ఆదిలాబాద్ జిల్లాగా దండేపల్లి మండలం రెబ్బనపల్లి ఉన్నత, ప్రాథమిక పాఠశాలలకు రూ.3 లక్షల విలువైన సామగ్రిని వితరణ చేశారు.
దండేపల్లి(ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లాలో దండేపల్లి మండలం రెబ్బనపల్లి ఉన్నత, ప్రాథమిక పాఠశాలలకు రూ.3 లక్షల విలువైన సామగ్రిని వితరణ చేశారు. వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్, ఆసిని ఫౌండేషన్, ఎఫ్4 సంస్థలు ఈ పాఠశాలలను దత్తత తీసుకున్నాయి.
సంస్థల నిర్వాహకులు శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమలో 300 మంది పిల్లలకు నోట్‌బుక్కులు అందజేశారు. అంతేకాదు, విద్యార్థులు కూర్చునేందుకు అవసరమైన బెంచీలు తయారు చేయించి ఇచ్చారు. పాఠశాలలో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు.