note books
-
వాటర్ క్యాన్, సైకిళ్లపై తగ్గింపు షూ, వాచీలపై పెంపు
న్యూఢిల్లీ: 20 లీటర్ల వాటర్ క్యాన్, సైకిళ్లు, నోటు పుస్తకాల ధరలు తగ్గే వీలుంది. వస్తుసేవల పన్నుల(జీఎస్టీ) రేట్ల హేతుబద్ధీకరణపై ఏర్పాటైన మంత్రుల బృందం(జీఓఎం) శనివారం పలు నిర్ణయాలు తీసుకుంది. ప్యాక్చేసిన 20 లీటర్ల నీళ్ల క్యాన్, సైకిళ్లు, రాసుకునే నోటుపుస్తకాలపై జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించాలని జీఓఎం నిర్ణయించింది. ఖరీదైన చేతి గడియారాలు, షూలపై పన్నులను పెంచాలని మంత్రుల బృందం నిర్ణయించిందని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. కొన్ని వస్తువులపై పన్నులు పెంచడం ద్వారా రూ.22,000 కోట్ల ఆదాయం సమకూరవచ్చని బిహార్ ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల బృందం అంచనావేసింది. ఈ సిఫార్సులను జీఎస్టీ మంత్రిమండలి ఆమోదిస్తే సవరణల అమల్లోకి రానున్నాయి. ప్యాక్చేసిన 20 లీటర్ల నీళ్ల బాటిల్‌పై ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ వసూలుచేస్తుండగా త్వరలో అది 5 శాతానికి దిగిరానుంది. రూ.10వేలలోపు ధర ఉన్న సైకిళ్లపై ప్రస్తుతం 12 శాతం జీఎస్టీ ఉండగా దానిని 5 శాతానికి తగ్గిస్తారు. నోటు పుస్తకాలపైనా 5 శాతం జీఎస్టీనే వసూలుచేయనున్నారు. కొన్నింటి ధరలు పెరిగే వీలుంది. హెయిర్ డ్రయర్లు, హెయిర్ కర్లర్లు, బ్యూటీ/మేకప్ సామగ్రిపై ప్రస్తుతం అమలవుతున్న 18 శాతం జీఎస్టీని 28 శాతానికి పెంచనున్నారు. మంత్రుల బృందంలో ఉత్తరప్రదేశ్ ఆర్థికమంత్రి సురేశ్ ఖన్నా, రాజస్తాన్ ఆరోగ్య మంత్రి గజేంద్ర సింగ్, కర్ణాటక రెవెన్యూ మంత్రి కృష్ణ గౌడ, కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ సభ్యులుగా ఉన్నారు. 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం శ్లాబులతో జీఎస్టీని అమలుచేస్తున్నారు. నిత్యావసరాల సరకులపై తక్కువ పన్నులను, అత్యంత విలాసవంత వస్తువులపై 28 శాతం జీఎస్టీని వసూలుచేస్తుండటం తెల్సిందే. వినియోగదారులు, మార్కెట్వర్గాల నుంచి వస్తున్న అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుంటూ ఎప్పటి కప్పుడు ఆయా వస్తువులను ప్రభుత్వం వేర్వేరు శ్లాబుల్లోకి మారుస్తోంది. -
పుస్తకాలు చూస్తూనే పరీక్ష!
న్యూఢిల్లీ: పరీక్ష గదిలో విద్యార్థుల దగ్గర చీటీలు కనిపిస్తే వీపు వాయగొట్టే ఉపాధ్యాయులనే మనం చూశాం. అయితే పుస్తకాలు, నోటు పుస్తకాలు చూసుకుంటూ ఎగ్జామ్ ఎంచకా రాసుకోండర్రా అని చెప్పే విధానం ఒకదానికి పైలట్ ప్రాజెక్ట్‌గా పరీక్షించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) నిర్ణయించింది. ఈ వినూత్న ఆలోచన 2023 డిసెంబర్లోనే బోర్డ్ కార్యనిర్వాహక వర్గ సమావేశంలో చర్చకొచి్చంది. నిరీ్ణత కాలావధిలో పాఠ్యపుస్తకాలను చూస్తూనే విద్యార్థి పరీక్షగదిలో ఎంత సృజనాత్మకంగా సమాధానాలు రాబట్టగలడు, సూటిగాలేని తికమక, క్లిష్ట ప్రశ్నలకు ఎలా జవాబులు రాయగలడు, విద్యార్థి ఆలోచనా విధానం, విశ్లేషణ సామర్థ్యం వంటి వాటిని మదింపు చేసే ఉద్దేశంతో ఈ ‘ఓపెన్–బుక్ ఎగ్జామ్’ పైలట్ ప్రాజెక్టుకు సీబీఎస్ఈ పచ్చజెండా ఊపింది. అయితే ఈ పరీక్ష విధానాన్ని 10, 12 తరగతి బోర్డ్ పరీక్షలో అమలుచేసే ఆలోచన అస్సలు లేదని సీబీఎస్ఈ అధికారులు స్పష్టంచేశారు. కొన్ని ఎంపిక చేసిన పాఠశాలల్లో 9, 10వ తరగతి విద్యార్థులకు ఇంగ్లి‹Ù, గణితం, సామాన్య శా్రస్తాల్లో, 11, 12వ తరగతి విద్యార్థులకు ఇంగ్లి‹Ù, గణితం, జీవశా్రస్తాల్లో ఈ ఓపెన్–బుక్ ఎగ్జామ్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టనున్నారు. స్టడీ మెటీరియల్‌ను రిఫర్ చేస్తూనే ఇలాంటి ఎగ్జామ్ పూర్తిచేయడానికి విద్యార్థి ఎంత సమయం తీసుకుంటాడు? అనే దానితోపాటు విద్యార్థులు, టీచర్లు, సంబంధిత భాగస్వాముల అభిప్రాయాలనూ సీబీఎస్ఈ పరిగణనలోకి తీసుకోనుంది. ఫార్మాటివ్ అసెస్మెంట్(ఎఫ్ఏ), సమ్మేటివ్ అసెస్మెంట్(ఎస్ఏ)ల కోణంలో ఈ తరహా పరీక్ష అమలు తీరుతెన్నులపై సీబీఎస్ఈ ఓ నిర్ణయానికి రానుంది. -
దేశాభివృద్ధిలో విద్య, వైద్యం కీలకం
శివ్వంపేట(నర్సాపూర్) : దేశాభివృద్ధిలో విద్య, వైద్యం కీలకమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, కలెక్టర్ రాజర్షిషా అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పోతులబోగూడ గ్రామంలో మనఊరు– మన బడిని వారు ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫాం అందజేసి మాట్లాడారు. గ్రామీణ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు– మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. అదేవిధంగా దంతన్‌పల్లి గ్రామంలో మన ఊరు– మన బడి ని ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు కల్లూరి హరికృష్ణ, జడ్పీ కోఆప్షన్ మన్సూర్, ఆత్మకమిటీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్‌చారి, ఎంఈఓ బుచ్చనాయక్, సర్పంచ్‌లు హరికిషన్, దుర్గేష్, హెచ్ఎంలు రాజశేఖర్‌రెడ్డి, సత్తయ్య, బీఆర్ఎస్ నాయకులు నాగేశ్వర్రావు, హన్మంత్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, బిక్షపతిరెడ్డి, కుంట లక్ష్మణ్, శ్రీనివాస్‌గౌడ్, రాజశేఖర్‌గౌడ్ తదితరులు ఉన్నారు. పెరిగిన విద్యార్థుల సంఖ్య మెదక్‌మున్సిపాలిటీ : రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో తీసుకొచ్చిన సంస్కరణల వల్ల నేడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగిందని ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో స్థానిక ద్వారకా గార్డెన్ నందు ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవంలో జడ్పీ చైర్ పర్సన్ హేమలత శేఖర్‌గౌడ్, కలెక్టర్ రాజర్షి షాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలలో రూ.7వేల కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్‌గౌడ్ మాట్లాడుతూ మన ఊరు –మన బడి కింద పాఠశాలలో మెరుగైన వసతులు కల్పిస్తూ ఉత్తమ బోధన అందిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ జిల్లాలో ఎంపిక చేసిన 152 పాఠశాలల్లో గ్రంథాలయాలు, 88 ఉన్నత పాఠశాలల్లో ఐఎఫ్‌పీ ప్యానల్స్‌తో డిజిటల్ తరగతులు, 24 పాఠశాలల్లో రాగిజావ కార్యక్రమాలను ప్రారంభించామని తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు పంపిణి చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు చంద్ర గౌడ్, మునిసిపల్ చైర్మన్ చంద్ర పాల్, డీఈఓ రాధాకిషన్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, జిల్లా అటవీ అధికారి రవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సర్కారుబడులు.. కార్పొరేట్ హంగులు
పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు, యూనిఫామ్‌లు జిల్లాలో 6నుంచి 10వ తరగతి విద్యార్థులకు 2.57 లక్షలు నోట్‌పుస్తకాలు కేటాయించారు. జిల్లాకు 50వేలు నోట్ పుస్తకాలు చేరడంతో బెల్లంపల్లి ప్రభుత్వ పాఠశాల, దండేపల్లి మండలం మామిడిపల్లి, కోటపల్లి మండలం పారిపల్లి పాఠశాలల్లో విద్యార్థులకు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. 4,32,243 పాఠ్యపుస్తకాలు అవసరం కాగా ఇప్పటివరకు 2,81,160 పుస్తకాలు చేరాయి. జిల్లాలో 50,032 మంది వి ద్యార్థులకు అవసరమైన 2,32,750 మీటర్ల ముడి వస్త్రం చేరింది. ఇందులో 80శాతం మేర యూనిఫామ్‌లు పూర్తయిన వాటిని విద్యార్థులకు అందించనున్నారు. 149 ప్రాథమిక, మూడు ప్రాథమికోన్నత పాఠశాలల్లో లైబ్రరీలు ఏర్పాటు కానున్నాయి. మంచిర్యాలఅర్బన్: మన ఊరు–మన బడి కార్యక్రమంలో భాగంగా సర్కారు బడుల్లో కార్పొరేట్ తరహాలో ఆధునిక అందుబాటులోకి వస్తున్నాయి. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యాదినో త్సవాన్ని పురస్కరించుకుని అన్ని హంగులతో తీర్చి దిద్దిన 12పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఇ ప్పటికే 35 పాఠశాలల్లో 18 మొదలయ్యాయి. రెండు జతల యూనిఫామ్‌లు, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు అందించనున్నారు. తెలంగాణ సేట్ టెక్నోలా జికల్ సర్వీసెస్ సాయంతో ఎంపిక చేసిన పాఠశాలల్లో డిజిటల్ బోధన అమలుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఐఎఫ్ ఎస్(ఇంటరాక్టివ్ ఫ్లాట్ స్క్రీన్) టీవీల ద్వారా ఆన్లైన్, ఆఫ్‌లైన్ బోధనకు ఏర్పాట్లు చేశారు. విద్యాది నోత్సవం సందర్భంగా విద్యార్థుల ర్యాలీలు, తల్లి దండ్రులను ఉద్దేశించి ఉత్తరాల పంపిణీ, గ్రామాల్లో వీధి నాటకాలు, జాతీయ జెండా ఆవిష్కరణ, పదేళ్లలోపు పురోగతిపై ప్రసంగం, తెలంగాణలో పాఠశాల విద్య, విజన్ కార్యకలాపాలపై వివరిస్తారు. పాఠశాలలకు సేవలందించిన ముగ్గురు దాతలను సన్మానిస్తారు. 10మంది హెచ్ఎంలు, 15 మంది ఉపాధ్యాయులు, ఐదుగురు ఎస్ఎంసీ చైర్మన్, ఐదుగురు పేరెంట్స్, 12 మంది 10 జీపీఏ సాధించిన విద్యార్థులను సత్కరిస్తారు. జిల్లాలో ఇలా.. మన ఊరు–మనబడిలో 248 పాఠశాలలు ఎంపిక చేశారు. ఇందులో 31 బడులను అన్ని హంగులతో తీర్చిదిద్దగా మరో 12 మంగళవారం ఎమ్మెల్యేలు, అధికారులు ప్రారంభించనున్నారు. మందమర్రి(దీపక్‌నగర్), జైపూర్ మండలం దోరగాపల్లి, పవనూర్(హరిజనవాడ), కోటపల్లి మండలం మల్లంపేట్, పారిపల్లి హైస్కూల్, దండేపల్లి పీఎస్, ఉన్నత పాఠశాలలు, బెల్లంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఎంపీపీఎస్ నీల్వాయి, కుశ్నపల్లి, కాసిపేట మండలం సోనాపూర్, మంచిర్యాల పట్టణంలోని న్యూగర్మిళ్ల పాఠశాలలు లాంఛనంగా ప్రారంభిస్తారు. -
ఉచితంగా వర్క్‌బుక్స్, నోట్ పుస్తకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ ఏడాది నుంచి వర్క్‌బుక్స్, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను కూడా అందుబాటులోకి తేవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో విద్యా శాఖ పనితీరుపై మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 24 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి తెలిపారు. వర్క్ బుక్స్‌ను, నోటు పుస్తకాలను పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి అందజేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులందరికీ ద్విభాషా పాఠ్యపుస్తకాలను పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి అందించాలని అదేశించారు. గత సంవత్సరం పాఠ్యపుస్తకాల పంపిణీ కోసం రూ.132 కోట్లు ఖర్చు చేయగా, రానున్న విద్యా సంవత్సరంలో రూ.200 కోట్లు వెచ్చించి పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నా మని మంత్రి తెలిపారు. దాదాపు రూ.150 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులందరికీ ఒక్కొక్కరికి రెండు జతల యూనిఫామ్‌ను పాఠశాలల పునః ప్రారంభం నాటికి అందించాలని సూచించారు. ఎమ్మెల్యేల చేతుల మీదుగా పుస్తకాల పంపిణీ జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభమవుతున్నందున బడిబాట కార్యక్రమం ఏర్పాటు చేసి అందులో స్థానిక శాసనసభ్యులను, ప్రజాప్రతినిధులను భాగ్యస్వామ్యం చేయాలని మంత్రి సబిత అధికారులకు చెప్పారు. స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నోటు పుస్తకాల పంపిణీ, పాఠ్య పుస్తకాల పంపిణీ, యూనిఫామ్‌లను విద్యార్థులకు అందజేసే విధంగా కార్యక్రమాల్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతి నిధులు పాఠశాలకు హాజరయ్యే సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ఆహ్వానించాలని మంత్రి సబిత అధికారులకు సూచించారు. మన ఊరు – మనబడి కార్యక్రమంలో చేపట్టిన పనులను జూన్ మొదటి వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య సంచాలకురాలు దేవసేన తదితరులు పాల్గొన్నారు. -
నోట్‌బుక్స్‌లో 25 శాతం వాటా: ఐటీసీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నోట్‌బుక్స్ మార్కెట్ దేశంలో రూ.6,000 కోట్లుంది. ఈ రంగంలో ఐటీసీ క్లాస్‌మేట్‌కు 25 శాతం వాటా ఉందని కంపెనీ ఎడ్యుకేషన్, స్టేషనరీ ప్రొడక్టస్ బిజినెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శైలేంద్ర త్యాగి తెలిపారు. పల్స్ 3డీ నోట్‌బుక్స్‌ను విడుదల చేసిన సందర్భంగా సేల్స్ హెడ్ రవినారాయణన్‌తో కలిసి బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పరిశ్రమ వృద్ధి రేటు ఏటా 4–5 శాతముంది. క్లాస్మేట్ రెండంకెల వృద్ధి నమోదు చేస్తోంది. ఏటా 38 కోట్ల నోట్‌బుక్స్ అమ్ముతున్నాం. కంపెనీ మొత్తం ఉత్పత్తిలో భద్రాచలం యూనిట్ 60 శాతం సమకూరుస్తోంది’ అని వివరించారు. -
ప్రభుత్వ విద్యార్థులకు జేఎన్టీయూ నోట్‌బుక్స్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు ఉచిత నోటుబుక్స్ ను జేఎన్టీయూహెచ్ (జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్) పంపిణీ చేయనుంది. తమ ఎన్ఎస్ఎస్ విభాగం ద్వారా సుమారు లక్ష నోట్‌బుక్స్ పంపిణీకి ఏర్పాట్లు చేసింది. వర్సిటీ నిర్వహించే సెమిస్టర్ పరీక్షలకు హాజరైన వారి జవాబు పత్రాలు, గైర్హాజరైన వారి జవాబు పత్రాలను మూల్యాంకనం తర్వాత ధ్వంసం చేసేవారు. ఈ ఏడాది అందుకు భిన్నంగా జవాబు పత్రాలు వృథా కాకూడదనే ఉద్ధేశంతో వర్సిటీ అధికారులు ప్రణాళిక రూపొందించారు. మూడేళ్లుగా గైర్హాజరైన వారి జవాబు పత్రాలతో తయారు చేసిన లక్ష నోటు పుస్తకాలను ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ర్థులకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పుస్తకాల్లో టెన్త్ తర్వాత విద్యార్థులకు దిశానిర్దేశం చేసే సమాచారం, వర్సిటీ నిర్వహిస్తోన్న సాంకేతిక విద్యా విభాగాల సమాచారం పొందుపరిచినట్లు జేఎన్టీయూహెచ్ తెలిపింది. రెండేళ్ల నిబంధనను పట్టించుకోవటం లేదు సాక్షి, హైదరాబాద్: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల బోధన సిబ్బం ది బదిలీల్లో ఉన్నతాధికారులు ‘రెండేళ్ల’ నిబంధనలను పట్టించుకోవటం లేదని టీచర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ గురుకుల పాఠశాలల సొసైటీ పరిధిలో టీచర్ల బదిలీల కౌన్సెలింగ్ సోమవారం ప్రారంభమైంది. సోమవారం జోన్ 5, జోన్ 6 పరిధిలోని ప్రిన్సిపాళ్ల ట్రాన్స్ఫర్ కౌన్సెలింగ్ నిర్వహించగా... మంగళవారం జోన్ 5 పరిధిలోని టీచర్లకు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందులో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన ప్రిన్సిపా ళ్లు, టీచర్లకు మాత్రమే అవకాశం కల్పించారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకేచోట రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగి బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొన్నా, ఎస్సీ గురుకుల సొసైటీలో ఐదేళ్లు నిండిన వారికే అవకాశం కల్పించారని వారు ఆరోపిస్తున్నారు. గురువారం జోన్ 6 పరిధిలోని టీచర్లకు కౌన్సెలింగ్ జరుగనుంది. -
నోట్ పుస్తకాల్లోనూ నొక్కుడే!
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందించే నోట్ పుస్తకాల సరఫరాలో భారీగా అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. 40 ఏళ్లుగా నోట్ పుస్తకాలను సరఫరా చేస్తున్న ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్‌ను ప్రభుత్వ పెద్దలు పక్కన పెట్టారు. తమకు బాగా కావాల్సిన ప్రైవేట్ సంస్థకు ఈ కాంట్రాక్టు కట్టబెట్టేలా టెండర్ నిబంధనలు రూపొందించారు. కమీషన్ల కోసమే ప్రైవేట్ సంస్థపై మమకారం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో రూ.40 కోట్లు కొల్లగొట్టేందుకు ప్రభుత్వ పెద్దలుపథకం వేసినట్లు సమాచారం. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 1,37,943 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రీ మెట్రిక్ హాస్టళ్లలో 1,72,849 మంది, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో 52,454 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 3,63,246 మంది ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అంతేకాకుండా కస్తూర్బా గాంధీ గురుకుల విద్యాలయాలు, ఏకలవ్య గురుకుల విద్యాలయాల్లోనూ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 4 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు వివిధ హాస్టళ్లలో ఉంటూ చదువు కొనసాగిస్తున్నారు. వీరికోసం 2018–19 విద్యా సంవత్సరానికి 70,69,287 నోట్ పుస్తకాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఏప్రిల్ 10న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 25లోగా టెండర్లు దాఖలు చేయొచ్చని సూచించింది. తరువాత ఈ గడువును ఏప్రిల్ 30 వరకూ పొడిగించింది. ఫైనాన్షియల్ బిడ్‌ను అదేరోజు నిర్ణయిస్తామని ప్రకటించింది. హైకోర్టు ఆదేశం నోట్ పుస్తకాల సరఫరా టెండర్‌ను ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విజయవాడకు చెందిన బాలా ఎంటర్ప్రైజెస్ ప్రొప్రైటర్ సీహెచ్ బాలయ్య హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. టెండర్ ప్రక్రియను కొనసాగించినా తాము ఆదేశించే వరకూ టెండర్లను ఖరారు చేయొద్దని హైకోర్టు ఏప్రిల్ 24న ఆదేశాలు జారీ చేసింది. గ్రాఫిక్ కంపెనీకే టెండర్! పేరుకు టెండర్లు పిలిచినప్పటికీ తమకు కావాల్సిన వారికే కాంట్రాక్టు కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు ఏర్పాట్లు చేశారు. చిన్నచిన్న ట్రేడింగ్ కంపెనీలు టెండర్లలో పాల్గొనేందుకు వీల్లేకుండా కఠిన నిబంధన విధించారు. ఈ టెండర్లలో పాల్గొనాలంటే గత ఐదేళ్లలో రూ.20 కోట్ల విలువైన లావాదేవీలు జరిపి ఉండాలని పేర్కొన్నారు. చిన్న పరిశ్రమలను ప్రోత్సహిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఇలాంటి నిబంధన విధించడం ఏమిటని పలువురు ట్రేడర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ సమీపంలోని పునాదిపాడు వద్ద ఉన్న ఒక గ్రాఫిక్ కంపెనీకి ఈ టెండర్లు కట్టబెట్టాలని ముందే నిర్ణయించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ
తుర్కపల్లి (రామన్నపేట) : మండలంలోని సూరారం గ్రామపంచాయతీ ఆవాసగ్రామాల్లో రెండునెలల్లోగా ఇంటింటికీ మిషన్‌భగీరథ పథకం కింద కృష్ణాజలాలు అందిస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. ఆదివారం సూరారం పరిధిలోని బి.తుర్కపల్లి ప్రాథమికపాఠశాల విద్యార్థులకు అరుంధతీ మేధావుల సంఘంవారు సమకూర్చిన నోట్‌పుస్తకాలను పంపిణీచేసి మాట్లాడారు. ప్రభుత్వపాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వంతోపాటు, స్వచ్ఛందసంస్థలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కక్కిరేణి ఎల్లమ్మ, జెడ్పీటీసీ జినుకల వసంత, ఎంపీటీసీ చల్లా వెంకట్‌రెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ బొక్క పురుషోత్తంరెడ్డి, అరుంధతీ సంఘం అధ్యక్షుడు గుండ్లపల్లి నరహరి, కార్యదర్శి ఎన్.కృష్ణ, కోశాధికారి బి.చంద్రకాంత్, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంపెల్లి భిక్షపతి, బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ బి.సుదర్శన్, జినుకల ప్రభాకర్, విజయ్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. -
విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ
చౌటుప్పల్: మండలంలోని తంగడపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో శుక్రవారం హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త సంకా మోహనకృష్ణమూర్తి తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్సిల్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. శాస్త్రవేత్తలుగా, ఇంజినీర్లుగా, డాక్టర్లుగా ఎదిగి, సమాజానికి సేవ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు బి.రవీందర్, ఎ.నాగయ్య, మోటె సత్తయ్య, మాధవరెడ్డి, శ్రీరాములు, మోహన్‌రావు, ముర ళీమోహన్, మంజుల తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు నోట్‌పుస్తకాల పంపిణీ
చౌటుప్పల్: మండలంలోని తాళ్లసింగారంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బుధవారం నార్మ్ ఆధ్వర్యంలో నోట్‌పుస్తకాలు, పలకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నార్మ్ కో–ఆర్డినేటర్ డాక్టర్ సంధ్యాసెనాయ్ మాట్లాడారు. విద్యార్థులు చక్కగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. నార్మ్ ద్వారా అవసరమైన సహాయ, సహకారాలను అందిస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సుర్వి నర్సింహగౌడ్, డాక్టర్ వీకేజే.రావు, ప్రధానోపాధ్యాయుడు హర్షవర్ధన్‌రెడ్డి, అనుపమ, సమత, జంపాల కృష్ణ, సుక్క అమృత, మార్క్, లక్ష్మయ్య, వెంకటేశం పాల్గొన్నారు. -
విద్యార్థులకు నోటుపుస్తకాలు, స్టేషనరీ పంపిణీ
హుజూర్నగర్ : పట్టణంలోని అంబేద్కర్‌నగర్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం దళిత మహిళా సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు చెవుల కవిత 60 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు, స్టేషనరీ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు దాతల ప్రోత్సహకాలను సద్వినియోగం చేసుకొని విద్యలో రాణించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ లక్పతినాయక్, హెచ్ఎం భాస్కర్ రెడ్డి, ఉపాధ్యాయులు రామ్మూర్తి, నర్సింహారావు, సీహెచ్.రత్తయ్య, టీఆర్ఎస్ మహిళా నాయకురాలు గోపు చెలీనమ్మ, భవాని, రమ్య, చంద్రకళ, విద్యార్థులు పాల్గొన్నారు. -
పాఠశాలకు ఎన్నారైల వితరణ
దండేపల్లి(ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లాలో దండేపల్లి మండలం రెబ్బనపల్లి ఉన్నత, ప్రాథమిక పాఠశాలలకు రూ.3 లక్షల విలువైన సామగ్రిని వితరణ చేశారు. వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్, ఆసిని ఫౌండేషన్, ఎఫ్4 సంస్థలు ఈ పాఠశాలలను దత్తత తీసుకున్నాయి. సంస్థల నిర్వాహకులు శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమలో 300 మంది పిల్లలకు నోట్‌బుక్కులు అందజేశారు. అంతేకాదు, విద్యార్థులు కూర్చునేందుకు అవసరమైన బెంచీలు తయారు చేయించి ఇచ్చారు. పాఠశాలలో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. -
చదివేదెలా?
మార్కాపురం: సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం మానేసింది. విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు రెండు నెలలు కావస్తున్నా..నేటికీ వారికి అవసరమైన నోట్‌పుస్తకాలు, యూనిఫాంలు, ట్రంకుపెట్టెలు పంపిణీ చేయలేదు. జిల్లాలోని మార్కాపురం, కందుకూరు, ఒంగోలు డివిజన్లలో 77 బీసీ హాస్టళ్లు, 117 ఎస్సీ హాస్టళ్లు ఉన్నాయి. మొత్తం మీద 16 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎస్సీ, బీసీ హాస్టల్ విద్యార్థులందరికీ ఇంత వరకు నోట్ పుస్తకాలు పంపిణీ చేయలేదు. దీంతో బయట పుస్తకాలు కొనుగోలు చేసి విద్యార్థులు చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీసీ హాస్టల్ విద్యార్థులకు కాస్మొటిక్ చార్జీలు కూడా ఆగిపోయాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో బీసీ సంక్షేమ శాఖ నోట్ పుస్తకాలను జిల్లాకు పంపలేదు. మూడు నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులకు మూడు పెద్ద నోట్ పుస్తకాలు, మూడు చిన్న నోట్ పుస్తకాలు, 6 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు 12 నోట్ పుస్తకాలు అందిస్తారు. ఈ ఏడాది పాఠ్య పుస్తకాల సిలబస్ మారడంతో నోట్సు రాసుకోవడం విద్యార్థులకు తప్పనిసరైంది. సైన్స్, మ్యాథ్స్, సోషల్, తెలుగు ఉపాధ్యాయులు ప్రతి పాఠ్యాంశానికి నోట్సు ఇస్తుంటారు. ప్రభుత్వం నుంచి నోట్ పుస్తకాలు అందక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులకు యూనిఫాంలు, ఇంటి నుంచి తెచ్చుకున్న సామగ్రిని పెట్టుకునే ట్రంకుపెట్టెలు సైతం హాస్టల్ విద్యార్థులకు అందించలేదు. వారం రోజుల్లో రావచ్చు బి.నరసింహారావు,బీసీ సహాయ సంక్షేమ అధికారి, మార్కాపురం రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇంత వరకు జిల్లాలోని విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన నోట్ పుస్తకాలు, యూనిఫాం రాలేదు. వారం రోజుల్లో విద్యార్థులకు ఇవ్వాల్సిన సామగ్రి వచ్చే అవకాశం ఉంది. రాగానే పంపిణీ చేస్తాం. -
‘నోటు బుక్స్’ పాట్లు!
పరిగి: పాఠశాలలు పునఃప్రారంభమై నెలరోజులు దాటినా బీసీ సంక్షేమ శాఖ అధికారులు నిద్రమత్తు వీడటంలేదు. ఈ విద్యా సంవత్సరానికి ముందు వేసవి సెలవుల్లోనే పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు అందజేసిన అధికారులు హాస్టల్ విద్యార్థులకు నోటు పుస్తకాలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమై నెలరోజులు దాటడంతో ఓ పక్క విద్యార్థులపై ఉపాధ్యాయుల ఒత్తిడి పెరుగుతోంది. దీంతో చేసేదేమీ లేక విద్యార్థులు తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారు. తప్పని పరిస్థితిలో ఒకటి రెండు నోటు పుస్తకాలు తల్లిదండ్రులతో కొనిపించుకుని అన్ని సబ్జెక్టులు అందులోనే రాస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో ఇప్పటికే నోటు పుస్తకాలు అందివ్వగా ఒక్క బీసీ వెల్ఫేర్ హాస్టళ్లలో మాత్రమే నోటు పుస్తకాలు ఇవ్వకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇదేమని అధికారులను అడిగితే.. తెలంగాణ ఎంబ్లం(గుర్తు)తో కూడిన నోటు పుస్తకాలు ముద్రిస్తున్నాం.. అందుకే ఆలస్యమవుతోందని కారణం చెబుతూ దాటవేస్తున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో 47 బీసీ సంక్షేమ వసతి గృహాలున్నాయి. వీటిలో 4,200 విద్యార్థులు ఉంటున్నారు. ఇప్పటివరకూ ఓ ఒక్క హాస్టల్లోనూ నోటు పుస్తకాలు ఇవ్వలేదు. 9, 10 తరగతులకు 12 లాంగ్ నోటు బుక్స్ (200 పేజీలు) 7, 8 తరగతులకు ఆరు చిన్నవి, ఆరు పెద్దవి నోట్సు, 5, 6 తరగతులకు ఆరు పెద్దవి, మూడు చిన్నవి మొత్తం తొమ్మిది నోటు పుస్తకాలు ఇప్పటి వరకు ఇస్తూ వస్తున్నారు. ఈ లెక్కన జిల్లాలో మొత్తం 50 వేల నోటు పుస్తకాలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సిలబస్ మారిన నేపథ్యంలో పాఠశాలల్లో గైడ్లు పూర్తిగా నిషేధించారు. ప్రతి సబ్జెక్టుకు క్లాస్‌రూం రన్నింగ్ నోట్సుతోపాటు ఫెయిర్ నోటు పుస్తకాలు అవసరం. దీంతో విద్యార్థులకు గతంలో ఇచ్చే నోటు పుస్తకాలకంటే ఇప్పుడు పెంచాల్సి ఉంటుందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. మరో వారం రోజులు ఆగాల్సిందే ఇప్పటికే పాఠశాలలు పునఃప్రారంభమై నెల రోజులు దాటగా మరో వారం రోజులకుగాని నోటుపుస్తకాలు రావని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో బీసీ సంక్షేమ వసతిగృహాల్లో చదువుతున్న విద్యార్థులు కొంచెం అటూ ఇటూగా నెల పదిహేను రోజుల నుంచీ నోటు పుస్తకాలు లేకుండానే కాలం వెల్లదీస్తున్నారు. నెల రోజులకు సంబంధించిన సిలబస్‌ను ఒకేసారి రాయాల్సి వస్తుందని.. దీంతో విద్యార్థులు చదువుపై ధ్యాస మరిచి రాయటంపైనే దృష్టిపెట్టాల్సి వస్తుందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా వెంటనే నోటు పుస్తకాలు అందజేయాలని అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు పేర్కొంటున్నారు. ఈ విషయమై బీసీ సంక్షేమ శాఖ జిల్లా జాయింట్ డెరైక్టర్ రమణారెడ్డిని వివరణ కోరగా.. మరో వారం రోజుల్లో నోటు పుస్తకాలు అందేలా చూస్తామని తెలిపారు. -
Hetero admirable social service
పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత 5 వేల మంది విద్యార్థులకు స్కూలు బ్యాగులు పోలీస్ శాఖ నిర్మాణానికి సంస్థ అంగీకారం నక్కపల్లి : మండలంలో విద్య, వైద్య, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు హెటెరో యాజమాన్యం చేస్తున్న కృషి ప్రశంసనీయమని పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత అన్నారు. మండలంలోని 23 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదివే సుమారు 5వేల మంది విద్యార్థులకు సోమవారం హెటోరో సంస్థ ఉచితంగా స్కూలు బ్యాగులు, నోట్ పుస్తకాలు, స్టేషనరీ సామగ్రిని పంపిణీ చేసింది. నక్కపల్లి ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో అనిత మాట్లాడుతూ హెటెరో సంస్థతో సామరస్యపూర్వకంగా వ్యవహరిస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామిని చేయాలని ప్రజలకు, వివిధ పార్టీల నేతలకు సూచించారు. నక్కపల్లికి మంజూరైన సర్కిల్ పోలీస్‌స్టేషన్ భవనాల నిర్మాణానికి నిధుల్లేక జాప్యం జరుగుతోందని తెలుసుకున్న హెటెరో యాజమాన్యం భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు రావడం గర్వకారణమన్నారు. నక్కపల్లి ఉన్నత పాఠశాలలో శిథిల భవనాల స్థానంలో అదనపు తరగతి గదులను నిర్మించి వసతి సమస్యను పరిష్కరించాలని, మండల ప్రజల వైద్య అవసరాలకు ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సంస్థతో పరస్పర సహకార ధోరణితో వ్యవహరిస్తామని, ఉద్యోగ ఉపాధి అవకాశాల విషయంలో ఒత్తిళ్లు ఉండవని స్పష్టం చేశారు. సంస్థ డెరక్టర్(ఫైనాన్స్) భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ మండలంలో కంటి వ్యాధులతో బాధపడే వారి కోసం ప్రత్యేకంగా కంటిచూపు పేరుతో కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి శ్రస్త్రచికిత్స చేయిస్తామని తెలిపారు. అవసరమైతే వారికి నిరంతర వైద్యసేవలు అందించేందుకు ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని సంస్థ చైర్మన్ పార్థసారధి రెడ్డి భావిస్తున్నట్లు తెలిపారు. ఏటా యలమంచిలి డివిజన్ పరిధిలో పదోతరగతి చదువుతున్న 2వేలమంది విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్, సంస్థ పరిసర ప్రాంత గ్రామాల విద్యార్థులకు స్కూలు బ్యాగులు పంపిణీ చేస్తున్నామన్నారు. ఆలయాల నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తున్నామని, పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు. వేంపాడు, ఉపమాక, నక్కపల్లి గ్రామాల్లో ప్రజల తాగునీటి అవసరాల కోసం మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసామన్నారు. జిల్లా ఉప విద్యాశాఖాదికారి లింగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో హెటెరో సంస్థ దయతో ఎంతో మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసిస్తున్నారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వీసం వెంకటలక్ష్మి, తహశీల్దార్ జగన్నాథరావు, ఎంపీడీవో కృష్ణ, ఎంఈవో ప్రభాకర్, ప్రధానోపాధ్యాయుడు నూకరాజు, డీజీఎం గోపాలకృష్ణారెడ్డి, ప్రతినిధులు మురళి, రజనీకాంత్, సుబ్బారెడ్డి,పార్థసారధి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నోట్ బుక్కులేవీ!
ఇందూరు : ముందుచూపు లేని అధికారులు.. పట్టింపులేని ప్రభుత్వం.. వెరసి సంక్షేమ వసతిగృహాల విద్యార్థులకు శాపంగా మారింది. విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు నెల కావస్తున్నా, విద్యార్థులకు అందించాల్సిన సామగ్రి, వస్తువులు జిల్లాకు ఇంకా పూర్తిస్థాయిలో సరఫరా కాలేదు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. నోటుబుక్కులు సరఫరా కాక పోవడంతో పాఠ్యాంశాల నమోదుకు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నోట్బుక్కుల సరఫరా విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఏటా సంక్షే మ శాఖ అధికారులు ప్రస్తుతం ఉంటున్న విద్యార్థుల తో కలిపి కొత్తగా ప్రవేశం పొందే విద్యార్థుల సంఖ్య ను అంచనా వేసి రాష్ర్ట ఉన్నతాధికారులకు నివేదిక పంపుతారు. ఈ నివే దికను వసతిగృహాలు ప్రారంభం కాక ముందు పంపుతారు. కాని ఈ ఏడాది ముందస్తుగా నివే దికను పంపక పోవడంతో అసలుకే ఎసరు వచ్చిపడింది. పాత, కొత్త విద్యార్థుల సంఖ్యను ఆల స్యంగా పైస్థాయి అధికారులకు పంపడం, ఇటు ప్ర భుత్వం ఆలస్యంగా బైండింగ్ చేయడంతో జిల్లాకు కావాల్సిన నోట్‌బుక్కులు ఇంత వరకు రాలేదు. దీంతో పాఠశాలలకు వెళ్లిన విద్యార్థులు తమ తరగతి గదిలో ఉపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాలను నోట్బుక్లు లేక నోట్ చేసుకోవడం లేదు. జిల్లాలో... జిల్లాలో ఎస్సీ 67 వసతిగృహాలు, ఎస్టీ 13 వసతిగృహాలు, బీసీ 60 వసతిగృహాలు ఉన్నాయి. అందులో ఐదు నుంచి పదో తరగతి, ఇంటర్ వరకు విద్యార్థులు వసతి పొందుతున్నారు. అయితే ఎస్సీ వసతి గృహాల్లో పాత విద్యార్థులు 4,200 మంది, ఎస్టీ వసతిగృహాల్లో 1,531, బీసీ వసతి గృహాల్లో 3,000 వేల మంది మొత్తం కలిపి 8,731 మంది విద్యార్థులు ఉన్నారు. కాగా ప్రసుత్తం కొత్త విద్యార్థులను చేర్పించడానికి వార్డెన్లు, మహిళా సంఘాలు ప్రయత్నాలు చేస్తున్నారు. పాత, కొత్త విద్యార్థులకు ఒకేసారి నోట్‌బుక్కులు అందజేయాల్సి ఉంటుంది. పదో తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి 18, ఎనిమిది తరగతి వారికి ఒక్కొక్కరికి 16, మిగతా తరగతుల వారికి కేటాయించిన విధంగా నోట్బుక్కులను ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్సీ విద్యార్థులకు ప్రస్తుతానికి సగం నోట్బుక్కులను మాత్రమే పంపిణీ చేసిన ప్రభుత్వం, ఎస్టీ, బీసీ సంక్షేమ విద్యార్థులకు ఇంత వరకు పంపలేదు. పంచేదెలా..? ఎస్సీ సంక్షేమ వసతిగృహాల విద్యార్థుల కోసం ప్రభుత్వం సగం నోట్బుక్కులను జిల్లాకు పంపింది. ఇవి పాత విద్యార్థుల్లో సగం మందికే సరిపోతాయి. మిగతా వారితో పాటు కొత్తగా వచ్చిన విద్యార్థులకు ఎక్కడి నుంచి అందించాలోనని సంక్షేమ శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. కొందరికి ఇచ్చి, మరికొందరికి ఇవ్వకుంటే బాగుండదని సమాలోచనలు చేస్తున్నారు. తమ హాస్టల్ విద్యార్థుల కే ముందుగా ఇవ్వాలంటూ వార్డెన్లు నోట్బుక్కుల కోసం పోటీ పడుతున్నారు. దీంతో వచ్చిన కాస్త నోట్బుక్కులను ఎవరికీ పంచకుండా అధికారులు అలాగే పెట్టేశారు. మొత్తం నోట్‌బుక్కులు వచ్చిన తర్వాతనే అందరికి పంపిణీ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. కొత్త నోట్‌బుక్కులు రాక కొందరు విద్యార్థులు పాత నోట్బుక్కులపైనే పాఠ్యాంశాలు రాయడం, మరి కొందరేమో కొత్తవి డబ్బులకు కొనుక్కుని రాయడం లాంటివి చేస్తున్నారు. నోట్‌బుక్కులు రావాలంటే మరో వారం పది రోజులు పట్టవచ్చని సంక్షేమ అధికారులు పేర్కొంటున్నారు. అప్పటి వరకు విద్యార్థులకు ఈ బాధ తప్పేలా లేదు. జాడలేని యూనిఫాం క్లాత్... నోట్బుక్కుల విషయం ఇలా ఉంటే, విద్యార్థులకు ఏడాదికి అందించాల్సిన రెండు జతల యూనిఫాంలకు అవసరమైన క్లాత్(బట్ట) ఇంత వరకు జిల్లాకు రాలేదు. దీంతో వసతి గృహ విద్యార్థులు యూనిఫాంలు లేక రంగుల బట్టలు వేసుకుంటున్నారు. మరికొందరు పాత యూనిఫామ్స్ వేసుకుని బడికి వెలుతున్నారు. జిల్లాలో అన్ని వసతిగృహాలు కలిపి మొత్తం 12 వేల మంది విద్యార్థులు యూనిఫాంలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం క్లాత్ పంపించి, పిల్లల కొలతలు తీసుకుని కుట్టించే సరికి మరో నెలన్నర రోజులు పట్టేలా ఉంది. అంత వరకు విద్యార్థులు రంగులు దుస్తులు, పాత చిరిగిపోయిన యూనిఫామ్స్ వేసుకోవడం తప్పేలా లేదు. ట్రంకు పెట్టెలు పాతవే... ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతిగృహాల్లో ఉంటున్న విద్యార్థులు డొక్కు ట్రంకు పెట్టెలతోనే నెట్టుకొస్తున్నారు. హాస్టళ్ల విద్యార్థులకు ఐదేళ్ల క్రితం ట్రంకు పెట్టెలను సరఫరా చేశారు. అవి పూర్తిగా పాడైపోయాయని, వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేయడానికి నిధులివ్వాలని ఆయా శాఖల సంక్షేమ శాఖ అధికారులు ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ పట్టించుకోవడంలేదు. ఇక కొత్తగా ప్రవేశాలు పొందిన వారికి ట్రంకు పెట్టెలు ఇంత వరకు ఇవ్వలేదు. -
అడ్రస్ లేదు!
నోట్ దిస్ పాయింట్ పాఠశాలలు ప్రారంభమై పది రోజులు దాటినా అందని నోట్ పుస్తకాలు అతీగతీ లేని యూనిఫాం చిరిగిన దుస్తులు, ఖాళీ బ్యాగులతో వెళ్తున్న వైనం ఇదీ జిల్లాలోని హాస్టల్ విద్యార్థుల దుస్థితి అనంతపురం ఎడ్యుకేషన్ : పాఠశాలలు పునఃప్రారంభమై పది రోజులు దాటింది. అయితే నేటికీ హాస్టల్ విద్యార్థులకు నోట్ పుస్తకాలు, యూనీఫాం అందలేదు. ఫలితంగా విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 234 ప్రభుత్వ హాస్టళ్లు ఉన్నాయి. 126 సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో 12,600 మంది, 91 బీసీ హాస్టళ్లలో 14,200 మంది, 18 ఎస్టీ హాస్టళ్లలో రెండు వేల మంది 1-10 తరగతుల విద్యార్థులు ఉన్నారు. వీరికి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే నోట్ పుస్తకాలతో పాటు నాలుగు జతల యూనిఫాం పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పటిదాకా ఒక్క శాఖ కూడా యూనిఫాం అందజేయలేదు. ఇక నోట్ పుస్తకాలు లేక విద్యార్థులు ఖాళీ బ్యాగులతో పాఠశాలలకు వెళ్తున్నారు. ఉపాధ్యాయులు పాఠాలు చెప్పే సమయంలో దిక్కులు చూస్తున్నారు. బీసీ హాస్టళ్లకు ఒక్క నోట్ బుక్కూ రాలేదు 9,10 తరగతుల విద్యార్థులకు 192 పేజీల లాంగ్ నోట్‌బుక్కులు 12 ఇవ్వాల్సి ఉంది. 7,8 తరగతులకు 96 పేజీలు కల్గిన ఆరు (చిన్నవి), 192 పేజీలు కల్గిన ఆరు (పెద్దవి) నోట్‌పుస్తకాలు ఇవ్వాలి. ఆరో తరగతికి చిన్నవి ఆరు, పెద్ద పుస్తకాలు మూడు, 3-5 తరగతుల విద్యార్థులకు చిన్న పుస్తకాలు ఐదు ఇవ్వాలి. బీసీ సంక్షేమ శాఖకు సంబంధించి ఈ విద్యా సంవత్సరం 13,395 మంది విద్యార్థులకు 46,601 చిన్న పుస్తకాలు, 99,027 పెద్ద పుస్తకాలు అవసరమని ప్రతిపాదనలు పంపారు. ఇప్పటిదాకా ఒక్క పుస్తకమూ రాలేదు. ఇక సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు సంబంధించిన నోట్ పుస్తకాలు డీడీ కార్యాలయానికి చేరినా.. వాటిని ఇంకా హాస్టళ్లకు పంపలేదు. పిల్లల చేతికి అందడానికి ఇంకొన్ని రోజులు పట్టే అవకాశముంది. గిరిజన సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులకు నోట్‌పుస్తకాలు అందజేశామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. సిద్ధం కాని దుస్తులు వాస్తవానికి పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికే దుస్తులు సిద్ధంగా ఉండాలి. తొలిరోజే విద్యార్థులకు పంపిణీ చేయాలి. అయితే, ఇప్పటిదాకా కనీసం జత కూడా అందజేయలేదు. మరీ ఘోరమేమిటంటే బీసీ హాస్టళ్ల విద్యార్థులకు సంబంధించి జిల్లాకు క్లాత్‌కూడా చేరలేదు. ఎస్సీ హాస్టళ్ల విద్యార్థులకు మాత్రం రెండు జతలకు సరిపడా క్లాత్ వచ్చింది. మరో రెండు జతల క్లాత్ రావాల్సి ఉంది. ప్రస్తుతం వచ్చిన క్లాత్‌తో యూనిఫాం కుట్టే పనిలో ఉన్నారు. గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో చదువుకుంటున్న రెండు వేల మంది విద్యార్థులకు గాను ఇప్పటిదాకా 1,400 మందికి సరిపడా క్లాత్ వచ్చింది. స్టిచ్చింగ్ పూర్తయి విద్యార్థులకు చేరేలోపు మరో 15 రోజుల పైనే పడుతుంది. బీసీ హాస్టళ్ల విద్యార్థులకు మాత్రం మరో రెండునెలల దాకా యూనిఫాం అందే పరిస్థితులు కనిపించడం లేదు. గోడౌన్లో మూలుగుతున్న బెడ్షీట్లు అన్ని శాఖలకు సంబంధించి బెడ్షీట్లు జిల్లాకు చేరాయి. బీసీ విద్యార్థుల బెడ్షీట్లు మాత్రం గోడౌన్లోనే మూలుగుతున్నాయి. హాస్టళ్లకు ఎప్పుడు చేరవేస్తారో అధికారులకే తెలియాలి. ఎస్సీ హాస్టళ్లకు సంబంధించి కొన్నింటికి చేరగా.. మరికొన్నింటికి ఇప్పటికీ అందలేదు. గిరిజన హాస్టళ్లకు పూర్తి స్థాయిలో పంపిణీ చేశామని అధికారులు చెబుతున్నారు. నెలకుపైగా పట్టొచ్చు బీసీ హాస్టళ్లకు సంబంధించి ప్రతియేటా జూలై ఆఖరులోగా క్లాత్ వస్తుంది. ఈ విషయమై రాష్ట్ర అధికారులతోను, జిల్లా కలెక్టరుతోను మాట్లాడాం. క్లాత్ వచ్చి.. స్టిచ్చింగ్ చేయించి పిల్లలకు పంపిణీ చేయాలంటే మరో నెల పడుతుంది. ఇక నోట్ పుస్తకాలు రావడానికి మరోవారం పట్టొచ్చు. - ఉమాదేవి, బీసీ సంక్షేమ శాఖ ఉప సంచాలకులు -
లక్షలు విదిలిస్తేనే అక్షరాలు
ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీ టెక్నో పేరిట వేలకు వేలు వసూళ్లు విలవిల్లాడుతున్న మధ్య తరగతి తల్లిదండ్రులు కానరాని ప్రభుత్వ నియంత్రణ నక్కపల్లి: పేద మధ్య తరగతి తల్లిదండ్రుల ఆశలను ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తమకు అనుకూలంగా మార్చుకుం టున్నాయి. పుస్తకాలు, ఫీజుల పేరుతో వేలకు వేలు గుంజుతున్నాయి. ఎల్కేజీ విద్యార్థుల పుస్తకాల కోసం రూ.2 వేలు, ఫీజుల నిమిత్తం రూ.20 వేలు, బస్సు చార్జీల రూపేణా మరో రూ.6 వేలు, ప్రాజె క్టు పనుల కోసం మరో రూ.2 వేలు... ఇలా వేలకు వేలు గుంజుతున్నా పట్టించుకున్న నాధుడే లేడని మధ్య తరగతి వర్గాలు వాపోతున్నాయి. మా దగ్గరే కొనాలి పాయకరావుపేట, తుని పట్టణాల్లోని ప్రధాన కార్పొరేట్ విద్యాసంస్థలు వసూలు చేస్తున్న ఫీజులు, విక్రయించే పుస్తకాల ధరలు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. యాజమాన్యాలే టెక్నో పేరుతో సిలబస్ తయారు చేసి వాటి పుస్తకాలను తమవద్దే కొనుగోలు చేయాలని షరతు విధిస్తున్నారు. పాఠ్యపుస్తకాలు, స్టడీ మెటీరియల్, నోట్ పుస్తకాలు, ఎక్జామ్ ప్యాడ్స్, డైరీ, ఫైళ్లు పేరుతో ప్యాకేజీ నిర్ణయించి వేలాది రూపాయలు గుంజుతున్నారు. పాఠ్యపుస్తకాలు, స్టడీమెటీరియల్ పాఠశాలలో, నోట్ పుస్తకాలను బయట కొనుక్కుంటామంటే యాజమాన్యాలు ఒప్పుకోవడం లేదు. పాయకరావుపేట పట్టణంలోని ఓ కార్పొరేట్ విద్యాసంస్థ పాఠ్య పుస్తకాల కోసం ఎల్కేజీకి రూ.1907, యూకేజీకి రూ.2268, ఒకటో తరగతికి రూ.3047 వసూలు చేస్తోంది. అయిదో తరగతి విద్యార్థికి రూ.4200 పైనే అవుతోంది. ఎనిమిదో తరగతి విద్యార్థికి రూ.3830, తొమ్మిదో తరగతి విద్యార్థికి రూ.3900 వసూలు చేసి పుస్తకాలను సరఫరా చేస్తున్నారు. ఫీజుల రూపేణా ఎల్కేజీ విద్యార్థికి రూ.15000, బస్సు చార్జీలుగా కిలోమీటర్ల బట్టి రూ.4 వేల నుంచి రూ.6 వేలు వసూలు చేస్తున్నారు. అయిదో తరగతి, ఆపై చదివే విద్యార్థులకు రూ.19 వేల నుంచి రూ.23 వేల వరకు, బస్సు చార్జీల కింద రూ.5 వేలు వసూలు చేస్తున్నారు. ఇవిగాక ప్రాజెక్టుల కోసం ఏడాదికి మరో రూ.3 వేల నుంచి రూ.4 వేలు దండుకుంటారు. ఈ పాఠశాలలో అయిదో తరగతి విద్యార్థి చదవాలంటే ఏటా రూ.35 వేలు ఖర్చవుతుంది. ప్రయివేటు యాజమాన్యాల వసూళ్లను అరికట్టడంపై విద్యాశాఖ దృష్టి సారించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరు తున్నారు. -
వీరభద్రీయుల అభివృద్ధికి కృషి చేయాలి
కాశిబుగ్గ, న్యూస్‌లైన్ : తెలంగాణలోని వీరభద్రీయ కులస్తుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని వీరభద్రీయ కులసంఘం ఫెడరేషన్ అధ్యక్షుడు మిట్టపెల్లి సాంబయ్య కోరారు. ఇందుకోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని అన్నారు. వీరభద్రీయ కులసంఘం ఐక్యవేదిక ఫెడరేషన్ ప్రత్యేక సమావేశం సోమవారం కాశిబుగ్గలోని కేవీఎస్ ఫంక్షన్ హాల్లో జరిగింది. రాష్ట్ర పరిధిలోని 10 జిల్లాల నుంచి కులస్తులు హాజ రయ్యారు. ఈ సందర్భంగా సాంబయ్య మా ట్లాడుతూ వీరభద్రీయులు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10లక్షల మంది ఉన్నారని, వీరంతా ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాలలో వె నుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని కులసంఘాలకు ప్రభుత్వాలు ఏదో విధంగా ఆదుకుంటున్నా అల్యూమినియం, వంట పాత్రలు విక్రయిస్తూ జీవిస్తున్న వీరభద్రీయులకు ఎలాంటి రుణాలు, ఆర్థికపరమైన సహాయం, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయ డం లేదన్నారు. సంచార జీవితం గడుపుతు న్న వీరు సరైన ఐక్యత లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ విషయా న్ని బీసీ కమిషనర్, బీసీ సంక్షేమశాఖ మంత్రి ని కలసి విజ్ఞాపన పత్రం ఇస్తామని సమావేశంలో నిర్ణయించారు. వీరభద్రీయుల విద్యార్థులు బీసీ-ఏలో ఉన్నా సరైన గుర్తింపు లభిం చడం లేదన్నారు. ఈ కులస్తుల పిల్లలు ఇప్పటికే చదువుల్లో సైతం వెనుకబడి ఉన్నారని, ప్రోత్సహించాల్సిన అవసరం పాలకులపై ఎంతైనా ఉందని పేర్కొన్నారు. కులస్తులంతా ఏకతాటిపైకి వచ్చి హక్కుల సాధనకు పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం కార్యదర్శి కర్నె శివకుమార్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుని వారితో ప్రమాణస్వీకారం చేయిం చారు. వీరభద్రీయుల కుల సంఘాలకు సంబంధించిన సీడీని ఆవిష్కరించారు. విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ తెలంగాణ రాష్ట్ర పరిధిలోని జిల్లాల్లో ఉన్న కులస్తుల్లో ఎల్కేజీ నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ అందజేశారు. ఇప్పటినుంచి ప్రతి సంవత్సరం కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి విద్యార్థుల అభివృద్ధిపై దృష్టి సారించనున్నట్లు నూతన కార్యవర్గం పేర్కొంది. సమావేశంలో కార్యవర్గం ముఖ్య ప్రతినిధులు జి.ఉప్పలయ్య, వరంగల్ టౌన్ అధ్యక్షుడు ఎం.సదానందం, కార్యదర్శి ఎం.సూరయ్యతోపాటు పది జిల్లాలకు చెం దిన వీరభద్రీయులు పాల్గొన్నారు.