‘విక్టోరియా’లో అవతరణ వేడుకలు | The celebrations of the formation of Victoria | Sakshi
Sakshi News home page

‘విక్టోరియా’లో అవతరణ వేడుకలు

Published Fri, May 29 2015 12:49 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

The celebrations of the formation of Victoria

సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర అవతరణ వేడుకలను సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ హోంలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రఘునందన్‌రావు తెలిపారు. ఈ ఉత్సవాలకు సంబంధించి అధికారులకు అప్పజెప్పిన పనులను సకాలంలో పూర్తిచేయాలన్నారు. గురువారం కలెక్టరేట్‌లో అవతరణ వేడుకలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జూన్ 2న ఉదయం 8.30గంటలకు అమరవీరుల స్తూపం ఆవిష్కరణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.
 
 సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలన్నారు. అనంతరం జేసీ రజత్‌కుమార్ సైనీ మాట్లాడుతూ జిల్లాస్థాయిలో 30, మండల స్థాయిలో 10, మున్సిపల్ స్థాయిలో 15 అవార్డులు అందజేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో జేసీ ఆమ్రపాలి, సబ్‌కలెక్టర్ అలగు వర్షిణి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement