విదేశాల్లో ఉంటున్న భారతీయులకు శుభవార్త. త్వరలోనే వాళ్లు తామున్న చోటు నుంచే భారతదేశంలో జరిగే ఎన్నికల్లో ఓటు వేయొచ్చు. ఎన్నికలు వస్తున్నాయని, ఓటుహక్కు వినియోగించుకోవాలని అంత దూరం నుంచి ఇక్కడకు విమానాల్లో రావాల్సిన అవసరం లేదు. 8 వారాల్లోగా ఈ-ఓటింగు హక్కును ఎన్నారైలకు అందుబాటులోకి తేవాలని కేంద్రప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది.
విదేశాల్లో నివాసం ఉంటూ భారతీయ పాస్పోర్టు కలిగి ఉన్నివారికి ఈ-బ్యాలట్ ఇచ్చేందుకు తాము ఇప్పటికే అంగీకరించామని, అవసరమైన చట్టాలను సవరించి దాన్ని అమలులోకి తెస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దాంతో వీలైనంత త్వరగానే ఈ-బ్యాలట్ ఓటింగును అమలుచేయాలని సుప్రీంకోర్టు కేంద్రానికి చెప్పింది. ప్రపంచం నలుమూలలా సుమారు 1.1 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో ఉన్నట్లు అంచనా. సుప్రీంకోర్టు ఆదేశాలతో వారందరికీ ఊరట కలిగినట్లయింది.
ఈ బ్యాలట్ ఎలా..
ఈ విధానంలో ముందుగా ఓ ఖాళీ పోస్టల్ బ్యాలట్ పేపర్ను ఓటర్లకు ఈమెయిల్ చేస్తారు. వాల్లు దాన్ని పూర్తిచేసి, సంబంధిత నియోజకవర్గానికి పోస్టు ద్వారా పంపాల్సి ఉంటుంది. ఇందులో కొంతవరకు అక్రమాలు, రిగ్గింగ్ లేదా రహస్య ఓటింగు లేకపోవడం లాంటి ఇబ్బందులు లేకపోలేవని ఎన్నికల కమిషన్ తన నివేదికలో్ తెలిపింది.
ఎన్నారైలకు ఈ-ఓటింగ్ హక్కు ఇవ్వాల్సిందే
Published Mon, Jan 12 2015 3:04 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement