రాష్ట్ర పోలీసు శాఖతో పాటు అగ్నిమాపక శాఖ, విజిలెన్స్, ఎస్పీఎఫ్ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన అధికారులు, సిబ్బందికి రాష్ట్ర అవతరణ దినం సందర్భంగా ప్రభుత్వం పతకాలు ప్రకటించింది.
అలాగే ఎస్పీఎఫ్‌లో ఎస్‌కే మహబూబ్‌బాషాకు మహోన్నత సేవా పతకం, 15 మంది సిబ్బందికి పోలీసు సేవా పతకాలు ప్రకటించారు. అగ్నిమాపక శాఖలో లీడింగ్ ఫైర్‌మన్ నాగేశ్వర్‌రావుకు శౌర్య పతకం ప్రకటించగా, ఇద్దరికి ఉత్తమ సేవా పతకం, 14 మందికి సేవాపతకాలను ప్రకటించింది. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో ముగ్గురికి ఉత్తమ సేవాపతకాలు, ఏడుగురికి సేవా పతకాలు ప్రకటించారు. ఏసీబీలో డీఎస్పీ సుదర్శన్‌కు మహోన్నత సేవా పతకం, మరో ఇద్దరికి ఉత్తమ సేవా పతకం ప్రకటించారు. అలాగే 12 మంది సిబ్బందికి పోలీసు సేవా పతకాలు ప్రకటించారు.