ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: తెలంగాణ ముసాయిదా బిల్లు, రాష్ట్ర ఏర్పాటు పై జనవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఖమ్మంలోని రిక్కాబజార్‌స్కూల్‌లో సదస్సు నిర్వహించనున్నట్లు రాజకీయ జేఏసీ నేతలు పేర్కొన్నారు. మంగళవారం టీఎన్‌జీఓ కార్యాలయంలో రాజకీయ జేఏసీ సమావేశం టీజేఏసీ కన్వీనర్ కూరపాటి రంగరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీకి రావడం, అసెంబ్లీలో సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు వ్యవహరించిన తీరు, భవిష్యత్తులో బిల్లును అసెంబ్లీనుంచి పార్లమెంట్‌కు పంపేలా ప్రభుత్వంపై వత్తిడి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ సదస్సులో నిర్ణయించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా జేఏసీ చైర్మన్ కోదండరామ్ హాజరవుతారని తెలిపారు.
హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పదేళ్లపాటు ఉంచవద్దని, సీమాంధ్ర రాజధానిని నిర్మించిన వెంటనే అక్కడకు తరలించాలన్నారు. రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులు ఏర్పాటు చేయాలని చెప్పారు. పాలనా పగ్గాలను గవర్నర్‌కు ఇవ్వొద్దని, తెలంగాణ రాష్ట్రంలో 371 డి ప్రకారం జోనల్ వ్యవస్థను ఉంచాలని సూచించారు. అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చించి జనవరి 23వ తేదీలోగా రాష్ట్రపతికి పంపాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 2014 జనవరిలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి బిల్లును ఆమోదించాలని డిమాండ్‌చేశారు. ఈ సమావేశంలో న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు తవిడిశెట్టి రామారావు, ఉద్యోగ జేఏసీ ప్రధాన కార్యదర్శి నడింపల్లి వెంకటపతిరాజు, కో కన్వీనర్లు ఎస్‌కె.ఖాజామియా, కోడి లింగయ్య, డ్రైవర్ల సంఘం బాధ్యులు హకీం, లాయర్ల జేఏసీ చైర్మన్ తిరుమలరావు, టీఆర్‌ఎస్ నాయకులు శంకర్‌రావు, సుబ్బారావు, టీఎన్‌జీవో నగర అధ్యక్ష, కార్యదర్శులు వల్లోజు శ్రీనివాస్, ఆర్‌వీఎస్ సాగర్ పాల్గొన్నారు.
జనవరి 3న ఖమ్మంలో తెలంగాణ సదస్సు
Published Wed, Dec 25 2013 4:48 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement