E-voting
-
ఖమ్మంలో ఈ–ఓటింగ్ అంతంతే
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: అట్టహాసంగా చేపట్టిన ఈ–ఓటు మొబైల్ యాప్ ప్రయోగం ఖమ్మం కార్పొరేషన్లో పూర్తిస్థాయిలో విజయవంతం కాలేదు. దేశంలోనే తొలిసారిగా ఖమ్మంలో మొబైల్ యాప్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు ఎన్నికల సంఘం ఈనెల 8 నుంచి 18 వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించింది. అయితే, ఎన్నికల సంఘం అధికారులు, జిల్లా పాలనాయంత్రాంగం యాప్‌పై ఓటర్లలో అవగాహన కల్పించి రిజిస్ట్రేషన్ చేయించడంలో నిర్లక్ష్యం వహించింది. అధికారులు 10 వేల మంది ఓటర్లతో యాప్‌లో రిజిస్ట్రేషన్ చేయించాలని లక్ష్యంగా పెట్టుకోగా 38.3 శాతం మంది అంటే 3,830 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. బుధవారం నిర్వహించిన మాక్ ఈ–ఓటింగ్‌లో 2,128 మంది మాత్రమే ఓటేశారు. అంటే ఈ–ఓటింగ్ 55.56 శాతం నమోదైంది. (చదవండి: కరోనా ఎండమిక్ స్టేజ్‌కు చేరుకుంటున్నట్టేనా?) -
ఒకేసారి ఎన్నికలకు సిద్ధం
భోపాల్: శాసనసభ, లోక్‌సభ ఎన్నికలను దేశమంతా ఒకేసారి నిర్వహించేందుకు వచ్చే సెప్టెంబరుకల్లా సిద్ధంగా ఉంటామని ఎన్నికల కమిషన్ (ఈసీ) బుధవారం పేర్కొంది. అందుకు అవసరమైన పరికరాలు తమకు 2018 సెప్టెంబర్ నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాయంది. ‘లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు మీకేం కావాలని కేంద్రం అడిగింది. ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు), వీవీపీఏటీ (ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్) యంత్రాల కొనుగోలుకు నిధులు కావాలని మేం అడిగాం. నిధులు మంజూరు కావడంతో.. అవసరమైన యంత్రాలను సమకూర్చుకుని వచ్చే సెప్టెంబర్ నాటికి జమిలి ఎన్నికలకు మేం సిద్ధంగా ఉంటాం’ అని ఎన్నికల కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్ వివరించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇటీవలి ఎన్నికల్లో వీవీపీఏటీ యంత్రాలను ఉపయోగించిన విషయాన్ని రావత్ గుర్తు చేశారు. సెప్టెంబరు కల్లా తమకు 40 లక్షల వీవీపీఏటీ యంత్రాలు సమకూరుతాయని చెప్పారు. కేంద్రం నుంచి ఈసీకి వీవీపీఏటీ యంత్రాల కొనుగోలు కోసం రూ.3,400 కోట్లు, ఈవీఎంల కొనుగోలు కోసం రూ.12 వేల కోట్లు అందినట్లు ఆయన వెల్లడించారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంపై స్పందిస్తూ.. ‘దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన పరికరాలు, సాంకేతికతతో మేం సెప్టెంబరుకల్లా సిద్ధంగా ఉంటాం. అయితే అవసరమైన న్యాయపరమైన సవరణలు చేసి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలా లేదా అనే విషయంపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది’ అని చెప్పారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతోందంటూ కాంగ్రెస్, ఆప్, బీఎస్పీ సహా పలు ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేయడం, పారదర్శకత కోసం పేపర్ బ్యాలెట్‌పైనే ఎన్నికలు నిర్వహించాలని కోరడం తెలిసిందే. పేపర్ బ్యాలట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలంటూ దాదాపు 16 పార్టీలు ఎన్నికల సంఘానికి వినతిపత్రం సమర్పించిన విషయం తెలిసిందే. ఇకపై ఈవీఎంను ఉపయోగించే ప్రతి ఎన్నికలోనూ వీవీపీఏటీ యంత్రాలను కూడా వినియోగిస్తామని ఈసీ ఇటీవల ప్రకటించడం తెలిసిందే. ఓటరు ఈవీఎం ద్వారా ఓటు వేసిన వెంటనే వీవీపీఏటీ యంత్రం నుంచి ఒక కాగితం బయటకు వస్తుంది. అది వీవీపీఏటీ యంత్రానికి అనుబంధంగా ఉన్న ఒక గ్లాస్ బాక్స్‌లో పడుతుంది. ఆ కాగితంపై ఓటరు ఏ పార్టీకి ఓటు వేశాడో.. ఆ పార్టీ గుర్తు ఉంటుంది. దాన్ని ఓటరు కేవలం చూసుకోగలడు కానీ తీసుకెళ్లలేడు. ఈఆర్వో నెట్వర్క్ ఆవిష్కరణ: ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్వో) నెట్వర్క్ అనే వెబ్ అప్లికేషన్‌ను రావత్ ఆవిష్కరించారు. బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఉన్న ఎన్నికల అధికారుల సమన్వయానికి ఈఆర్వో నెట్వర్క్ ఉపకరిస్తుందనీ, నకిలీ ఓటర్లను కనిపెట్టడంలోనూ ఇది ఉపయోగపడుతుందని రావత్ చెప్పారు. పౌరులు ఓటు హక్కు కోసం కూడా ఈ వెబ్ అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రాబోయే కాలంలో ఈ–ఓటింగ్ సౌకర్యాన్నీ తెస్తామని ఆయన పేర్కొన్నారు. భద్రతాదళాల్లో ఉన్నవారి కోసం ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలెట్‌తో పాటు ఈ ఈఆర్ఓ కూడా ఆ దిశగా తీసుకున్న చర్యలేనన్నారు. ఈసీకి అందిన కేంద్ర నిధులు ఈవీఎంల కోసం రూ.12,000 కోట్లు వీవీపీఏటీ యంత్రాల కోసం రూ.3,400 కోట్లు -
వచ్చే ఎన్నికల్లో ఈ-ఓటింగ్!
ఆదోని: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో (2019లో) ఈ-ఓటింగ్ జరిగే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ చెప్పారు. కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహిస్తున్న ఓటరు కార్డుకు ఆధార్ సీడింగ్ కేంద్రాన్ని శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు మేరకు ప్రభుత్వం ఎన్ఆర్ఐలకు ఈ-ఓటింగ్ అవకాశం కల్పించే చర్యలు తీసుకుంటోందని చెప్పారు. దీన్ని స్థానిక ఓటర్లకు కూడా అమలు చేయవచ్చన్నారు. జనాభా కన్నా ఓటర్లు ఎక్కువ ఉన్నారనే ప్రచారంలో నిజం లేదన్నారు. ఆగస్టు 1న తప్పులు లేని ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని చెప్పారు. జనాభా ప్రాతిపదికన ఏపీలో అసెంబ్లీ స్థానాలను 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు పెంచాల్సి ఉన్నా.. పెంచే అధికారం ఎన్నికల సంఘానికి లేదన్నారు. దీనిపై పార్లమెంటు మాత్రమే నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. -
ఎన్నారైలకు ఈ-ఓటింగ్ హక్కు ఇవ్వాల్సిందే
విదేశాల్లో ఉంటున్న భారతీయులకు శుభవార్త. త్వరలోనే వాళ్లు తామున్న చోటు నుంచే భారతదేశంలో జరిగే ఎన్నికల్లో ఓటు వేయొచ్చు. ఎన్నికలు వస్తున్నాయని, ఓటుహక్కు వినియోగించుకోవాలని అంత దూరం నుంచి ఇక్కడకు విమానాల్లో రావాల్సిన అవసరం లేదు. 8 వారాల్లోగా ఈ-ఓటింగు హక్కును ఎన్నారైలకు అందుబాటులోకి తేవాలని కేంద్రప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. విదేశాల్లో నివాసం ఉంటూ భారతీయ పాస్‌పోర్టు కలిగి ఉన్నివారికి ఈ-బ్యాలట్ ఇచ్చేందుకు తాము ఇప్పటికే అంగీకరించామని, అవసరమైన చట్టాలను సవరించి దాన్ని అమలులోకి తెస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దాంతో వీలైనంత త్వరగానే ఈ-బ్యాలట్ ఓటింగును అమలుచేయాలని సుప్రీంకోర్టు కేంద్రానికి చెప్పింది. ప్రపంచం నలుమూలలా సుమారు 1.1 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో ఉన్నట్లు అంచనా. సుప్రీంకోర్టు ఆదేశాలతో వారందరికీ ఊరట కలిగినట్లయింది. ఈ బ్యాలట్ ఎలా.. ఈ విధానంలో ముందుగా ఓ ఖాళీ పోస్టల్ బ్యాలట్ పేపర్‌ను ఓటర్లకు ఈమెయిల్ చేస్తారు. వాల్లు దాన్ని పూర్తిచేసి, సంబంధిత నియోజకవర్గానికి పోస్టు ద్వారా పంపాల్సి ఉంటుంది. ఇందులో కొంతవరకు అక్రమాలు, రిగ్గింగ్ లేదా రహస్య ఓటింగు లేకపోవడం లాంటి ఇబ్బందులు లేకపోలేవని ఎన్నికల కమిషన్ తన నివేదికలో్ తెలిపింది. -
ప్రవాస భారతీయులకు ఈ ఓటింగ్!
న్యూఢిల్లీ: ఎన్నికల సంస్కరణలకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ప్రవాస భారతీయులకు ఈ ఓటింగ్ కల్పించాలని అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 8 వారాల్లోగా ఈ ఓటింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.