రాజమహేంద్రవరం కల్చరల్: ‘‘హైదరాబాద్‌కు చెంది న విజయశేఖర్ వద్ద ఆన్‌లైన్‌లో కూచిపూడి నేర్చుకున్నాను. వేదాంతం రామలింగశాస్త్రి వద్ద నేర్చుకుని సర్టిఫికెట్ కోర్సు, పసుమర్తి శ్రీనివాసశర్మ వద్ద నేర్చుకుని డిప్ల మో పూర్తి చేశాను. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ సుమారు 500 ప్రదర్శనలు ఇచ్చాను’’ అని దుబాయ్ నుంచి వచ్చిన శ్రావణి తెన్నేటి అన్నారు. ఆనం కళాకేంద్రంలో ఆదివారం జరి గిన సంకీర్తనా నాట్య ప్రదర్శనలో పాల్గొనడానికి నగరానికి వచ్చిన ఆమె తన నాట్య ప్రస్థానాన్ని ఇలా వివరించారు. ‘‘మాది విశాఖపట్నం.
తండ్రి ఉద్యోగ రీత్యా నా రెండో ఏడాది నుంచే దుబాయ్‌లో స్థిరపడ్డాం. ఇంటర్ పూర్తయింది. కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శృతిలయలు సినిమాలో నటుడు ప్లేట్ మీద కాలు పెట్టి డ్యాన్స్ సాధన చేస్తాడు. అలా చేస్తుంటే కాలికి రక్తం వచ్చేది. అది చూసి ఇన్‌స్పైర్ అయి అలా చేయసాగాను. అమ్మా! నా కాలికి రక్తం రావడం లేదేం? అని అడిగేదాన్ని. నా తపనను గుర్తించి తల్లిదండ్రులు కూచి పూడి నృత్యంలో ప్రోత్సహించారు. 2003లో దుబాయ్‌లో తొలి ప్రదర్శన ఇచ్చాను. గోదా వరి, కృష్ణా పుష్కరాలకు, గురువాయూర్ ఆలయం, కేరళలోని అటుకాల్ ఆలయం, అనంత పద్మనాభస్వామి ఆలయాల్లో ప్రదర్శనలు ఇచ్చాను. ఇంటీరియర్ డిజైనర్‌గా రాణించాలని, కూచిపూడి నాట్యంలో పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను.
Comments
Please login to add a commentAdd a comment