సీమాంధ్ర నేతల తీరుపై కన్నెర్ర | telanagana supporters fire on seemandhra leaders | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర నేతల తీరుపై కన్నెర్ర

Published Tue, Dec 17 2013 3:28 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

telanagana supporters fire on seemandhra leaders

 అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లును అవమానపరిచిన సీమాంధ్ర నాయకుల దుశ్చర్యలను ఖండిస్తూ జిల్లాలో సోమవారం పలుచోట్ల నిరసనలు మిన్నంటాయి. ఉద్యోగ జేఏసీ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. సీమాంధ్ర నేతల దిష్టిబొమ్మలను తగులబెట్టారు. అసెంబ్లీలో టీ బిల్లు ప్రతులను చించివేయడం సరికాదని నేతలు ధ్వజమెత్తారు. ఖమ్మం కోర్టులో న్యాయవాదులు సీమాంధ్ర నేతల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఖమ్మం బైపాస్‌రోడ్‌లో న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో వివిధశాఖల ఉద్యోగులు వైరారోడ్ మీదుగా కలెక్టరేట్ వరకు ప్రదర్శన చేశారు. కలెక్టరేట్ ఎదుట కొద్దిసేపు రాస్తారోకో చేశారు. తెలంగాణ బిల్లును అసెంబ్లీలో అవమానపరచడం సరికాదని, బిల్లును అసెంబ్లీకి పంపిన రాష్ట్రపతిని, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను కించపరచడమేనని ఈ సందర్భంగా అన్నారు.
 
 టీ బిల్లును అవమానపరచడంపై మిన్నంటిన నిరసనలు
 ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: అసెంబ్లీ లో తెలంగాణ ముసాయిదా బిల్లును అవమానపరిచిన సీమాంధ్ర నాయకుల దుశ్చర్యలను ఖండిస్తూ జిల్లాలో పలుచోట్ల నిరసనలు మిన్నంటాయి. ఉద్యోగ జేఏసీ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. సీమాంధ్ర నేతల దిష్టిబొమ్మలను తగులబెట్టారు. టీ బిల్లు ప్రతులను చించివేయడం సరికాదని నేతలు ధ్వజమెత్తారు. ఖమ్మం కోరు ్టలో న్యాయవాదులు సీమాంధ్ర నేతల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఖమ్మం బైపాస్‌రోడ్‌లో న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించి, దిష్టిబొమ్మను తగులబెట్టారు. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో వివిధశాఖల ఉద్యోగులు వైరారోడ్ మీదుగా కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట కొద్దిసేపు రాస్తారోకో చేశారు. తెలంగాణ బిల్లును అసెంబ్లీ లో అవమానపరచడం సరికాదని, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను కించపరచడం సరికాదని నినాదాలు చేశారు.
 
  తెలంగాణ బిల్లును అడుగడుగునా అడ్డుకుంటూ సీమాంధ్రులు కుట్రలను బహిర్గతం చేశారని ఉద్యోగ జేఏసీ నేతలు కూరపాటి రంగరాజు, ఎస్‌కె.ఖాజామియా, మల్లెల రవీంద్రప్రసాద్, నాగిరెడ్డి ఆరోపించారు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులకు గుణపాఠం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి రాచకొండ వెంకటేశ్వర్లు, పీఆర్ నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పాషా, టీఎన్జీవో నగర అధ్యక్ష, కార్యదర్శులు వల్లోజు శ్రీనివాస్, ఆర్‌వీఎస్ సాగర్, లక్ష్మీనారాయణ, తుమ్మలపల్లి రామారావు, కిశోర్‌రెడ్డి, వేలాద్రి తదితరులు పాల్గొన్నారు. ఎన్డీ ఆధ్వర్యంలో సీమాంధ్రమంత్రుల దిష్టిబొమ్మను దహనం చేశారు. సీమాంధ్ర నేతలు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ఆగదని న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు అన్నా రు. కార్యక్రమంలో నాయకులు కె.సురేష్, సీవై పుల్లయ్య, అర్జున్‌రావు, రాజేంద్రప్రసాద్, శిరోమణి, ఝాన్సీ, మంగతాయి, ప్రదీప్ పాల్గొన్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement