోమవారమే బాధ్యతలు స్వీకరిస్తారు. తెలంగాణకు కేటారుుంచిన ఉద్యోగ గణం సోవువారం నుంచే విధులు నిర్వర్తించటానికి వీలుగా ‘ఆర్డర్ టు వర్క్’ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాల్లోని కలెక్టర్లు, జారుుంట్ కలెక్టర్లు, ఎస్పీలు తదితర అధికారులు, ఉద్యోగులను ఎక్కడివారక్కడే అనే పద్ధతిలో ప్రస్తుతానికి కొనసాగిస్తున్నారు. రాష్ట్ర స్థారుులో పనిచేసే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర కేంద్ర సర్వీసుల అధికారులనూ తెలంగాణకు విడిగా కేటారుుంచారు. సోవువారం నుంచి వీరంతా కొత్త బాధ్యతల్లో తవుకు కేటారుుంచిన భవనాలు, బ్లాకుల్లో చేరి, ఇంకా మిగిలిపోరుున అప్పగింతల పనులు మరో వారం రోజుల్లో పూర్తి చేయూల్సి ఉంటుంది. దాంతో ఇక తెలంగాణ పాలన బృందం ఏర్పాటు కసరత్తు మొత్తం పూర్తరుునట్టే! కొన్ని ఉవ్ముడిగానే! హైకోర్టుతో పాటు విద్యా సంస్థల్లో ప్రవేశాలు, కొన్ని ప్రభుత్వ సంస్థలు కొంతకాలం పాటు ఉవ్ముడిగానే కొనసాగుతారుు. సా గునీటి వివాదాల తాత్కాలిక సర్దుబాట్లు, పరిష్కారాల కోసం ఓ ఉన్నత స్థారుు కమిటీ వేశారు. తరువాతి దశలో కృష్ణా జలా ల పంపిణీ కోసం ఏర్పడిన బ్రిజేశ్‌కువూర్ ట్రిబ్యునల్ రెండు రాష్ట్రాల నడువు నీటి వనరుల పంపిణీని పూర్తి చేస్తుంది. విద్యుత్తు ప్లాంట్ల కొనుగోలు ఒప్పందాలు కూడా వాటి కాల పరిమితి తీరేదాకా ప్రస్తుత పద్ధతిలోనే కొనసాగుతారుు. గ్రేహౌండ్స్, యూంటీ నక్సల్ విభాగాలు వంటి వి ఇంకా పూ ర్తిగా విడిపోకపోరుునా పోలీసుల విభజన వూత్రం పూర్తరుుం ది. రెండు రాష్ట్రాల నడువు వ్యాపార లావాదేవీలకు సెంట్రల్ సేల్స్ టాక్స్ వసూలు విషయుంలో సందిగ్ధత కొనసాగుతోంది. అన్నీ వేరుపడ్డట్టే! టీడీపీ తప్ప రాష్ట్రంలోని రాజకీయు పార్టీలు సైతం రెండు శాఖలుగా విడిపోయూరుు. టీఆర్ఎస్ కేవలం తెలంగాణ ఏర్పాటు ఎజెండాకే పరిమితమై, మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయూన్ని సాధించి తొలిసారిగా తెలంగాణలో అధికారాన్ని హస్తగతం చేసుకున్న రికార్డును తన పేరిట లిఖించుకుంది. కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ,సీపీఎం, సీపీఐ, న్యూ డెమొక్రసీ, లోక్‌సత్తా పార్టీలు తెలంగాణకు విడిగా శాఖలను ఏర్పాటు చేశారుు. ఆవిర్భావ వేడుకలకు పిలుపునిచ్చారుు. టీడీపీ వూత్రమే మొన్నటి ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన ఎన్నికల కమిటీ తప్ప ప్రత్యేకంగా తెలంగాణ శాఖను ఏర్పాటు చేయులేదు. రాజకీయు పార్టీలకు అనుబంధంగా ఉన్న సంఘాలు, విభాగాలు, ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు కూడా వేరుపడ్డారుు. తెలంగాణ ప్రజలు సైతం కొత్త రాష్ట్రాన్ని స్వాగతిస్తూ అర్ధరాత్రి నుంచే భారీ ఎత్తున సంబురాలు జరుపుకుంటూ రాష్ట్ర ఏర్పాటుకు అసలైన ఆమోదవుుద్ర వేశారు! -
సీమాంధ్ర పోలీస్‌కు బెజవాడే బాస్
*డీఐజీ స్థాయి నుంచి నేరుగా అడిషనల్ డీజీ స్థాయికి * అడిషనల్ డీజీగా సురేంద్రబాబు? * కీలకం కానున్న జంటనగరాల పోలీసింగ్ *కేంద్ర హోం శాఖకు ప్రతిపాదనలు నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెజవాడ పోలీసులు నంబర్‌వన్ కానున్నారు. ఇప్పటివరకు డీఐజీ స్థాయి క్యాడర్‌కే పరిమితమైన విజయవాడ కమిషనరేట్‌ను ఏకంగా అదనపు డీజీ స్థాయికి పెంచనున్నారు. ఈ ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్ర హోం శాఖకు చేరినట్లు సమాచారం. దీంతోపాటు 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గుంటూరు అర్బన్ పోలీసు జిల్లాను డీఐజీ స్థాయికి అప్‌గ్రేడ్ చేసి కమిషనరేట్‌గా మార్చనున్నారు. 60 కిలోమీటర్ల దూరంలో ఏలూరును పశ్చిమగోదావరి జిల్లా నుంచి విభజించి ఏలూరు అర్బన్ జిల్లాగా మార్చే ప్రతిపాదనలు పంపారు. వీటికి ఆమోదముద్ర పడితే సీమాంధ్ర పోలీసింగ్‌కు బెజవాడ కీలకం అవుతుంది. సాక్షి ప్రతినిధి, విజయవాడ : విజయవాడ నగర కమిషనరేట్‌కు హైదరాబాద్ మెట్రో నగరం స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేపట్టేందుకు కేంద్ర హోంశాఖ కసరత్తుప్రారంభించింది. రాష్ట్ర అవతరణ తేదీ అనంతరం గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సీఎం తాత్కాలిక క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో విజయవాడ కమిషనరేట్‌ను నేరుగా అడిషనల్ డీజీ స్థాయికి చేయనున్నారు. ఇక్కడ కమిషనర్‌గా రెండో పోలీస్ బాస్ స్థాయిలో ఉన్న అడిషనల్ డీజీని నియమించనున్నారు. ఈ పోస్టింగ్ కోసం అప్పుడే పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఆసక్తి చూపుతున్నారు. గతంలో సీపీగా సమర్ధంగా పనిచేసిన నిమ్మగడ్డ సురేంద్రబాబు పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈయనతోపాటు గతంలో ఇక్కడ పనిచేసి ప్రస్తుతం కీలక కేడర్‌లో ఉన్న ఉమేష్ షరాఫ్, ఎ.బి.వెంకటేశ్వరరావుల పేర్లు కూడా తెరపైకి వచ్చినట్లు సమాచారం. రెండేళ్లలో రెట్టింపు కానున్న స్టేషన్లు, సిబ్బంది.. కొత్త రాష్ట్రం ఏర్పడితే సీమాంధ్రలోని 13 జిల్లాల్లో విజయవాడ అత్యంత కీలకం కానుంది. ఇక్కడ ఎయిర్‌పోర్టు, హైటెక్ సిటీ, ఇంద్రకీలాద్రి, విజయవాడ రైల్వే జంక్షన్ ఉన్నాయి. వీటికి ఇప్పటికే భద్రత పెంచాల్సిన అవరం ఉందనే ప్రతిపాదనలు కేంద్ర హోంశాఖ వద్ద ఉన్నాయి. వీటితో రాష్ట్రం ఏర్పడ్డాక కొత్తగా ఏర్పాటయ్యే పలు రాష్ట్ర స్థాయి కార్యాలయాలు, సిబ్బంది, అధికారులు, ఉన్నతాధికారుల సంఖ్య గణనీయంగా పెరగనుంది. వారందరి భద్రతకు రెట్టింపు పోలీసు సిబ్బంది అవసరం ఉంటుంది. కమిషనరేట్‌లో ఇప్పుడున్న రెండున్నర వేలమంది పోలీసులకు అదనంగా మరో రెండున్నర వేలమందిని పెంచనున్నారు. కమిషనరేట్‌లో 11 పోలీస్ స్టేషన్లు, రూరల్‌లో 9 స్టేషన్లు మొత్తం 20 ఉన్నాయి. ఇవిగాక కమిషనరేట్‌లో మరికొన్ని ప్రాంతాలను కూడా కలిపే ప్రతిపాదనలు తెరమీదకు వచ్చాయి. ఇదంతా రానున్న రెండేళ్లలో జరగవచ్చని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం ఏర్పాటు పూర్తయితే విజయవాడ కమిషనరేట్ హైదరాబాద్ నగరం స్థాయిలో భద్రత ఉంటుందని చెబుతున్నారు. విభజనతో పోలీసుల శాఖలో అన్ని కేడర్లలో ప్రమోషన్లు ముందుగానే వచ్చే అవకాశాలున్నాయి. మిగిలిన కేడర్ల క ంటే సీఐలకు డీఎస్పీ ప్రమోషన్లు ముందుగా వచ్చే అవకాశాలున్నాయి. కొత్త సిబ్బంది నియామకం కూడా జరుగనున్నట్లు సమాచారం. విజయవాడ అర్బన్ జిల్లా విజయవాడ 1983 మే 18న అర్బన్ జిల్లాగా ఆవిర్భవించింది. అప్పట్లో ఐదు లక్షల జనాభా ఉండడంతో ఎనిమిది లా అండ్ ఆర్డర్ పోలీసుస్టేషన్లు, ఒక మహిళా పీఎస్, 10 రూరల్ ప్రాంతాల్లోని పోలీస్స్టేషన్లు, నాలుగు ట్రాఫిక్ పీఎస్‌లతో అర్బన్ జిల్లా కార్యకలాపాలను సాగించింది. తొలి ఐపీఎస్ అధికారిగా కె.ఎస్.వ్యాస్ పనిచేశారు. ఇప్పటికే కమిషనరేట్‌ను అప్‌గ్రేడ్ చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. తాజా పరిణామాలతో విజయవాడ, గుంటూరు పట్టణాలు జంటనగరాలుగా అభివృద్ధి చెందనున్న దృష్ట్యా నేరుగా అడిషనల్ డీజీ కేడర్‌కు అప్‌గ్రేడ్ చేయనున్నారు. గుంటూరు అర్బన్ జిల్లా గుంటూరు అర్బన్ జిల్లా 2010 సంవత్సరం జూన్‌లో ఏర్పాటైంది. అనంతరం నగర పరిసర ప్రాంతాలు విస్తరించడంతో జనాభా భారీగా పెరిగింది. వాస్తవానికి 2016లో అప్‌గ్రేడ్ కావాల్సిన గుంటూరు అర్బన్ జిల్లా రాష్ట్ర విభజన నేపథ్యంలో ముందే అప్‌గ్రేడ్ కానుంది. డీఐజీ స్థాయి అధికారి కమిషనర్‌గా, ఐపీఎస్ అధికారులు ఇద్దరిని ఇక్కడ డీసీపీలుగా నియమించే అవకాశం ఉంది. -
జనవరి 3న ఖమ్మంలో తెలంగాణ సదస్సు
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: తెలంగాణ ముసాయిదా బిల్లు, రాష్ట్ర ఏర్పాటు పై జనవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఖమ్మంలోని రిక్కాబజార్స్కూల్లో సదస్సు నిర్వహించనున్నట్లు రాజకీయ జేఏసీ నేతలు పేర్కొన్నారు. మంగళవారం టీఎన్జీఓ కార్యాలయంలో రాజకీయ జేఏసీ సమావేశం టీజేఏసీ కన్వీనర్ కూరపాటి రంగరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీకి రావడం, అసెంబ్లీలో సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు వ్యవహరించిన తీరు, భవిష్యత్తులో బిల్లును అసెంబ్లీనుంచి పార్లమెంట్‌కు పంపేలా ప్రభుత్వంపై వత్తిడి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ సదస్సులో నిర్ణయించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా జేఏసీ చైర్మన్ కోదండరామ్ హాజరవుతారని తెలిపారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పదేళ్లపాటు ఉంచవద్దని, సీమాంధ్ర రాజధానిని నిర్మించిన వెంటనే అక్కడకు తరలించాలన్నారు. రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులు ఏర్పాటు చేయాలని చెప్పారు. పాలనా పగ్గాలను గవర్నర్‌కు ఇవ్వొద్దని, తెలంగాణ రాష్ట్రంలో 371 డి ప్రకారం జోనల్ వ్యవస్థను ఉంచాలని సూచించారు. అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చించి జనవరి 23వ తేదీలోగా రాష్ట్రపతికి పంపాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 2014 జనవరిలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి బిల్లును ఆమోదించాలని డిమాండ్‌చేశారు. ఈ సమావేశంలో న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు తవిడిశెట్టి రామారావు, ఉద్యోగ జేఏసీ ప్రధాన కార్యదర్శి నడింపల్లి వెంకటపతిరాజు, కో కన్వీనర్లు ఎస్కె.ఖాజామియా, కోడి లింగయ్య, డ్రైవర్ల సంఘం బాధ్యులు హకీం, లాయర్ల జేఏసీ చైర్మన్ తిరుమలరావు, టీఆర్ఎస్ నాయకులు శంకర్రావు, సుబ్బారావు, టీఎన్జీవో నగర అధ్యక్ష, కార్యదర్శులు వల్లోజు శ్రీనివాస్, ఆర్వీఎస్ సాగర్ పాల్గొన్నారు. -
నిరసనలే..
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాష్ట్ర అవతరణ వేడుకలకు నిరసన సెగ తగలనుంది. ఓ వైపు అవతరణ వేడుకలు బహిష్కరించాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం జేఏసీ పిలుపు నిచ్చింది. మరోవైపు నవంబర్ 1న బ్లాక్ డేగా ప్రకటించిన టీఆర్ఎస్ జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ప్రకటించింది. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కూడా రాష్ర్ట అవతరణ వేడుకల్లో పాల్గొనడం లేదని తెలిపారు. రాష్ట్ర విభజన ప్రక్రియ వేగంగా జరుగుతున్న సమయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటు న్న పార్టీలు రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలకు దూరంగా ఉంటున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో శుక్రవారం నిర్వహించే ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినాన్ని వేడుకగా చేసుకోవడం అర్థంలేని వ్యవహారంగా భావిస్తున్నారు. ప్రజాప్రతినిధులు వేడకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో అధికారులు కూడా మొక్కుబడిగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటిలాగే తెలంగాణవాదులు, ఉద్యమ సంస్థలు ఈ వేడుకలను బహిష్కరించాలని పిలుపునిచ్చాయి. ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. జిల్లా అంతటా నిరసనలు తెలపాలని టీజేఎసీ నిర్ణయించింది. నవంబర్ 1న విద్రోహ దినంగా పాటించేందుకు జిల్లాలో తెలంగాణవాదులు, ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలతోపాటు వివిధ సంఘాలు నిరసనలు, నల్లజెండాల ప్రదర్శనలకు సిద్ధమవుతున్నాయి. అవతరణ దినాన నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలపాలని పలు ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. ఇదిలా వుండగా రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు నిర్వహించేందుకు ఆదిలాబాద్ పోలీసు పరేడ్ గ్రౌండ్స్ సిద్ధమైంది. ఈ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసులు గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. గతంలో చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో జిల్లాకేంద్రంలో ప్రధాన వేడుక జరిగే పోలీసు గ్రౌండ్‌తోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ భద్రత ఏర్పాట్ల వల్ల సామాన్య జనం హాజరయ్యే అవకాశం లేక పోవడంతో కేవలం అధికారులకే పరిమితం కానుంది.