ఎన్నికల సమయంలో ఆయా ఓటర్లు విదేశాల నుంచే ఓటు వేసుకునే వెసులుబాటు కల్పిస్తూ పార్లమెంటులో చట్టం చేయబోతున్నారన్నారు.
కడప: గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లలో ఓటరుగా ఉంటూ మరణించిన వ్యక్తులను గుర్తించి అధికారులు రిజిస్టరులో నమోదు చేసి, మృతుల బంధువులకు ఇచ్చే డెత్ సర్టిఫికెట్ కాపీని రాష్ట్ర ఎన్నికల సంఘ కార్యాలయానికి పంపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ అధికారులను ఆదేశించారు. వైఎస్సార్ జిల్లా కడపలోని కలెక్టరేట్ సభా భవన్‌లో రాజకీయ పార్టీల నాయకులు, జిల్లాలోని ఎన్నికల అధికారులతో బుధవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఎన్నికల సమయంలో ఆయా ఓటర్లు విదేశాల నుంచే ఓటు వేసుకునే వెసులుబాటు కల్పిస్తూ పార్లమెంటులో చట్టం చేయబోతున్నారన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ నూటికి నూరు శాతం ఓటరు కార్డులకు ఆధార్ అనుసంధానం చేసుకున్న జిల్లాగా చరిత్రకు ఎక్కబోతోందన్నారు.